polycet results
-
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: పాలిసెట్ -2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కమ్‌లో చెక్ చేసుకోండి శనివారం విజయవాడ బందర్ రోడ్డులోని ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉదయం 10.45 గం.లకు నాగరాణి “పాలిసెట్ – 2023” ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం 10 మే, 2023 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాలీసెట్ - 2023 ప్రవేశ పరీక్షకు 1,60,332 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 1,43,625 మంది (89.56%) హాజరయ్యారని, అందులో 1,24,021 మంది విద్యార్థులు(86.35%) ఉత్తీర్ణత సాధించారని ఆమె వివరించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 49,388 మంది అమ్మాయిలు(89.90%) కాగా, 74,633 మంది అబ్బాయిలు (84.74%) అని వెల్లడించారు. 120 మార్కులకు గానూ 30 మార్కులు(25%) సాధించిన విద్యార్థులను అర్హులుగా పరిగణించామన్నారు. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకి చెందిన 15 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారని వెల్లడించారు. అత్యధికంగా ఉత్తీర్ణులైన 10,516 మంది విద్యార్థినీ, విద్యార్థులు విశాఖపట్నం జిల్లాకు చెందిన వారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఉత్తీర్ణతకు ఎలాంటి అర్హత మార్కులు లేకపోవడం వల్ల పరీక్షకు హాజరైన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి ఉత్తీర్ణులే అని స్పష్టం చేశారు. పాలిసెట్ పరీక్షలో ఒకే రకమైన మార్కులు పొందిన విద్యార్థులకు గణితం మార్కులను పరిగణలోకి తీసుకొని ర్యాంకుల వరుస క్రమాలను నిర్ణయించామన్నారు. గణితంలోనూ ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు భౌతిక శాస్త్రం మార్కులను, భౌతిక శాస్త్రంలో కూడా ఒకే రకమైన మార్కులు వస్తే పదో తరగతి మార్కులను, పదో తరగతిలో కూడా ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు పుట్టిన తేదీ ఆధారంగా ప్రాధాన్యతను నిర్ణయించి ర్యాంకులను ప్రకటించామన్నారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://polycetap.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించి ర్యాంకు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. 25 మే, 2023న వెబ్ కౌన్సెలింగ్ తేదీల వివరాలు తెలుపుతూ పత్రికల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 29 మే, 2023 నుండి పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ లకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు ముందుగా వెబ్ అప్లికేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వం అదనంగా ఏర్పాటు చేసిన 4 హెల్ప్ లైన్ సెంటర్లతో కలిపి మొత్తం 39 హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 1 జులై, 2023 నుండి తరగతులు ప్రారంభించే యోచనలో ఉన్నామన్నారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా బేతంచెర్ల, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో అదనంగా చేర్చిన 840 సీట్లతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 17,934 సీట్లు, ఒక ఎయిడెడ్ కాలేజీలో 125 సీట్లు, 177 ప్రైవైట్ కాలేజీల్లో 59,058 సీట్లు మొత్తంగా తొలి ఏడాది పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 77,177 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా కాలేజీల్లో 31 బ్రాంచుల్లో రెండేళ్లు, మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో కూడిన డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. అందులో కొత్తగా 500 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకాగా లెర్నింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్, మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పద్ధతుల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు. 2023-24 సంవత్సరానికి గానూ గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ డిప్లొమా కోర్సులు అదనంగా చేర్చామన్నారు. ఈ ఏడాది 5 కాలేజీలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ లభించిదన్నారు. అదనంగా మరో రెండు కాలేజీలకు అక్రిడిటేషన్ వస్తుందన్నారు. లేబొరెటీస్, కంప్యూటర్ ల్యాబ్స్ ను మరింతగా అభివృద్ధి చేస్తూ మరో 49 పాలిటెక్నిక్ కాలేజీల్లో అక్రిడిటేషన్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.. స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కోసం 33 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లలో కరికులమ్ కు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. 2022-23 సంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో చివరి సంవత్సరం అభ్యసిస్తున్న 4000 మందికి పైగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో 84,117 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న విద్యాదీవెన క్రింద రూ.44.37 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ లబ్ధి పొందారని, 79,768 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న వసతి దీవెన క్రింద రూ.57.44 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందారని వెల్లడించారు. అదే విధంగా ఏఐసీటీఈ స్కాలర్ షిప్స్ లో భాగంగా ప్రగతి స్కాలర్ షిప్ క్రింద అమ్మాయిల రూ.50 వేలు, సాక్ష్యం స్కాలర్ షిప్ క్రింద వికలాంగులైన విద్యార్థులు రూ.50వేలు సాయం పొందారన్నారు. పాలిసెట్-2023 ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు సెక్రటరీ కే.వి. రమణబాబు, జాయింట్ డైరెక్టర్ వి. పద్మారావు, సంబంధిత శాఖా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ? -
ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల
-
AP: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
-
AP: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణశాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మంచి ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 81వేల మంది విద్యార్థులకి రూ.128 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. 72 వేల మంది విద్యార్థులకి రూ.54 కోట్లు జగనన్న వసతి దీవెనగా అందించామని చెప్పారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం, అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు అని పేర్కొన్నారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు పాల్గొన్నారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
పాలిసెట్‌లో 81.75 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్–21 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 17న జరిగిన పాలిసెట్–21 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,02,496 మంది దరఖాస్తు చేసుకోగా, 92,557 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 81.75శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.. అంటే 75,666 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 39,186, బాలికలు 33,071 మంది ఉన్నారు. సాధారణంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పాలిసెట్ పరీక్షను నిర్వహిస్తుండగా... కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో పదోతరగతి బోర్డు పరీక్షలు నిర్వహించకపోవడంతో బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు సైతం ఈ సెట్ ఫలితాల ఆధారంగా నిర్వహిస్తున్నారు. అతి త్వరలో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ వేర్వేరుగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. పాలిసెట్‌లో సాధించిన మార్కులు, ర్యాంకులకు సంబంధించిన సమాచారం, ర్యాంకు కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు సాంకేతిక విద్యా కమిషనర్ తెలిపారు. -
TS Polycet Results: పాలిసెట్ ఫలితాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ పాలిసెట్-2021 ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం రిజల్ట్స్ విడుదల చేసింది. కాగా ఇందుకు సంబంధించిన పరీక్షను ఈనెల 17న నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,02,496 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వివరాలు నమోదు చేసుకోగా.. 92,557 మంది హాజరయ్యారు. వీరిలో 75,666 (81.75%) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు నేటి ఫలితాల్లో వెల్లడైంది. ఈ క్రమంలో రెండు విడతలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. తొలి విడతలో భాగంగా.. ఆగస్టు 5 నుంచి ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలనకు ఆగస్టు 5 నుంచి 9 వరకు స్లాట్ బుకింగ్‌కు అవకాశమిచ్చారు. ఆగస్టు 6 నుంచి 10 వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఇక ఆగస్టు 6 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 14న సీట్ల కేటాయింపు జరుగనుంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి రెండో విడత షెడ్యూల్: పాలిసెట్ కౌన్సెలింగ్ : ఆగస్టు 23, 2021 సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ : ఆగస్టు 23, 2021 సర్టిఫికెట్ వెరిఫికేషన్ :ఆగస్టు 24, 2021 వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 24, 25. పాలిటెక్నిక్ సీట్లు కేటాయింపు : ఆగస్టు 27 -
