‘పేద బ్రాహ్మణులకూ కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాలి’ | kalyani lakshmi scheme should be provided for poor brahmins | Sakshi
Sakshi News home page

‘పేద బ్రాహ్మణులకూ కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాలి’

Published Tue, Mar 3 2015 11:12 PM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM

kalyani lakshmi scheme should be provided for poor brahmins

హైదరాబాద్: పేద బ్రాహ్మణులకు కూడా ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం బ్రాహ్మణులను అగ్రకులంగా పరిగణిస్తూ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బ్రాహ్మణుల్లో సైతం పేద వారున్నారని... వారికి కల్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు.

 

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కె.దేవిప్రసాద్, పల్ల రాజేశ్వర్‌రెడ్డిలకు సంపూర్ణ మద్దతు తెలిపుతున్నామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువతుల వివాహం కోసం సాయం అందించేందుకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement