పేద బ్రాహ్మణునికి తలసాని సాయం.. | Talasani Srinivas Yadav React on Sakshi Article on Poor Brahmin | Sakshi
Sakshi News home page

పేద బ్రాహ్మణునికి నిత్యావసరాల పంపిణీ

Published Thu, Apr 30 2020 7:35 AM | Last Updated on Thu, Apr 30 2020 11:45 AM

Talasani Srinivas Yadav React on Sakshi Article on Poor Brahmin

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పంపించిన సరుకులతో బ్రాహ్మణ దంపతులు

సనత్‌నగర్‌: ఓ పురోహితుడు వాహనదారులను యాచిస్తున్న సంఘటన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలచివేసింది. ‘హతవిధీ’ శీర్షికన లాక్‌డౌన్‌ సమయంలో జనులు పడుతున్న కష్టాలకు దర్పణంగా నిలుస్తూ ఓ పేద బ్రాహ్మణుడు వాహనదారులను యాచిస్తుండడంపై ‘సాక్షి’లో బుధవారం ఫొటో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన మంత్రి ఆగమేఘాలపై వారి వివరాలను సేకరించి వారికి సహాయం చేసేందుకు ముందుకువచ్చారు. నెల రోజులకు సరిపడా బియ్యం, మంచినూనె, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులతో పాటు రూ.2,000ల నగదును మంత్రి తలసాని అందజేశారు.(సొంతూళ్లకు వెళ్లేందుకు ఓకే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement