సాక్షి, అమరావతి : పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్-2019 ఎంట్రన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఏడాది పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,24,899 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎస్‌బీటీఈటీ చైర్మన్ జీఎస్ పండదాస్ పేర్కొన్నారు. పాలిసెట్ 2019లో 70, 051 మంది బాలురు ,35,276 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఈ పరీక్షలో 120 మార్కులకు 36 మార్కులు సాధించినట్లైతే ఉత్తీర్ణులవుతారన్న ఆయన.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం ఉత్తీర్ణత శాతం మార్కులు కచ్చితంగా సాధించాలనే నిబంధన ఏమీ లేదన్నారు. గతేడాది మొత్తం 41 శాతం సీట్లు భర్తీ అయ్యాయని, ప్రస్తుతం 209 కళాశాలల్లో 75 వేల 971 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వీటి భర్తీకై ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి మే 24 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ ద్వారా ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని.. జూన్ 6 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
కాగా పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలో ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మొదటి పది ర్యాంకుల్లో అత్యధిక స్థానాలు సాధించి సత్తా చాటారు.
(ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
1. చింతా శివమాధవ్- తూర్పు గోదావరి
2. మద్దులపల్లి ఫణి- గుంటూరు
3. చందం వివేక్- తూర్పు గోదావరి
4. కొమ్ముల చైత్రి- పశ్చిమ గోదావరి
5. ఆకేళ్ల శ్రీనివాస్-పశ్చిమ గోదావరి
6. లింగాల అనంత్-పశ్చిమ గోదావరి
7. చందన కిరణ్మయి- తూర్పు గోదావరి
8. వి.ఆదిత్య- తూర్పు గోదావరి
9. అప్పరి హర్షిత- తూర్పు గోదావరి
10. పిచ్చాని గుణం- పశ్చిమ గోదావరి
Comments
Please login to add a commentAdd a comment