plinary
-
‘విధ్వంసపు పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలి’
సాక్షి, హైదరాబాద్ : దేశంలో అన్ని వ్యవస్థల విధ్వంసం జరుగుతోంది.. ఆ పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలని స్వరాజ్ అభియాన్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా శనివారం జరిగిన తెలంగాణ జనసమితి పార్టీ తొలి ప్లీనరీకి యోగేంద్ర యాదవ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కేశవరావు జాదవ్ గుర్తుకొస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గూర్చి ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడటానికి తనను హరియాణా నుంచి పిలిచారన్నారు. ఇది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఇదే నిజమైన జాతీయవాదమని.. కోదండరాం కంటే పెద్ద జాతీయవాది తనకు కపడలేదన్నారు యోగేంద్ర యాదవ్. ప్రస్తుతం దేశ ప్రజలంతా నిరాశలో ఉన్నారని.. ప్రజాస్వామ్యంలో అంధకారం నెలకొందని యోగేంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ.. తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రతి ఒక్కరు తమ కల్చర్‌ను నిలబెట్టుకుంటూ.. బీజేపీ మోనో కల్చర్‌కు వ్యతిరేకంగా పోరాడలని పిలుపునిచ్చారు. అన్ని సిద్థాంతాల్లో ఉన్న మంచిని గ్రహించి ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే సిద్ధాంతాన్ని తయారు చేయాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర పొరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ ఈ రోజు దేశభక్తి గల సంఘంగా మభ్యపెడుతోందని మండి పడ్డారు. -
ఏజెన్సీలో హై అలర్ట్
రేపటి నుంచి మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జిల్లా సరిహద్దుల్లో భద్రత పెంపు జిల్లా కేంద్రానికి తరలిన నాయకులు ములుగు : ఏజెన్సీలో ఒకప్పుడు ప్రాభల్యాన్ని చాటిన మావోయిస్టులు ఉనికి చాటేందుకు కొన్ని నెలలుగా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చాలామంది సానుభూతిపరులు, మావోయిస్టు విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇది ప్రస్తుతం జిల్లా పోలీసులకు సవాల్‌గా మారింది. ఖమ్మం జిల్లా వెంకటాపురం రోడ్డుపై నాలుగు రోజుల క్రితం మావోయిస్టులు టిఫిన్ బాంబును పెట్టి హెచ్చరికలు జారీ చేయగా పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇతర జిల్లాల నుంచి సరిహద్దులోకి వచ్చే ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లాలో ప్రవేశించే ముళ్లకట్ట–పూసురు బ్రిడ్జి ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. ఏడాది నుంచి కదలికలు మూడేళ్లు స్తబ్దుగా ఉన్న మావోయిస్టుల కదలికలు ములుగు ఏజెన్సీలో ఏడాది కాలంగా మెుదలయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ 15న గోవిందరావుపేట మండలం మొద్దుగుట్ట ఎన్కౌంటర్లో శ్రుతి, విద్యా సాగర్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతకుముందు 2015 సెప్టెంబర్‌లో ములుగు మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో పొక్లెయిన్ దహనం చేసి అక్కడ కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆతర్వాత 2016 ఏప్రిల్‌లో తాడ్వాయి మండలకేంద్రంలోని అటవీశాఖ హార్ట్స్‌లో జీపు, గుడిసెను దహనం చేశారు. తర్వాత మే నెలలో మళ్లీ మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో జేసీబీని దహనం చేసి పోస్టర్ ఉంచారు. వరుస ఘటనలతో పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టిసారించింది. పక్కా ప్రణాళికతో మే 5న ఏటూర్‌నాగారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మావోయిస్టు యాక్షన్ టీం దళకమాండర్ బుట్టాయిగూడెంకు చెందిన మధు అలియాస్ కుమ్మరి సడవలయ్యను అరెస్ట్ చేశారు. ఇదే నెల 24న తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) పేరుతో బయటి నుంచి మావోయిస్టులకు సహకరిస్తున్న జిల్లా అధ్యక్షుడు నర్సంపేట మండలం ఖమ్మంపల్లికి చెందిన మిట్టగడప చిరంజీవి, ములుగు మండలం మల్లంపల్లికి చెందిన మేర్గు రాజును అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి టీమ్‌లీడర్, సంఘం రాష్ట్ర కార్యదర్శి బౌతు ఓదెలు అలియాస్ ఆజాద్ తప్పించుకున్నాడు. జూన్ 6న గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన నకిలీ నక్సలైట్ పేరాల వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు వెంకటేశ్‌కు సహకరించిన తాడ్వాయికి చెందిన చింత సురేశ్‌ను పోలీసులు పట్టుకున్నారు. 