poornachandra rao
-
‘మాయా జలం’పై కదిలిన యంత్రాంగం
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘మాయా జలం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా, తగిన అనుమతులు లేకుండా నడుపుతున్న వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మంజరి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణా జిల్లాలో అనధికార ప్లాంట్లపై ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్ ప్లాంట్, సూర్యారావుపేటలోని శ్రీగంగా వాటర్ ప్లాంట్లను జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో అధికారులు తనిఖీ చేశారు. ప్లాంట్ల సీజ్: బ్లూ వాటర్ ప్లాంట్‌కు బీఐఎస్/ఐఎస్ఐ లైసెన్స్‌లతో పాటు ఇతర అనుమతులు లేవని, వాటర్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లలో అపరిశుభ్రత తాండవిస్తోందని అధికారులు గుర్తించారు. ఇంకా వివిధ కంపెనీల (బ్లూ, వేగా, శ్రీరాం) పేర్లతో లేబుళ్లను ముద్రించి పావు లీటరు, అర లీటరు, లీటరు బాటిళ్లకు అతికించి అక్రమంగా విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. సిబ్బంది కోవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడాన్ని గుర్తించారు. రోజుకు 4 వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను ఎనిమిదేళ్ల క్రితం ఐఎస్ఐ గుర్తింపుతో ప్రారంభించి, ఆ తర్వాత నాలుగేళ్లుగా రెన్యువల్ చేయించకుండా, ఇతర అనుమతులు తీసుకోకుండా నడుపుతున్నట్టు తనిఖీల్లో తేలిందని జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్ ప్లాంట్‌లో అధికారుల తనిఖీలు ఈ ప్లాంట్‌లో ఉన్న 6,125 సీల్డ్ వాటర్ బాటిళ్లను సీజ్ చేశామన్నారు. మరోవైపు అనుమతుల్లేకుండా నడుస్తున్న శ్రీగంగా వాటర్ ప్లాంట్‌లోనూ తనిఖీలు నిర్వహించామని, అక్కడ 90 ప్యాకెట్ల చొప్పున ఉండే 103 బ్యాగులను సీజ్ చేశామని చెప్పారు. ఈ రెండు ప్లాంట్లను సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు చెప్పారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు శేఖర్‌రెడ్డి శ్రీకాంత్, గోపాల్, విజిలెన్స్ సీఐ అశోక్‌రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని జాయింట్ కలెక్టర్ మాధవీలత చెప్పారు. కాగా, బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అనధికార వాటర్ ప్లాంట్లపై నిరంతరాయంగా దాడులు నిర్వహిస్తామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ చెప్పారు. -
‘దేశం’ నుంచి మున్సిపల్ చైర్మన్ కోత సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానవర్గం పూర్ణచంద్రరావుకు మద్దతుగా ఏడుగురు కౌన్సిలర్లు టీడీపీకి రాజీనామా కాశీబుగ్గ: పలాస తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో అతన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఎన్టీఆర్ భవన్ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యత గల పదవిని నిర్వహిస్తూ పార్టీ క్రమశిక్షణకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నందున పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయాల కమిటీ కన్వీనర్, ఎంఎల్సీ వీవీవీ చౌదరి పేరుతో పంపించిన లేఖలో స్పషం చేశారు. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీకి, మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుల మధ్య ఇటీవల విభేదాలు నెలకొన్నాయి. పలాస ఎమ్మెల్యే స్థానాన్ని శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషా ఆశిస్తుండగా...