Poor student Education
-
ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు చదివిస్తా.. పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి అండ
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుల తల్లి సుమలతకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. ఆమె ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు ఫీజు చెల్లించి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీల కూతురు కాట్రోత్ సుమలతకు ఎంబీబీఎస్ సీటు వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులతో కూలి పనులకు వెళ్తోందని బుధవారం సాక్షి దినపత్రికలో ‘ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలీ పనులకు’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సుమలత, ఆమె తండ్రి శివరాంను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మంత్రి మాట్లాడారు. సుమలత చదువుకు ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా వైద్య కళాశాలకు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఇతర ఖర్చులకు రూ.50 వేలు అందజేశారు. సుమలత ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాగా చదివి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రికి సుమలత తండ్రి శివరాం కృతజ్ఞతలు తెలిపారు. సాయం చేస్తే డాక్టర్ అవుతా..బీహెచ్ఎంఎస్ సీటు సాధించిన పేద విద్యార్థి సంతోష్‌కుమార్ ఫీజు కట్టలేని స్థితిలో దాతల చేయూత కోసం ఎదురుచూపు అనంతగిరి: డాక్టర్ కావాలనుకుంటున్న ఆ విద్యార్థి కలకు పేదరికం అడ్డుపడుతోంది. మనసున్న దాతలు ఎవరైనా ఆర్థికంగా చేయూతనందిస్తే.. భవిష్యత్‌లో సమాజ సేవకు పాటుపడతానని చెబుతున్నాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్ద చెల్మెడ గ్రామానికి చెందిన సంతోష్.. వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివి, 959 మార్కులు సాధించాడు. నీట్‌లోనూ ఉత్తమ ర్యాంకు రావడంతో హైదరాబాద్‌లోని రామంతాపూర్ జేఎస్పీఎస్ హోమియో మెడికల్ కాలేజీలో బీహెచ్ఎంఎస్ (బ్యాచ్‌లర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసన్ అండ్ సర్జరీ) సీటు వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఫీజు, వసతి కోసం నవంబర్ 2న లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. అనారోగ్యం బారిన పడిన తండ్రి అశోక్ 11 నెలల క్రితం మృతిచెందగా.. తల్లి పుష్పమ్మ కూలి పనులు చేస్తోంది. తండ్రి మరణంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఫీజు కట్టే స్తోమత లేదని సంతోష్ వాపోతున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు సెల్ నంబర్ 9963870085లో సంప్రదించాలని కోరాడు.చదవండి: ఏడు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడుగోండు కళాకారుడికి అవార్డు జైనూర్ (ఆసిఫాబాద్): ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను తెలిపేలా దండారీ ఉత్సవాల చిత్రాన్ని గీసిన ఆదివాసీ కళాకారుడు మడావి ఆనంద్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా బుధవారం అవార్డు అందుకున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామానికి చెందిన మడావి ఆనంద్‌రావు చిత్రకళలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో 13 రోజులుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సంప్రదాయ చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ఆనంద్‌రావు గుస్సాడీ నృత్యాలకు సంబంధించిన చిత్రం గీసి అవార్డు అందుకున్నారు. -
బైజూస్‌తో ఒప్పందం పేద విద్యార్థులకు మేలు
నెల్లిమర్ల రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో చేసుకున్న ఒప్పందంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్ధులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలో సతివాడ ఆదర్శ పాఠశాలలో గురువారం అమ్మఒడి వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్డుకొండ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్న పిల్లలు మాత్రమే బైజూస్ విధానంలో చదవగలరని.. తాజా ప్రభుత్వ ఒప్పందంతో ప్రభుత్వ విద్యార్థులు ఉచితంగానే విద్యనభ్యసిస్తారన్నారు. 4 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బైజూస్ కంటెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ, నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. అనంతరం రూ.10.76 కోట్ల నమూనా చెక్కును తల్లిదండ్రులకు అందజేశారు. పది, ఇంటర్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, డీసీసీబీ వైస్ చైర్మెన్ చనమళ్లు వెంకటరమణ, వైస్ ఎంపీపీ పతివాడ సత్యనారాయణ, కార్పొరేషన్ డైరెక్టర్లు రేగాన శ్రీనివాసరావు, జానా ప్రసాద్, నౌపాడ శ్రీనివాసరావు, సర్పంచ్ రేవళ్ల శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సత్యనారాయణ, నాయకులు జమ్ము అప్పలనాయుడు, లెంక గోవిందరావు, తహసీల్దార్ రమణరాజు, ఎంఈఓ కృష్ణారావు, ప్రిన్సిపాల్ పద్మలత పాల్గొన్నారు. (చదవండి: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
