సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి బుధవారం విడుదల చేశారు. విధానపరమైన కారణాలతో వాయిదా పడిన పాలిసెట్ ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమయింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల్లోగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఆగస్టు 16వ తేదీ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చన్నారు. 18వ తేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. 19వ తేదీ నుంచి 23లోగా విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల్లో నేరుగా రిపోర్టు చేయాలన్నారు. 23వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. మొత్తం 88 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 18,141 సీట్లు, 182 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 64,933 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
చదవండి: మచిలీపట్నం కలెక్టరేట్‌లో.. కాబోయే కలెక్టర్-ఎస్పీలు.. సింపుల్‌గా దండలు మార్చేసుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment