ఎన్పీఎస్పై రూ.5వేల వరకూ సేవారుసుం
0.05 శాతం వసూలుకు పీఎఫ్ఆర్డీఏ అనుమతి
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో ఆన్లైన్ విధానంలో చేరే చందాదారుల నుంచి పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీ/విక్రయ కేంద్రాలు) ఇకపై రూ.5 నుంచి రూ.5వేల వరకు సర్వీసు చార్జి కింద వసూలు చేసుకోవచ్చు. ఎన్పీఎస్ను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే చర్యల్లో భాగంగా పీఎఫ్ఆర్డీఏ ఈ మేరకు అవకాశం కల్పించింది. ఆన్లైన్ ద్వారా ఎన్‌పీఎస్‌లో చేరేందుకు, నెలవారీ చందాలు చెల్లించేందుకు వీలుగా పీఎఫ్ఆర్డీఏ ఈ ఎన్పీఎస్ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
పీఓపీ ద్వారా, పాన్, కేవైసీ పత్రాల సాయంతో ఈ ఎన్పీఎస్ వేదిక ద్వారా ఎన్‌పీఎస్‌లో చేరేవారికే ఈ చార్జీలు వర్తిస్తాయి. ఆధార్ నంబర్‌తో ఈ ఎన్పీఎస్ పోర్టల్ ద్వారా చేరితే కమీషన్ ఉండదు. అలాగే, పీఓపీ సహకారంతో ఎన్‌పీఎస్‌లో మొదటి సారి చెల్లించే చందాపై కూడా కమీషన్ చార్జీ ఉంటుంది. విలువ మొత్తంపై 0.05 శాతం (కనీసం రూ.5, గరిష్టం రూ.5వేలకు మించకుండా) సర్వీసు చార్జీల వసూలుకు అనుమతించినట్టు పీఎఫ్ఆర్డీఏ తన ఆదేశాల్లో పేర్కొంది.