చదువుల తల్లికి అండగా నిలిచిన కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: నల్లగొండలోని గొల్లగూడ పెద్దబండకు చెందిన బోడ అమృత వర్షిణి తండ్రి ఆటో డ్రైవర్, తల్లి టైలర్‌గా పని చేస్తోంది. వీరి సంపాదన కుటుంబ పోషణకే ఖర్చవుతోంది. ఇలాంటి పరిస్థితిలోనే అమృత వర్షిణి తన చదువును కొనసాగిస్తోంది. కష్టపడి చదివిన అమృత వర్షిణి పైలెట్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ట్రైనింగ్ దశలో ఉన్న వర్షిణి తన చదువును పూర్తి చేయాలంటే రూ.6 లక్షలు అవసరం ఉంది. ఆమె కుటుంబ నేపథ్యంతో డబ్బులు కట్టడం కష్టంగా మారింది. దీంతో ఆమె తన పరిస్థితిని, లక్ష్యాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వాట్సాప్ ద్వారా తెలియజేసింది. వెంటనే స్పందించిన ఆయన అమృతవర్షిణిని తన ఇంటికి పిలిపించుకుని రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. చదువు పూర్తయ్యే వరకు ఖర్చుతానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నుంచి ఎప్పటి వరకు డాక్టర్లు, ఇంజనీర్లను మాత్రమే చదవించిన తాను ఇప్పుడు అమృతవర్షిణి పైలెట్ చదువుకు సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. -
Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు
ప్రైవేటు వర్సిటీల్లో ఇకపై 35 శాతం సీట్ల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కానుంది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలకు లబ్ధి చేకూరనుంది. ప్రొఫెషనల్ కోర్సుల్లో ‘ఏపీ ఈఏపీ సెట్’ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారా, ఇతర కోర్సుల్లో సంబంధిత విధివిధానాలను అనుసరించి ప్రవేశాలు కల్పిస్తారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ యూనివర్సిటీల్లో సీట్లు ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకూ అందుబాటులోకి రానున్నాయి. ఈ వర్సిటీల్లో 35 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో భర్తీ చేయనుండటంతో ఈ అవకాశం దక్కనుంది. ఇప్పటివరకు ఆర్థిక స్థోమత కలిగిన వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వర్సిటీల్లో చేరే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకూ కల్పిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు ఖర్చులకు డబ్బులు కూడా చెల్లిస్తూ పేద విద్యార్థులు అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. 2021–22 విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని ప్రైవేట్ వర్సిటీల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్‌చంద్ర ‘సాక్షి’కి వివరించారు. చదవండి: విశ్వ బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం అండ ఇందుకు సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తెచ్చిందని తెలిపారు. దీనివల్ల ఈ వర్సిటీల్లోని ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులన్నిటిలోనూ ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ప్రొఫెషనల్ కోర్సుల్లో ‘ఏపీ ఈఏపీ సెట్’ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారా, ఇతర కోర్సుల్లో సంబంధిత విధివిధానాలను అనుసరించి ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి, వెల్లూరు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అమరావతి, సెంచూరియన్ యూనివర్సిటీ, విశాఖపట్నం, కేఆర్ఈఏ యూనివర్సిటీ శ్రీసిటీ సూళ్లూరుపేట, వేల్‌టెక్ యూనివర్సిటీ చిత్తూరు తదితర ప్రైవేట్ యూనివర్సిటీల్లోని వివిధ కోర్సులలో 35 శాతం సీట్లు ప్రభుత్వ పరిధిలో భర్తీ కానున్నాయి. నాడు నిబంధనలు గాలికి.. గత సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తప్పించుకునేందుకు కన్వీనర్ కోటా నిబంధన అమలును గాలికి వదిలేసింది. టీడీపీ హయాంలో ఈ నిబంధనను పట్టించుకోలేదు. ఇప్పుడు దీన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజుల బకాయిలు రూ.1,800 కోట్లను