Police Diary
-
డైరీ రాయడం రావట్లేదు!
పాఠకులనైనా, ప్రేక్షకులనైనా అత్యంత ఆకర్షించే అంశాల్లో క్రైమ్ ముందుంటుంది. అందుకనే నేర సంబంధిత షోలు ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాయి. అవుతాయా? కచ్చితంగా అవుతాయి. కానీ తీయాల్సినట్టే తీస్తేనే. ఏ హిందీ చానెలైనా చూడండి... తప్పకుండా క్రైమ్ షో ఉంటుంది. సావధాన్ ఇండియా, క్రైమ్ పెట్రోల్, గుమ్రాహ్... ఇలా ఎన్నో. ఈ తరహాలోనే తెలుగులో మొదలైంది... పోలీస్ డైరీ. అయితే హిట్ మాత్రం కాలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. హిందీ క్రైమ్ షోస్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం... స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు మంచి నటీనటులు. కానీ పోలీస్ డైరీలో నటీనటులను చూస్తే అసలు వీళ్లకు నటన వచ్చా అనిపి స్తుంది. వాళ్ల హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఎంత ఆర్టిఫీషియల్‌గా ఉంటాయంటే, చానెల్ మార్చే వరకూ మనశ్శాంతి ఉండదు ప్రేక్ష కుడికి. హిందీ షోలలో ఒక్కోసారి యాంకర్లుగా ప్రముఖ నటీనటులు కూడా కనిపిస్తుంటారు. ఇక్కడ మొదట్లో నాగబాబుతో మొదలెట్టినా, తర్వాత గ్లామర్ లేకుండా చేసేశారు. జనాన్ని చైతన్యవంతుల్ని చేస్తామని చెప్తూ... ఎంతసేపూ వివా హేతర సంబంధాలు, అమ్మాయిల ట్రాప్ వంటివే ఎక్కువగా చూపిస్తు న్నారు. కొన్ని సన్నివేశాల్ని కాస్త అతిగా చూపించడం కూడా జరుగుతోంది. ఈ మైనస్‌లన్నీ చూస్తే, డైరీ రాయడం రానట్టే అన్పిస్తోంది మరి! -
కబ్జాదారులపై కన్ను!
ల్యాండ్ మాఫియా పీచమణచడానికి సైబరాబాద్ పోలీసులు పావులు కదుపుతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ భూములను లాక్కుంటున్న వారిని ఓ పట్టుపట్టడానికి సిద్ధమవుతున్నారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల భూముల ధరలు ఆకాశాన్నం టిన తరుణంలో, జంట నగరాల్లో ల్యాండ్‌మాఫియా విపరీతంగా పెరి గింది. ‘సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోరు’ అంటూ పోలీస్స్టేషన్ల గోడలపై రాసి ఉన్న వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని మాఫియా రెచ్చిపోతోంది. నగరంలో కొందరు రాజకీయం, రౌడీయిజం, పెద్దమనుషుల ముసుగులో పాల్పడుతున్న ఈ అరాచకాలకు అడ్డుకట్టవేయడానికి సైబరాబాద్ పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల గుప్పిట్లో చిట్టా.. భూకబ్జాలకు పాల్పడే వ్యక్తుల ప్రొఫైల్‌ను తయారుచేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వారి చిట్టా పోలీస్ డైరీలో ఉంది. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకునే విషయమై దృష్టి సారించే అవకాశం ఉంది. కబ్జాలకు పాల్పడేవారితోపాటు, వారికి సహకరించే వారిపై కూడా నిఘా పెట్టారు. కబ్జాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదంటున్న పోలీసులు ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమాయక ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్నదంతా ఎగురేసుకుపోతున్న ల్యాండ్ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దని, వారిపై రౌడీషీట్లు తెరవాలని పలువురు బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. ప్రాంతాలవారీగా వివరాల సేకరణ నగరం చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో భూమి అమ్మిన భూ యజమానులతో కుమ్మక్కవుతున్న ల్యాండ్ మాఫియా తమకు అమ్మినట్లు వారితో పాత తేదీలతో కాగితాలు రాయించి భూమి కొనుగోలు చేసిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వంద గజాలకు మించి ఖాళీ స్ధలం కనిపిస్తే అక్కడ దస్తీవేసే పనిలో ఉన్నారు. జవహర్‌నగర్‌లో కొంతమంది కబ్జాదారులు, మాజీ సైనికుల దగ్గర భూమిని కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్న వారి వివరాలను ఆరాతీస్తున్నారు. కబ్జాదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే నగరంలో భూఆక్రమణలు చేయడానికి ఎవ రూ సాహసించరని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిశిత పరిశీలన.. మార్పునకు శ్రీకారం ఓ వ్యక్తి భూమిని ఆక్రమించుకునేందుకు దోహదపడుతున్న అంశాలను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక ముందు అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా ఉండేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. బాధితులకు న్యాయం జరిగే దిశగా కబ్జాలను వెలికితీసి అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలనే దిశగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఆక్రమణదారుల ఆస్తులపై నిఘా పెట్టారు. ఇక పోలీసుల విచారణలో భూములు కబ్జాలకు గురైనట్లు తేలితే.. వాటి ని బాధితులకు తిరిగి ఇచ్చే అవకాశాలను కల్పిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సదరు భూమిని మరొకరికి అమ్మిన పక్షంలో బాధితులకు ఎలా న్యాయం చేయాలనే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కబ్జాదారుల్లో భయం.. భయం నకిలీ డాక్యుమెంట్లను పోలీసు శాఖ సేకరిస్తోందనే సమాచారం అందుకున్న కబ్జాదారులు భయాందోళనకు గుర వుతున్నారు. చేసిన తప్పులకు మూల్యం చె ల్లించాల్సి వస్తుందని భావిస్తున్న కొందరు కబ్జాదారులు తమ ఇళ్లలోంచి నకిలీ డాక్యుమెంట్లను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.