
ఏసీబీ డీజీగా పూర్ణచంద్రరావు
► సీఐడీ అదనపు డీజీ గోవింద్‌సింగ్
► 15 మంది ఐపీఎస్‌ల బదిలీ
► పలువురికి ఇన్‌చార్జి బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. ఎన్ని కల నియమావళి, అసెంబ్లీ సమావేశాలు తదితర కారణాలతో రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తు న్న బదిలీ వ్యవహారం ఎట్టకేలకు పూర్త యింది. అలాగే పలువురికి ఇన్‌చార్జి బాధ్య తలు అప్పగించారు. డీజీపీ అనురాగ్‌శర్మకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా, ఐజీ స్టీఫెన్ రవీంద్రకు హైదరాబాద్ రేంజ్ డీఐజీగా, ఐజీ నాగిరెడ్డికి వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్ర‡ రావును ఏసీబీ డీజీగా నియమించారు.
హైదరాబాద్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ అదనపు కమిషనర్ పోస్టులో ఐజీ స్థాయి అధికారికి బదులు డీఐజీ స్థాయి అధికారికి నియమించి జాయింట్ కమిషనర్ హోదా కు తగ్గించారు. రాచకొండ కమిషనరేట్‌లో డీఐజీ హోదా ఉన్న జాయింట్ కమిషనర్ పోస్టులో సీనియర్ ఎస్పీ తరుణ్ జోషీని ఇన్‌చార్జ్ డీఐజీగా నియమించారు. ఐపీఎస్‌ల కొరతే దీనికి కారణమని ఉన్న తాధికారులు తెలిపారు. వరంగల్ డీఐజీగా ఇటీవలే చార్జి తీసుకున్న రవివర్మను కరీంగనర్ డీఐజీగా పంపడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.