దాన్ని పూర్ణచంద్రరావు వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం ఇటీవల జరిగింది. ఈ విషయం వీరిరువురి మధ్య విభేదాలకు దారి తీసింది. ఈ క్రమంలోనే శివాజీ అల్లుడు వెంకన్నచౌదరి, మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో కోతను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారనే గుసగుసలు పలాస పట్టణంలో షికారు చేస్తున్నాయి. స్థానికేతరులను వెంటబెడతాం పలాస ఎమ్మెల్యే శివాజీ తీరుపై రాజీమానా చేసిన కౌన్సిలర్లు మండిపడ్డారు. నియోజకవర్గంలో రాచరిక పాలన నడుస్తోందని, స్థానికంగా పోలీసులను తొత్తులుగా వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి ఎమ్మెల్యే శివాజీ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి నుంచి వచ్చిన రాజకీయాలను కూతురుకి అందజేయాలనే తాపత్రయంలో నియోజకవర్గ అభివృద్ధిని మరిచి పదవినే ఎమ్మెల్యే చూసుకుంటున్నారని, కనీసం విచారణ చేయకుండా సస్పెండ్ చేయడంతో షాక్‌కు గురయ్యామని 24వ వార్డు కౌన్సిలర్ పాతాళ ముకుందరావు విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. హుద్‌హుద్ ఇళ్ల కోసం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ఆడదాన్నని కూడా చూడకుండా తమపై కేసులు నమోదు చేశారని దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నామని, దీంతోపాటు పార్టీ నిర్ణయానికి నిరసన తెలియజేస్తున్నామని కోఆప్సన్ సభ్యురాలు లక్ష్మీప్రధాన్ అన్నారు. స్థానికేతరులు పలాస ప్రజలను అభివృద్ధి చేయకుండా రాజకీయాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని పలువురు కౌన్సిలర్లు హెచస్చరించారు. విచారణ జరిపించి ఉంటే బాగుండేది పలాస నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం విచారణ జరిపి చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది. వాస్తవంగా గ్రౌండ్‌స్థాయిలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోకుండా సస్పెండ్ చేయడం బాగోలేదు. కనీసం వివరణ కూడా కోరలేదు. ఇదివరకు పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ చర్యలకు పాల్పడితే వారితో మాట్లాడడం జరిగేది. సంబంధిత పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సి ఉండగా ఏకపక్షంగా మాత్రమే ప్రవర్తించడం దారుణం. ప్రస్తుతం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే నిర్ణయిస్తారు. – కోత పూర్ణచంద్రరావు, మున్సిపల్ చైర్మన్, పలాస–కాశీబుగ్గ. -
ఏసీబీ డీజీగా పూర్ణచంద్రరావు
► సీఐడీ అదనపు డీజీ గోవింద్‌సింగ్ ► 15 మంది ఐపీఎస్‌ల బదిలీ ► పలువురికి ఇన్చార్జి బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. ఎన్ని కల నియమావళి, అసెంబ్లీ సమావేశాలు తదితర కారణాలతో రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తు న్న బదిలీ వ్యవహారం ఎట్టకేలకు పూర్త యింది. అలాగే పలువురికి ఇన్చార్జి బాధ్య తలు అప్పగించారు. డీజీపీ అనురాగ్‌శర్మకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా, ఐజీ స్టీఫెన్ రవీంద్రకు హైదరాబాద్ రేంజ్ డీఐజీగా, ఐజీ నాగిరెడ్డికి వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్ర‡ రావును ఏసీబీ డీజీగా నియమించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ అదనపు కమిషనర్ పోస్టులో ఐజీ స్థాయి అధికారికి బదులు డీఐజీ స్థాయి అధికారికి నియమించి జాయింట్ కమిషనర్ హోదా కు తగ్గించారు. రాచకొండ కమిషనరేట్‌లో డీఐజీ హోదా ఉన్న జాయింట్ కమిషనర్ పోస్టులో సీనియర్ ఎస్పీ తరుణ్ జోషీని ఇన్చార్జ్ డీఐజీగా నియమించారు. ఐపీఎస్‌ల కొరతే దీనికి కారణమని ఉన్న తాధికారులు తెలిపారు. వరంగల్ డీఐజీగా ఇటీవలే చార్జి తీసుకున్న రవివర్మను కరీంగనర్ డీఐజీగా పంపడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. -
'కానిస్టేబుళ్ల నియామకాల్లో అక్రమాలు జరగలేదు'
-
'కానిస్టేబుళ్ల నియామకాల్లో అక్రమాలు జరగలేదు'
హైదరాబాద్ : కానిస్టేబుళ్ల నియామకాల్లో అక్రమాలు జరగలేదని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్ష ఫలితాలపై వివాదం విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై కొంతమంది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కటాఫ్ మార్కులను త్వరలో వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే ఎస్టీ అభ్యర్థికి తక్కువ మార్కులు వచ్చాయని చెబుతున్నారని... అతడు ఎస్టీ కాదన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ మొదటి సారిగా ఛాలెంజ్ ఆప్షన్ని ప్రవేశ పెట్టిందని, అందులో భాగంగా ఈనెల 24వ తేదీ నుంచి ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. ఫిర్యాదుదారులకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తామని పేర్కొన్నారు. అప్పటికీ అభ్యర్థులు సంతృప్తి చెందకుంటే కోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పారు. -
జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలకు కృష్ణవేణి ప్రాజెక్టు ఎంపిక
పొదిలి: రాజమండ్రిలో జరిగిన ఇన్ స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శనలో పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మోరా కృష్ణవేణి ప్రాజెక్టు జాతీయ స్థారుుకి ఎంపికై ంది. ’స్మార్ట్ ఫోన్ మైక్రోస్కోప్’ ప్రాజెక్టును గైడ్ ఉపాధ్యాయుడు పూర్ణచంద్రరావు సహకారంతో కృష్ణవేణి తయారు చేశారు. స్మార్ట్ ఫోన్‌కు అదనంగా రూ.250 ఖర్చు చేయటం ద్వారా, మైక్రోస్కోప్ కంటే మరింత నాణ్యతగా ఈ యంత్రం పనిచేస్తుంది. రూ.20 వేల విలువ చేసే మైక్రోస్కోప్‌ను మరింత తక్కువగా అందుబాటులోకి తీసుకురావచ్చు. సాధారణ స్మార్ట్ ఫోన్‌ను మైక్రోస్కోప్‌గా ఏవిధంగా మార్చవచ్చో ప్రాజెక్టు ద్వారా కృష్ణవేణి నిరూపించింది. ప్రభుత్వ పాఠశాలల్లోని ల్యాబ్‌లో ఈ మైక్రోస్కోప్‌ను అమర్చటం ద్వారా దాని సేవలను విద్యార్థులకు అందుబాటులోకి తేవచ్చు. కరెన్సీలో నిగూఢంగా ఉన్న సెక్యూరిటీ ఫొటోగ్రఫీని కూడా గుర్తించవచ్చు. జాతీయ స్థారుుకి ఎంపికై న ప్రాజెక్టును ప్రదర్శించిన కృష్ణవేణి, గైడ్‌గా వ్యవహరించిన పూర్ణచంద్రరావును, జిల్లా సైన్సు అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, ఎంఈవో బాషురాణి, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ అభినందించారు. న్యూఢిల్లీలో డిసెంబర్ 9-11వ తేదీల్లో జాతీయ స్థారుు ప్రాజెక్టుల ప్రదర్శన జరుగుతుందని గైడ్ టీచర్ పూర్ణచంద్రరావు తెలిపారు. -
విఘ్ననాథుడికి విరి సేవ
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేకోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి పూలంగి సేవ నేత్రపర్వంగా జరిగింది. సిద్ధి,బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పరిమళాలు వెదజల్లే దేశ, విదేశీ పుష్పాలతో అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం స్వామివారి మూల విగ్రహనికి విశేష అభిషేకాలు నిర్వహించి సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలోని అర్ధ, మూషిక, ఆన్వేటి, సుపథ మండపాలను పరిమళభరిత పుష్పమాలికలతో అలంకరించారు. రాత్రి 9గంటలకు సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ మూర్తులను పల్లకిపై అలంకార మండపానికి వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలు, దేశ, విదేశీ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆన్వేటీ మండపానికి వేంచేపు చేసి ఊయలలో కొలువుదీర్చి ఊంజల్ సేవ నిర్వహించారు. వేదమంత్రోచ్చరణల నడుమ ఉభయ దేవేరులతో సేదతీరుతున్న వినాయక స్వామిని దర్శించి భక్తులు పులకించారు. అనంతరం ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈఓ పి.పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, ఇన్స్పెక్టర్లు చిట్టి బాబు, మల్లి కార్జున పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాన వాహనసేవలకు విస్తృత ఏర్పాట్లు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేకోత్సవాలలో భాగంగా రేపటినుంచి జరిగే ప్రధాన వాహన సేవలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం కల్పవృక్ష వాహనం, శుక్రవారం విమానోత్సవం, శనివారం పుష్పపల్లకి, ఆదివారం తెప్పోత్సవం జరుగునుంది. ఈఓ పి.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పుష్పాలంకరణలు జరుగుతున్నాయి. పుష్కరిణిని శుభ్రం చేసి కొత్త నీటిని నింపడం, విద్యుత్ దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి. -
అందల‘మెక్కి’స్తున్నారు!
♦ ఆర్టీసీలో అవినీతి అధికారులకు పట్టం ♦ దుకాణాల అద్దెలు మింగిన అధికారికి ఉన్నత పోస్టు ♦ అద్దె బస్సు నిధులు గోల్మాల్ చేసిన వ్యక్తికి డిపో మేనేజర్ పదవి ♦ రికవరీ నిధులు తిన్నా చర్యలు శూన్యం సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎలుకలు ఉంటే ఏం చేస్తారు.. వాటికి మందుపెడతారు.. కలుగుల న్నింటిని మూసేస్తారు. కానీ మరిన్ని ఎలుకలు లోనికి చేరేలా కొత్త కలుగులు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఆర్టీసీలో యాజమాన్యం తీరు ఇలాగే ఉంది. రోజురోజుకు పెరుగుతున్న నష్టాలతో దివాలా దిశగా సాగుతున్న సంస్థను సరిదిద్దాల్సిందిపోయి.. తిన్నింటికే కన్నం వేస్తున్న అధికారులను అందలమెక్కిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా మంచి పోస్టింగులు ఇస్తూ పరోక్షంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. ఆర్టీసీకి వివిధ డిపోల పరిధిలో సొంత దుకాణాలున్నాయి. వాటి నుంచి వసూలయ్యే అద్దెలను ఆర్టీసీ ఖజానాకు జమ చేయాలి. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గతంలో రిటైర్డ్ సిబ్బందిని నియమించారు. 2006 నుంచి 2013 వరకు వివిధ డిపోల పరిధిలో దాదాపు రూ.2 కోట్లు బ్యాంకుల్లో జమకాలేదు. ఇది 2013లో వెలుగుచూడటంతో నాటి ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ సిబ్బందిపై వేటు వేయటంతోపాటు దాదాపు 15 మంది అధికారులు, సిబ్బందిపై అభియోగాలు నమోదు చేశారు. ఆ మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేయాలని కూడా ఆదేశించారు. రికవరీ దేవుడెరుగు.. అభియోగాల జాబితాలో ఉన్న అధికారుల పేర్లు తొలగించి వారికి మంచి పోస్టింగులు ఇచ్చారు. రిటైర్డ్ సిబ్బందిని తొలగించి రూ.2 కోట్ల కుంభకోణానికి తెరలేపిన అధికారులకు క్లీన్చిట్ ఇచ్చేశారు. అద్దె బస్సుల కుంభకోణంలో... ఇటీవల పలు జిల్లాల్లో అద్దె బస్సు నిర్వాహకులతో అధికారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారు. వరంగల్ జిల్లాలో స్వయంగా విజిలెన్స్ అధికారులు ఆధారాలతోసహా బట్టబయలు చేశారు. పాత బస్సులకు తక్కువ అద్దె చెల్లించాల్సి ఉన్నప్పటికీ... వాటికీ ఎక్కువ అద్దె చెల్లించి రూ.కోటి వరకు పక్కదారి పట్టించారు. ఇందులో క్లర్క్ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్న యాజమాన్యం పెద్ద అధికారులను మాత్రం కాపాడింది. ఈ కుంభకోణంలో వాటా ఉన్నట్టు తొలుత పేరు నమోదైన ఓ అధికారిని మరో జిల్లాలో డిపో మేనేజర్‌గా నియమించారు. ఇప్పుడా అధికారి దర్జాగా డీఎం హోదాలో తనదైన ‘శైలి’లో పనిచేసుకుపోతున్నారు. డ్రైవర్ల రికవరీ నిధులు భోంచేసినా.. టికెట్ల లెక్కల్లో రూ.5 తేడా వచ్చినా కండక్టర్లను సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయి. అలాగే చిన్నచిన్న ప్రమాదాలతో బస్సులకు నష్టం చేసిన డ్రైవర్ల నుంచి వసూలు చేసిన నష్టపరిహారాన్ని స్వాహా చేసిన అధికారులకు మాత్రం పట్టం కడుతున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాలో లైట్లు, అద్దాలు పగిలిన బస్సులకు సంబంధిత డ్రైవర్ల నుంచి నష్టాన్ని రికవరీ చేశారు. ఈ మొత్తాన్ని సంస్థకు చెల్లించకుండా ఓ అధికారి జేబులో వేసుకున్నాడు. దీనిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించారు. కానీ ఆ అధికారిని కాపాడేందుకు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విజిలెన్స్ నివేదిక సరిగాలేదంటూ మరో విచారణను తెరపైకి తెచ్చారు. చివరకు కేసును నీరుగార్చి ఆ అధికారికి కనీసం చార్జిమెమో కూడా ఇవ్వకుండా కాపాడారు. త్వరలో ఆ అధికారికి పదోన్నతి కల్పించే పనుల్లో ఉండటం కొసమెరుపు.