ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 70.80 శాతం మంది ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 69.34 శాతంగా ఉండగా, బాలికల ఉత్తీర్ణత 78.31 శాతం ఉంది. (పాలిసెట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి)
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన హిమజ 120 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మి 120 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. ఉత్తీర్ణత శాతంతో పాటు మొదటి రెండు ర్యాంకులలోనూ అమ్మాయిలే పైచేయి సాధించడం విశేషం. 119 మార్కులతో గోపీరెడ్డి, మోహన్ రఘు, సాయిశ్రీకుమార్ మూడో ర్యాంకు సాధించారు. ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని, 26వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.