Pocket Thief
-
కొట్టేసిన పర్సులు @ పోస్ట్‌బాక్స్
చెన్నై: జేబు దొంగలు కొత్త పద్ధతి కనుగొన్నారు. కొట్టేసిన పర్సులను తెలివిగా వదిలించుకుంటున్నారు. ఐడీ కార్డులున్న పర్సులను వదిలించుకునేందుకు పోస్టు బాక్సులను స్వర్గధామంగా వాడుకుంటున్నారని చెన్నైలోని పోస్టల్ డిపార్ట్మెంట్ చెబుతోంది. గత ఆరు నెలలుగా ఇలాంటివి చాలా కేసులు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. పర్సుల నుంచి డబ్బులు తీసుకున్నాక వాటిని పోస్టు బాక్సుల్లో వేస్తున్నారని, అందులో ఐడీ కార్డులను మాత్రం ముట్టుకోకుండా అలాగే ఉంచేస్తున్నారని చెన్నై పోస్టల్ అధికారి ఒకరు తెలిపారు. గత ఆరు నెలల్లో చెన్నై సిటీ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 70 కేసులు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. పర్సుల్లో ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల వంటివి ఉంటున్నట్లు తమ సిబ్బంది గుర్తించిందని చెప్పారు. అందులో ఉన్న ఐడీ కార్డులు సరైన అడ్రస్‌కు చేరుకునేలా తమ సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అలా చేయడం వల్ల తమకేం ఆదాయం రాదని, అయినా ఇదో సేవలాగా తాము ఈ పనిచేస్తున్నామని వివరించారు. ఐడీ కార్డుల్లో ఫోన్ నంబర్ తదితర వివరాలుంటే వారిని సంప్రదించి సంబంధిత పోస్టాఫీసుల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు. -
‘రెక్కల కష్టం’ దోచుకున్నారు..
* పంట అమ్మిన డబ్బు చోరీ * రైతు జేబు కత్తిరించిన దొంగలు సుల్తాన్‌బజార్: ఆరుగాలంపడిన కష్టం దొంగలపాలైంది. కుటుంబీకులతో కలిసి రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను విక్రయించగా వచ్చిన సొమ్మును జేబుదొంగలు అపహరించారు.ఈ సంఘటన గురువారం సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఎస్ఐ పవన్ కథనం ప్రకారం.. పూడూరు మండలం చైలాపూర్ గ్రామానికి చెందిన పట్లోళ్ల గోపాల్‌రెడ్డి(57) ఖరీఫ్‌లో పండించిన మక్కలను సంతోష్‌నగర్‌లోని వ్యాపారికి విక్రయించాడు.గురువారం నగరానికి వచ్చి రూ. 95 వేలు తీసుకున్నాడు. అక్కడి నుంచి అబిడ్స్ వచ్చి ఓ దుకాణంలో చెప్పులు కొన్నాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లేందుకు అబిడ్స్ నుంచి కోఠి బయలుదేరాడు. కాగా, అతడిని ఆటోలో అనుసరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జేబు కత్తిరించి రూ.95 వేలు అపహరించారు. కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద విషయం తెలుసుకున్న గోపాల్‌రెడ్డి షాక్‌కు గురయ్యాడు. తర్వాత తేరుకొని సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.