13న మావోయిస్టు కొరియర్‌గా పనిచేస్తున్న తాడ్వాయి మండలం నార్లాపురానికి చెందిన సిద్దబోయిన శివరాజ్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా జూలై 15న టీవీవీ రాష్ట్ర కార్యదర్శి ములుగు మండలం మల్లంపల్లికి చెందిన బౌతు ఓదెలును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అప్రమత్తం వరుస సంఘటనలతో ఇప్పటికే పోలీసు యంత్రాంగం ఏజెన్సీపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతివ్యూహం ర చించినట్లు సమాచారం. ఇందులో భాగంగా మూడు రోజులుగా జిల్లా సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. గోదావరి ఫెర్రి పాయింట్ల వద్ద భద్రతను మరింత పెంచారు. నాయకుల్లో గుబులు మావోయిస్టు అమవీరుల సంస్మరణ వారోత్సవాల సమయంలో ప్రతిసారి నాయకులు జిల్లా కేంద్రాలకు తరలుతూనే ఉన్నారు. గత మూడేళ్లతో పోల్చితే ఈ సారి పరిస్థితి కొంత మారింది. ఎన్కౌంటర్, మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌లతో ఏజెన్సీలో వేడెక్కింది. ఈ తరుణంలో స్థానికంగా ఉండటం మంచిదికాదని భావించి చాలామంది నాయకులు జిల్లా, రాజధాని కేంద్రానికి వెళ్లినట్లు సమాచారం. -
పార్టీ బలోపేతంపైనే దృష్టి
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ గూడుకట్టుకుని ఉన్నారు. ఆయనను మా గుండెల్లో పెట్టుకున్నాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తాం. తెలంగాణలో పార్టీ పని అయిపోందని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీటిని కార్యకర్తలు నమ్మొద్దు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ‘ప్లీనరీ’ తీర్మానానికి పార్టీ కట్టుబడి ఉంది. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్’... అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకత్వం పేర్కొంటోంది. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనాయకత్వానికి జిల్లా నాయకులు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీ మనుగడకు వచ్చిన ముప్పేమీ లేదని, జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు తమ నియోజకవర్గాల్లో శ్రమిస్తామని పలువురు నాయకులు హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే జాతీయ పార్టీగా రెండు రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు ఉంటాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమైందని పార్టీ వర్గా లు చెప్పాయి. ‘పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలో నడుస్తాం. పార్టీనీ పటిష్టం చేస్తాం. జిల్లా ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యపైనా పోరాటాలు చేస్తాం. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెడతాం. వైఎస్ఆర్ అభిమానులు ఎందరో ఉన్నారు. కష్టపడతాం. పార్టీ అభ్యర్థులం గెలి పించుకుంటాం..’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా క న్వీనర్ బీరవోలు సోమిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సమావేశంలో సీఈసీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పాదూరి కరుణ, సీనియర్ నాయకుడు గాదె నిరంజన్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దేవరకొండ కో ఆర్డినేటర్ సురేష్ నాయక్, మునుగోడు నియోజకవర్గ నాయకుడు బోయపల్లి అనంత్‌కుమార్‌గౌడ్, నకిరేకల్ నియోజకవర్గ నాయకుడు నకిరేకంటి స్వామి పాల్గొన్నారు. అదే మాదిరిగా పార్టీ ఇతర నాయకులు అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, చామల భాస్కర్‌రెడ్డి, గట్టు మధుసూదన్‌రావు, చామల భాస్కర్‌రెడ్డి, ఇరుగు వెంకటేశ్వర్లు, వడ్లోజు వెంకటేశ్వర్లు, ఇరుగు సునీల్, గూడూరు జైపాల్‌రెడ్డి హాజరయ్యారు.