ఏపీ పాలిసెట్ 2020: ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2020 ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ప్రసాదంపాడులోని సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఎంఎం నాయక్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ పాలిసెట్ 2020లో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సీఎస్ అనంతరాము తెలిపారు. (పాలిసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆయన మాట్లాడుతూ.. ‘పాలిసెట్ 2020 పరీక్షకు 88,372 మంది అభ్యర్థులు నమోదు చేసుకొన్నారు. అందులో 71,631 మంది పరీక్ష రాయగా 84 శాతంతో 60,780 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 50,706 మంది పరీక్షలు రాయగా 42,313 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 20,925 మంది పరీక్షలు రాయగా 18,467 మంది ఉత్తీర్ణత సాధించారు. పశ్చిమ గోదావరికి చెందిన మట్టా దుర్గా సాయి కీర్తి తేజ 120 మార్కులతో టాప్ 1 లో నిలిచారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుంకర అక్షయ ప్రణీత్ 119 మార్కులతో రెండో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సవిలత శ్రీదత్త శ్యామ సుందర్ 118 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటుకు సంబంధించి 271 కళాశాలల్లో 66,742 సీట్లు అందుబాటులో ఉన్నాయి’అని అనంతరాము పేర్కొన్నారు. (పాలిసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాలిసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్–2020 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ పరీక్ష రాసేందుకు 72,920 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, ఈనెల 2న జరిగిన పరీక్షకు 56,945 మంది హాజరయ్యారు. అందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 46,207 మంది (81.14 శాతం) అర్హత సాధించగా, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 46,318 మంది (81.34 శాతం) అర్హత సాధించినట్లు (ఒకే విద్యార్థికి రెండు కేటగిరీల్లో ర్యాంకులు) కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. సాంకేతిక విద్యాభవన్‌లో గురువారం పాలిసెట్ ఫలితాలను నవీన్ మిట్టల్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందులో 120 మార్కులకు గాను 30 శాతం (36 మార్కులు) మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక మార్కును కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామని, పరీక్షకు హాజరైన 9,510 మంది ఎస్సీ విద్యార్థుల్లో 9,508 మందికి, పరీక్షకు హాజరైన 4,715 మంది ఎస్టీ విద్యార్థులకు ర్యాంకులను కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లలో సీట్లను కేటాయిస్తామని వివరించారు. విద్యార్థులు ఈనెల 12 నుంచి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ పాలిసెట్-2019 ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్-2019 ఎంట్రన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఏడాది పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,24,899 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎస్బీటీఈటీ చైర్మన్ జీఎస్ పండదాస్ పేర్కొన్నారు. పాలిసెట్ 2019లో 70, 051 మంది బాలురు ,35,276 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఈ పరీక్షలో 120 మార్కులకు 36 మార్కులు సాధించినట్లైతే ఉత్తీర్ణులవుతారన్న ఆయన.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం ఉత్తీర్ణత శాతం మార్కులు కచ్చితంగా సాధించాలనే నిబంధన ఏమీ లేదన్నారు. గతేడాది మొత్తం 41 శాతం సీట్లు భర్తీ అయ్యాయని, ప్రస్తుతం 209 కళాశాలల్లో 75 వేల 971 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వీటి భర్తీకై ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి మే 24 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆన్లైన్ ద్వారా ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని.. జూన్ 6 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. కాగా పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలో ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మొదటి పది ర్యాంకుల్లో అత్యధిక స్థానాలు సాధించి సత్తా చాటారు. (ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 1. చింతా శివమాధవ్- తూర్పు గోదావరి 2. మద్దులపల్లి ఫణి- గుంటూరు 3. చందం వివేక్- తూర్పు గోదావరి 4. కొమ్ముల చైత్రి- పశ్చిమ గోదావరి 5. ఆకేళ్ల శ్రీనివాస్-పశ్చిమ గోదావరి 6. లింగాల అనంత్-పశ్చిమ గోదావరి 7. చందన కిరణ్మయి- తూర్పు గోదావరి 8. వి.ఆదిత్య- తూర్పు గోదావరి 9. అప్పరి హర్షిత- తూర్పు గోదావరి 10. పిచ్చాని గుణం- పశ్చిమ గోదావరి -
పాలీసెట్ ఫలితాల విడుదల
తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. పాలీసెట్ ఫలితాలు www.sakshi.comలో అందుబాటులో ఉన్నాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
ఏపీ పాలిసెట్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 70.80 శాతం మంది ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 69.34 శాతంగా ఉండగా, బాలికల ఉత్తీర్ణత 78.31 శాతం ఉంది. (పాలిసెట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి) తూర్పుగోదావరి జిల్లాకు చెందిన హిమజ 120 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మి 120 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. ఉత్తీర్ణత శాతంతో పాటు మొదటి రెండు ర్యాంకులలోనూ అమ్మాయిలే పైచేయి సాధించడం విశేషం. 119 మార్కులతో గోపీరెడ్డి, మోహన్ రఘు, సాయిశ్రీకుమార్ మూడో ర్యాంకు సాధించారు. ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని, 26వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.