అధికారంలోకి రాగానే చెల్లించడంతోపాటు ఇప్పటివరకు దాదాపు రూ.5,573 కోట్లు ఫీజుల పథకం కింద అందచేసి విద్యార్థులను ఆదుకుంది. ఫీజులను ఎగ్గొట్టే ఆలోచన చేయకుండా పేద విద్యార్థులు మంచి కాలేజీల్లో ఉన్నత చదువులు చదవాలనే సంకల్పంతో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఆర్థికంగా అండగా నిలవడంతోపాటు ప్రముఖ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా చేయూత అందిస్తోంది. చదవండి: పంటలకు ‘ధ్రువీకరణ’ ధీమా 35 శాతంతో విద్యార్థులకు ఎంతో మేలు... ప్రతిష్టాత్మక ప్రైవేట్ వర్సిటీల్లో ప్రవేశాలు పొందడం ద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ వర్సిటీల్లో పేద విద్యార్థులు సైతం చదువుకునేలా చర్యలు చేపట్టారు. వీటిల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు జగనన్న వసతి దీవెన కింద వసతి, భోజన ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ప్రైవేట్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, ఇతర నిబంధనలు ఇప్పటివరకు అమలు కావడం లేదు. ఇకపై 35 శాతం సీట్ల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలకు లబ్ధి చేకూరనుంది. ఇవే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీల్లోని సీట్లు కూడా ఇదే విధానంలో భర్తీ కానున్నాయని అధికార వర్గాలు వివరించాయి. ‘ఏపీ ఈఏపీ సెట్’ ద్వారా ప్రొఫెషనల్ సీట్ల భర్తీ ఈ వర్సిటీల్లోని ప్రొఫెషనల్ సీట్లను ఏపీ ఈఏపీ సెట్ (గతంలో ఏపీ ఎంసెట్) ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ వర్సిటీల కాలేజీలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీలలోని సీట్లను ఏపీ ఈఏపీ సెట్లో ర్యాంకర్లకు కన్వీనర్ కోటాలో కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోటా సీట్లకు ప్రభుత్వం అమలు చేస్తున్న పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర పథకాలు వర్తిస్తాయి. కన్వీనర్ కోటా ఫీజులకు పూర్తి రీయింబర్స్మెంట్ వర్తింపచేయడం ద్వారా ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ పేదలకు ఉత్తమ కళాశాలల్లో చదువుకునే అవకాశం దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి ఫీజులను చెల్లిస్తోంది. అలాగే ప్రైవేట్ వర్సిటీలలోని 35 శాతం సీట్లను ఇదే విధానంలో భర్తీ చేయనున్నారు. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని సీట్లను గత ఏడాది నుంచి ఆన్లైన్లో విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్లను అనుసరించి భర్తీ చేస్తున్నారు. ఇదే మాదిరిగా ప్రైవేట్ వర్సిటీల్లోని నాన్ ప్రొఫెషనల్ యూజీ కోర్సులలో 35 శాతం సీట్లను ఆన్లైన్లో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి భర్తీ చేయనున్నారు. ఈ వర్సిటీల్లోని వివిధ కోర్సులలో సీట్లు, భర్తీకి అనుసరించాల్సిన విధివిధానాలు తదితర అంశాలపై ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నామని సతీష్‌చంద్ర వివరించారు. ప్రభుత్వ వర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో 1.39 లక్షల సీట్లు రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ వర్సిటీల కాలేజీలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి 272 కాలేజీల్లో 1,39,862 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. ఈసారి కొత్తగా మహిళల కోసం ఆంధ్రా యూనివర్సిటీలో 300 సీట్లతో మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతి లభించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో 60 చొప్పున సీట్లు అందుబాటులో ఉంటాయి. వర్సిటీల్లో 4,260.. ప్రైవేట్‌లో 1,35,602 రాష్ట్రంలోని మొత్తం 1,39,862 ఇంజనీరింగ్ సీట్లలో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు 4,260 కాగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,35,602 సీట్లు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 40 కాలేజీల్లో 21,135 సీట్లుండగా కృష్ణా జిల్లాలో 33 కళాశాలల్లో 17,999 సీట్లు ఉన్నాయి. అతి తక్కువగా విజయనగరం జిల్లాలో పది కాలేజీల్లో 4,434 సీట్లున్నాయి. ఈసారి ఇంజనీరింగ్ కోర్సుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్ తదితర విభాగాల్లో 6,660 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ వర్సిటీల్లోని సీట్లు కలిపితే ఈ సంఖ్య మరింత పెరగనుంది. గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజుల బకాయిలు రూ.1,800 కోట్లు ► గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,800 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించి జగనన్న విద్యా దీవెన ద్వారా విద్యార్థుల చదువులకు భరోసా కల్పించింది. అవికాకుండా ఫీజుల కిందనే మరో రూ.4,207 కోట్లు తొలి ఏడాది ఈ ప్రభుత్వం చెల్లించింది. ► ఇక రెండో సంవత్సరం ఎలాంటి ఫీజుల బకాయిలు లేకుండా కాలేజీలకు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటి విడతగా రూ.671 కోట్లు, రెండో విడతగా జూలైలో రూ.694 కోట్లకుపైగా విడుదల చేసింది. గత సర్కారు మిగిల్చిన పాత బకాయిలను తీర్చడంతోపాటు అవి కాకుండా ఇప్పటివరకు దాదాపు రూ.5,573 కోట్లు ఫీజుల కింద ఇచ్చింది. -
పేదింటి విద్యార్థినికి ప్రకాష్‌రాజ్ చేయూత
తాళ్లపూడి: పేదింటి పిల్ల విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు సాయపడి సినీనటుడు ప్రకాష్‌రాజ్ తన ఉదారత చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన తిరిగిపల్లి సిరిచందన ఇటీవల బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసింది. ఆన్లైన్ ద్వారా పరీక్ష రాసి ఎంఎస్ చేయడానికి లండన్‌లోని మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్లో సీటు సాధించింది. పేదరికం కారణంగా విద్యార్థిని అడుగు ముందుకు వేయలేకపోయింది. ఈ విషయాన్ని కొందరు మిత్రులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రకాష్‌రాజ్ స్పందించారు. చందన చదువుకు అయ్యే ఖర్చును భరించడానికి ముందుకొచ్చారు. విద్యార్థిని తన తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లి ప్రకాష్‌రాజ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
వసూలు చేసిన ఫీజు తల్లులకు వెనక్కివ్వండి
సాక్షి, అమరావతి: పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే చెల్లించినందున తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ట్యూషన్ ఫీజు మొత్తాన్ని తిరిగి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాలేజీ యాజమాన్యాలకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆయా కళాశాలలకు లేఖ రాశారు. కోవిడ్–19తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, పేద వర్గాల విద్యార్థుల మంచి చదువుల కోసం నవరత్న హామీల్లో భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామన్నారు. సీఎం లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. ప్రియమైన మిత్రులారా.. ► నేను రాష్ట్ర ప్రభుత్వ అధికార పగ్గాలు చేపట్టిన నాటికి రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ. అదే సమయంలో వేల కోట్ల రూపాయల బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి. తాజాగా కోవిడ్–19తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్న విషయం మనందరికీ తెలిసిందే. ► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ‘నవరత్నాల’ హామీల మేరకు మా ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కట్టుబడి ఉంది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆ సంవత్సరపు విద్యార్థులతో పాటు అంతకు ముందు నుంచి ఉన్న సీనియర్ విద్యార్థులకు కూడా అమలు చేస్తోంది. ► వీరి కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.4 వేల కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వం విడుదల చేయకుండా వదిలేసిన రూ.1,880 కోట్లు కూడా ఇచ్చాం. ఒక విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల మొత్తం అదే విద్యా సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ► ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కేవలం రూ.35 వేలకు మాత్రమే పరిమితం చేసింది. తక్కిన ట్యూషన్ ఫీజు మొత్తాన్ని కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకొనేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లిస్తున్నందున ఆయా తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ట్యూషన్ ఫీజు మొత్తాన్ని తల్లుల బ్యాంకు అకౌంట్లలో తిరిగి జమ చేయాలని కాలేజీ యాజమాన్యాలను కోరుతున్నాను. ► ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పడానికి, అందుకనుగుణంగా విద్యా సంస్థలకు సహకారం అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇదే సమయంలో అనైతిక కార్యక్రమాలకు పాల్పడే, నిబంధనలు పాటించని కొన్ని విద్యా సంస్థలను ఉపేక్షించబోము. బోధన, బోధనేతర సిబ్బందిని, విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కొన్ని కాలేజీల గురించి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ► నిరుపేద వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రధాన లక్ష్యం. 