poor brahmins
-
పేద బ్రాహ్మణునికి తలసాని సాయం..
సనత్‌నగర్: ఓ పురోహితుడు వాహనదారులను యాచిస్తున్న సంఘటన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలచివేసింది. ‘హతవిధీ’ శీర్షికన లాక్డౌన్ సమయంలో జనులు పడుతున్న కష్టాలకు దర్పణంగా నిలుస్తూ ఓ పేద బ్రాహ్మణుడు వాహనదారులను యాచిస్తుండడంపై ‘సాక్షి’లో బుధవారం ఫొటో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన మంత్రి ఆగమేఘాలపై వారి వివరాలను సేకరించి వారికి సహాయం చేసేందుకు ముందుకువచ్చారు. నెల రోజులకు సరిపడా బియ్యం, మంచినూనె, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులతో పాటు రూ.2,000ల నగదును మంత్రి తలసాని అందజేశారు.(సొంతూళ్లకు వెళ్లేందుకు ఓకే) -
‘పేద బ్రాహ్మణులకూ కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాలి’
హైదరాబాద్: పేద బ్రాహ్మణులకు కూడా ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం బ్రాహ్మణులను అగ్రకులంగా పరిగణిస్తూ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బ్రాహ్మణుల్లో సైతం పేద వారున్నారని... వారికి కల్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కె.దేవిప్రసాద్, పల్ల రాజేశ్వర్‌రెడ్డిలకు సంపూర్ణ మద్దతు తెలిపుతున్నామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువతుల వివాహం కోసం సాయం అందించేందుకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.