సాక్షి, హైదరాబాద్: పదో తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ పాలిసెట్-2021 ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం రిజల్ట్స్ విడుదల చేసింది. కాగా ఇందుకు సంబంధించిన పరీక్షను ఈనెల 17న నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,02,496 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వివరాలు నమోదు చేసుకోగా.. 92,557 మంది హాజరయ్యారు. వీరిలో 75,666 (81.75%) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు నేటి ఫలితాల్లో వెల్లడైంది.
ఈ క్రమంలో రెండు విడతలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. తొలి విడతలో భాగంగా.. ఆగస్టు 5 నుంచి ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలనకు ఆగస్టు 5 నుంచి 9 వరకు స్లాట్ బుకింగ్‌కు అవకాశమిచ్చారు. ఆగస్టు 6 నుంచి 10 వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఇక ఆగస్టు 6 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 14న సీట్ల కేటాయింపు జరుగనుంది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
రెండో విడత షెడ్యూల్:
పాలిసెట్ కౌన్సెలింగ్ : ఆగస్టు 23, 2021
సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ : ఆగస్టు 23, 2021
సర్టిఫికెట్ వెరిఫికేషన్ :ఆగస్టు 24, 2021
వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 24, 25.
పాలిటెక్నిక్ సీట్లు కేటాయింపు : ఆగస్టు 27
Comments
Please login to add a commentAdd a comment