2020–21 విద్యా సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు ఆధారంగా తల్లుల బ్యాంకు అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేస్తాం. ► ప్రభుత్వం అందించిన ఆ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తల్లులు కాలేజీలకు వచ్చి చెల్లిస్తారు. దీనివల్ల తల్లులు తమ పిల్లలు చదువుతున్న కాలేజీలను ఏడాదిలో నాలుగుసార్లు సందర్శిస్తారు. పిల్లల చదువుల పురోగతి ఎలా ఉందో పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది. ► కాలేజీల యాజమాన్యాలన్నిటికీ ఒక విన్నపం చేస్తున్నాను. మా ప్రభుత్వం ప్రతి క్వార్టర్‌కు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయడానికి కట్టుబడి ఉంది. అందువల్ల (2020–21 విద్యా సంవత్సరం నుంచి) ఇకపై విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలని కోరుతున్నాను. నాలెడ్జ్ సొసైటీ నెలకొల్పే దిశగా నిబద్ధతతో మనమందరం కలిసి పని చేద్దాం. – వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ -
రూ.600 కోట్లతో ‘జగనన్న విద్యా కానుక’
సాక్షి, అమరావతి: ‘మీ పిల్లల మేనమామగా..’ అంటూ రాష్ట్రంలోని నిరుపేద బడుగు బలహీన వర్గాల అక్కచెల్లెమ్మల పిల్లల చదువుల బాధ్యత తనదిగా పేర్కొన్న సీఎం వైఎస్ జగన్ ఆ పిల్లలకు మరింత భరోసా కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పిల్లలకు అందించే దుస్తులు పాఠ్యపుస్తకాలతో పాటు వారి చదువులకు అవసరమయ్యే మరికొన్ని వస్తువులను కూడా చేర్చి ‘కిట్’ రూపంలో అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ మదర్సాల్లో చదువుకొనే విద్యార్థులందరికీ ఈ కిట్లను అందించనున్నారు. ‘జగనన్న విద్యా కానుక’ పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు రూ.600 కోట్ల వ్యయంతో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు తెరిచే నాటికే పంపిణీ వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలు తెరిచే నాటికి ఈ కిట్లను సిద్ధం చేసి విద్యార్ధులందరికీ పంపిణీ చేయనున్నారు. రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది. పాఠ్యపుస్తకాలు డిసెంబర్ వరకు, దుస్తులు అయితే ఏకంగా ఏప్రిల్ వరకు కూడా పంపిణీ అయ్యే పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాఠశాలలు తెరిచే నాటికే పిల్లలకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు. రెండు జతల దుస్తులను మూడు జతలకు పెంచారు. 3 జతల దుస్తుల వస్త్రంతో పాటు నోట్ పుస్తకాలు, ఒక జత షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగును కిట్ రూపంలో అందించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యా శాఖ టెండర్లను కూడా ఆహ్వానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు తరగతుల వారీగా ఈ కిట్లను అందిస్తారు. వీటికి సగటున ఒక్కో విద్యార్థికి రూ.1,350 నుంచి 1,550 వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 40 లక్షల మంది విద్యార్థులకు వీలుగా అంచనా వేస్తున్నా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ సంఖ్య మరో 3 నుంచి 4 లక్షల వరకు పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో కిట్ల రూపంలో రెసిడెన్సియల్ స్కూళ్లలోని 7 నుంచి 8 లక్షల మంది పిల్లలకు వీటిలో కొన్ని వస్తువులను మాత్రమే పంపిణీ చేసేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, ఎయిడెడ్ స్కూళ్లు, ఎయిడెడ్ మదర్సాల్లో చదువుకొంటున్న పిల్లలందరికీ వీటిని పంపిణీ చేయించేలా ఆదేశాలు ఇచ్చారు. అమ్మఒడి, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడుతో ప్రోత్సాహం నవరత్న హామీల్లో కీలకమైన ‘అమ్మ ఒడి’ పథకాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలన్న తేడా లేకుండా పిల్లలను చదువుకోవడానికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు అందించే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఈ ఏడాది రాష్ట్రంలోని 43 లక్షల మంది తల్లులకు రూ.6,500 కోట్ల వరకు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రపంచంలో ఎలాంటి పోటీనైనా ఎదుర్కొని ఉద్యోగ ఉపాధి అవకాశాలను దక్కించుకోవడానికి వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధనకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చేందుకు మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడేళ్లలో దాదాపు రూ.12 వేల కోట్లతో అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. పాఠశాలల ప్రస్తుత పరిస్థితిపై ఫొటోలు తీయించారు. రూపురేఖలు మార్చాక కొత్త, పాత ఫొటోలను ప్రజల ముందుంచనున్నారు. -
