ఆర్బీఐ మరో షాక్..!
ముంబై: నల్లకుబేరులకు రిజర్వ్ బ్యాంక్ మరో్ షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆపరేషన్ బ్లాక్ మనీ పథకంలో భాగంగా అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. "నగదు ఉపసంహరణ'' లపై సరికొత్త పరిమితిలను విధించింది. ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన ఖాతాలనుంచి నగదు విత్ డ్రాకు పరిమితిని విధించింది.
బినామీ ఆస్తి లావాదేవీ, డబ్బు లావాదేవీల నుంచి అమాయక రైతులు, గ్రామీణ ఖాతాదారుల రక్షించడానికి వీలుగా విత్ డ్రా లిమిట్ ను పదివేలకు కుదిస్తున్నట్టు వెల్లడించింది. కేవైసి ఖాతాదారులకు నెలలో పదివేలు, నాన్ కేవైసి ఖాతాదారులకు నెలలో అయిదువేలు విత్ డ్రాకు అనుమతినిస్తూ ఆర్బీఐ ఒక ప్రకటన జారీ చేసింది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులు, ఇతర ఖాతాదారులకు అక్రమ లావాదేవీలనుంచి రక్షణ కల్పించేందుకుగాను ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే 10వేలకు పైన విత్ డ్రాకు సరియైన ఆధారాలు, పత్రాలు చూపించిన తరువాత బ్యాంక్ మేనేజర్ అనుమతితో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.