plot to kill
-
భారత్‌కు మద్దతుగా.. అమెరికాపై రష్యా ఫైర్
మాస్కో: సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర విషయంలో అమెరికాపై రష్యా తీవ్ర విమర్శలు చేసింది. పన్నూ హత్య కుట్రలో భారతీయుల ప్రమేయం ఉన్నట్లు అమెరికా చేస్తున్న ఆరోపణలను రష్యా ఖండించింది. అమెరికా వద్ద ఎటువంటి విశ్వసనీయమైన సమాచారం, సాక్ష్యం లేదని మండిపడింది.భారత అంతర్గత రాజకీయాల్లో అస్థిరత కలిగించాలని, ప్రస్తుతం భారత్‌లో జరగుతున్న సాధారణ ఎన్నికలను ప్రభావితం చేయాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖారోవా ఆరోపణలు చేశారు.‘‘భారత దేశ మనస్తత్వం, చరిత్ర గురించి అమెరికాకు సరిగా తెలియదు. అందుకే అమెరికా.. మత స్వేచ్ఛపై తరచూ భారత్‌పై ఆరోపణులు చేస్తోంది. భారత్‌లోని అంతర్గత, లోక్‌సభ ఎన్నికల విషయాల్లో జోక్యం చేసుకోవాలన్న అమెరికా ప్రయత్నం స్పష్టంగా తెలుస్తోంది. పన్నూ హత్య కుట్ర విషయంలో అమెరికా దగ్గర ఎటువంటి ఆధారం లేదు. చదవండి: Gurpatwant Singh: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు?ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అమెరికా భారత్‌ను గౌరవించటం లేదు. అంతర్జాతీయ అంశాల్లో అమెరికా జోక్యాన్ని ఊహించటమే చాలా కష్టంగా ఉంది’’ అని మరియా జఖారోవా అన్నారు. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తోందని రష్యా మండిపడింది.గత నవంబర్‌లో పన్నూ హత్య కుట్రకు సంబంధించి భారత్‌కు చెందిన నిఖిల్‌గుప్తాకు ప్రమేయం ఉన్నట్లు యూఎస్ కోర్టు అభియోగాలు మోపిన విషయం తెలసిందే. అదేవిధంగా భారత్‌కు చెందిన రా(R&AW)అధికారికి పన్నూ హత్య కుట్రలో ప్రమేయం ఉందని, ఆయన పేరు.. విక్రమ్ యాదవ్ అని ఇటీవల న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో వెల్లడించగా.. భారత్ తీవ్రంగా ఖండించింది. -
కర్ణాటకలో దలైలామా హత్యకు కుట్ర
దొడ్డబళ్లాపురం: బౌద్ధ మత గురువు దలైలామా హత్యకు కుట్ర పన్నినట్టుగా కర్ణాటకలోని రామనగరలో పట్టుబడిన టెర్రరిస్టు వెల్లడించినట్టు తెలిసింది. గత ఆగస్టు 7న రామనగరకు వచ్చిన ఎన్ఐఏ బృందం జేఎంబీ టెర్రరిస్ట్ మునీర్‌ను అరెస్టు చేయడం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు చెందిన ఇతడు అక్కడ పలు పేలుళ్లలో ప్రధాన నిందితుడు. పోలీసులు గాలిస్తుండడంతో భారత్‌లోకి చొరబడి బట్టల వ్యాపారిగా మారి బెంగళూరు, రామనగరలో మకాం వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతని వ్యవహారాలపై ఎన్ఐఏ నిఘా వేసి పట్టుకుంది. విచారణలో మునీర్ ఒక్కొక్కటీ బయటపెడుతుంటే దర్యాప్తు అధికారులే నివ్వెరపోతున్నారు. దలైలామా తరచూ మైసూరు సమీపంలోని బైలుకుప్పె టిబెటన్ పునరావాస కేంద్రానికి వస్తుంటారు. ఆ సమయంలో హత్య చేయాలని రామనగరలో కుట్ర పన్నినట్లు మునీర్ వివరించాడు. దలైలామాను హత్య చేయడం ద్వారా భారత్ సహా పలు దేశాల్లో చిచ్చు పెట్టాలన్నది ఉగ్రవాదుల వ్యూహంగా అనుమానిస్తున్నారు. 2018 జనవరి 18న బిహార్‌లోని బుద్ధగయలో జరిగిన కార్యక్రమంలో బాంబు పెట్టి దలైలామా, బిహార్ గవర్నర్ ఇద్దరినీ ఒకేసారి హత్య చేయాలని కుట్ర పన్నినట్లు మునీర్ బయటపెట్టాడు. ఈ కుట్రలో పాల్గొంటున్న ముగ్గురు అనుమానితులను ఎన్ఐఏ అరెస్టు చేయడంతో పథకం పారలేదు. -
రాజద్రోహం కేసులో సీనియర్ ఎడిటర్ అరెస్ట్
ఢాకా (బంగ్లాదేశ్): రాజద్రోహం కేసులో 81 ఏళ్ల ప్రముఖ సీనియర్ ఎడిటర్‌ను శనివారం బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ బెంగాలీ మేగజైన్ మౌచకే దిల్‌కు ఎడిటర్ అయిన షఫిక్ రెహ్మాన్ గతంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాకు స్పీచ్ రైటర్‌గా పనిచేశారు. శనివారం తెల్లవారుజామున రిపోర్టర్లమంటూ ముగ్గురు వ్యక్తులు తమ ఇంటికొచ్చి రహ్మాన్‌ను తీసుకెళ్లారని అతని భార్య తలేయా రెహ్మాన్ చెప్పారు. కాగా, గతేడాది ఢాకాలో నమోదైన పెండింగ్ కేసు విషయంలో రహ్మాన్ అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాకుండా గతేడాది ప్రధాని హసీనా కుమారుడు, సమాచార ప్రసారాల సలహాదారుడు సజిబ్ వాజీద్ హత్యకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను మళ్లించేందుకే ఈ అరెస్ట్ చేసినట్లు బీఎన్పీ కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ విమర్శించారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, రహ్మాన్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.