చదువు‘కొనాల్సిందే’
పట్టణంలో పేదోడికి చదువు భారమవుతోంది. సర్కారు బడులు లేక తప్పనిసరిగా ప్రైవేటు బడుల్లో చేరాల్సివస్తోంది. ఏనాడో ఉన్న పాఠశాలల్నే నేటికీ కొనసాగిస్తూ... పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెంచకపోవడంతో ఉన్న పాఠశాలలనే అంతా ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆ పాఠశాలల్లో ప్రతీ తరగతిలోనూ పరిమితికి మించి విద్యార్థులుంటున్నారు. సర్కారు చదువులు ప్రోత్సహించాలని చెబుతున్న పాలకులు పాఠశాలలను పెంచడంలో శ్రద్ధ చూపకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. * పట్టణాల్లో పెరగని సర్కారు బడులు * పేదోడి చదువుకు తప్పని ఆర్థిక భారం * తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు స్కూళ్లే దిక్కు * పరోక్షంగా ప్రైవేటుకు ప్రోత్సాహం విజయనగరం అర్బన్: మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులను పెడుతున్నామని గొప్ప లు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో జనాభాకి సరి పడా ఉన్నత పాఠశాలలు ఉన్నా యా..? లేవా..? అనే అంశాన్ని పరి శీలించడం లేదు. జిల్లాలోని జిల్లాపరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజురోజుకూ విద్యార్థుల తా కిడి పెరుగుతోంది. ఏటా 10 నుం చి 20 శాతం ప్రైవేటు ప్రైమరీ నుం చి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వస్తున్నట్లు కొన్నేళ్ల నివేదికలు చెపుతున్నాయి. ఈ నేపధ్యంలో మున్సిపాలిటీల్లోని ఉన్నత పాఠశాలలకూ విద్యార్థుల తాడికి ఉంది. ప్రభుత్వం పాఠశాలలను పెంచే దిశగా అడుగులు వేయడం లేదు. నాటికీ... నేటికీ... అవే పాఠశాలలు విజయనగరం మున్సిపాలిటీని పరిశీలిస్తే దశాబ్దాలుగా నూతన పాఠశాలలు ఏర్పడకపోవడం వల్ల ఇక్కడి పేదోడికి విద్య అందనంత దూరంలో ఉంది. స్వాతంత్య్రం రాక ముందు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఎన్ని పాఠశాలలున్నాయో... ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లోనూ ఉంది. విజయనగరం పట్టణంలో 80 శాతం ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబ పిల్లల చదువుల కోసం మున్సిపల్ పాఠశాలల సంఖ్యను పెంచడానికి ఎవ్వరూ కృషి చేయలేదు. కనీసం ప్రతిపాదనలూ చేయలేదు. పట్టణ జనాభా 50 వేల నుంచి రెండు లక్షలకు చేరింది. వార్డుల సంఖ్య 15 నుంచి 40కి విస్తరించింది. కానీ ఇక్కడ 40 ఏళ్ల క్రితం ఉన్న మూడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలే ఉన్నాయి. విజయనగర పూసపాటి వంశీయుల విద్యా ట్రస్ట్ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రైవేటు పాఠశాలలు మాత్రం పుట్టగొడుగుల్లా ఏర్పడ్డాయి. విస్తరిస్తున్న ప్రైవేటు పాఠశాలలు తాజాలెక్కల ప్రకారం పట్టణంలో 200 వరకు ప్రైవేటు విద్యాసంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 36 వరకు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చేరాలంటే ఆర్థిక భారం తప్పదు. మున్సిపల్ పాఠశాలల విషయానికి వస్తే మొత్తం 43 ఉన్నాయి. వీటిలో మూడే ఉన్నత పాఠశాలలు. ఒక్కోపాఠశాలలో వెయ్యిమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. పట్టణం విస్తరిస్తున్న నేపధ్యంలో అందుకు అనుగుణంగా ఉన్నత పాఠశాలు లేకపోవడం వల్ల శివారు ప్రాంతాల పేద కుటుంబాల పిల్లలకు చదువులు అందడం లేదని విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అందుబాటులో ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నా ఆర్థిక స్థోమత చాలక చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ విస్తరణ, కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా కనీసం మరో ఏడు ఉన్నత పాఠశాలల అవసరం ఉందని చెబుతున్నారు. ఉన్నత పాఠశాలలు లేకే... పట్టణంలో అన్ని మున్సిపల్ ఉన్నత పాఠశాలలకూ విద్యార్థుల డిమాండ్ ఉంది. పాఠశాలల సంఖ్య జనాభాకు అనుగుణంగా లేకపోవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేటు విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేసి ప్రైవేటు స్కూళ్లలో చదివించాల్సి వస్తోంది. మున్సిపాలిటీ పాలకమండలి స్పందించి కొత్త స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. - ఆర్.ఎస్.ప్రసాద్, చైర్మన్, మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక