Pop Singers
-
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
అమెరికన్ ప్రముఖ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(41) అరెస్ట్ అయింది. అయితే, కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆమెను విడుదల చేశారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నిక్కీ మినాజ్‌కు ఈవెంట్ ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆమ్స్టర్డామ్లోని షిపోల్ ఎయిర్పోర్ట్ వద్దకు నిక్కీ చేరుకుంది. తన బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమ్స్టర్డామ్ అధికారులు ఆమెను నిర్బంధించారు. దీంతో ఆమె షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సంగీత్ కార్యక్రమం వాయిదా పడింది. ఆమె పాల్గొంటున్న ప్రోగ్రామ్ కోసం సుమారు ఇరువై వేల మంది టికెట్లు కొన్నారు. నిక్కీ వద్ద డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో తనిఖీల పేరుతో ఆమెను కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఉంచారు. ఫైనల్లీ తనవద్ద డ్రగ్స్ లేవని తేలడంతో ఆమెను పోలీసులు వదిలిపెట్టారు. అప్పటికే సమయం గడిచిపోవడంతో ఆమె పాల్గొనాలనుకున్న కార్యక్రమం వాయిదా పడింది. అయితే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని అభిమానులకు నిక్కీ టీమ్ తెలిపింది. అయితే, పోలీసుల తీరుపట్ల నిక్కీ మినాజ్ అసహనం వ్యక్తం చేసింది. తన వద్ద డ్రగ్స్ లేకున్నా కావాలనే తన ప్రోగ్రామ్ చెడగొట్టేందుకు ఎవరో ఇలాంటి గేమ్ ప్లాన్ చేశారని ఆరోపించింది. అభిమానులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, తొమ్మిది అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Barbie (@nickiminaj) -
టాప్ లేపేస్తున్న ‘పాప్’ సింగర్స్
-
బీబర్.. నువ్వు మాకొద్దు, వెళ్లిపో..!
అతడి సంగీతపు మత్తులో ఓలలాడిన సంగీత ప్రియులు అతగాడిని మనసుల్లో పెట్టుకొన్నారు. అలాంటిది అతడు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడన్న విషయాన్ని వాళ్లు ఎలా సహించగలరు? బీచ్‌లో డ్రగ్స్తీసుకొంటూ దొరికిపోయాడనే వార్తలను విని వాళ్లు ఎలా తట్టుకోగలరు? ‘‘బీబర్ మేము నీ ఫ్యాన్స్‌మి.. ‘బిలీబర్స్’మి’ అంటూ చెప్పుకుని గొప్పగా మురిసిపోయిన వారంతా... ఇప్పుడు ‘బీబర్ నువ్వు వెళ్లిపో..’ అని అంటున్నారు. ఎందుకంటే... సంగీత ప్రపంచంలో ఆకాశమంత ఎత్తున నిలబడిన జస్టిన్ బీబర్... వ్యక్తిగా విలువలను మరిచి పాతాళానికి పడిపోయాడు! కెనడా వాడైనా అమెరికాలో పాప్‌స్టార్‌గా ఎదిగిన యువకుడు జస్టిన్‌బీబర్. పాప్ మ్యూజిక్‌ను అమృతంగా భావించి, పాప్ సింగర్స్‌ను దేవతలుగా చూసే అమెరికన్లు జస్టిన్ బీబర్‌ను కూడా ఆదరించారు. అభిమానించారు. కానీ ఇటీవల మియామీ బీచ్‌లో డ్రగ్స్ తీసుకొంటూ పోలీసులకు దొరికిపోయిన అతడిని వాళ్లు క్షమించలేకపోతున్నారు. తమ దేశంలో ఉండటానికే వీలు లేదని నినాదాలు చేస్తున్నారు. డ్రగ్స్ మత్తు సంగీతానికి శ్రుతి తప్పించడమే గాక, అతడిని అభిమానించే యువతరాన్ని అపసవ్య మార్గంలో నడిపించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా అక్కడ బీబర్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకొంటోంది. బీబర్‌ను అమెరికా నుంచి పంపేయమంటూ ఇప్పటి వరకూ దాదాపు రెండు లక్షల మంది పిటిషన్ల మీద సంతకాలు చేశారంటే వారి దృష్టిలో అతడు ఎంతగా దిగజారిపోయి ఉండాలి! కోట్లాది మంది అభిమానులను కలిగిన వ్యక్తిగా తన బాధ్యతను విస్మరించి వ్యవహరించడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. బీబర్‌కు ఎదురవుతున్న అవమానాలు అతడి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం అని అంటున్నారు. విజయగర్వంతో విలువలకు పాతరేసేవారందరికీ బీబర్ స్థితి ఒక గుణపాఠమని, వెర్రి వేషాలు వేస్తే, అభిమానించేవాళ్ల ఆదరణను కోల్పోక తప్పదని హితబోధ చేస్తున్నారు. బీబర్ ఇప్పటికైనా కళ్లు తెరిస్తే బాగుణ్ను! -
ఇతడికి మిల్లీ‘వైరస్’ సోకింది..!
పాపులర్ అయిన పాప్ సింగర్స్‌కు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ చాలా మందే ఉంటారు. అలాంటివారిలో కొందరికి పిచ్చి తారస్థాయికి చేరి ఉంటుంది. 40 యేళ్ల కార్ల్ మెకాయిడ్కు అమెరికాకు చెందిన మిల్లీసైరస్ అంటే అభిమానం. అది ఎంతంటే... ఒళ్లంతా ఆమె టాటూలు చెక్కించుకొనేంతగా! తాము అభిమానించే వ్యక్తుల పేర్లు, చిత్రాలను ఒంటిపై చెక్కించుకోవడం పాశ్చాత్యులకు మామూలే. కార్ల్ మాత్రం అంతటితో సంతృప్తి పడలేదు! మిల్లీ సైరస్ పేరును, ఆమె బొమ్మను, ఆమె కంపోజ్ చేసిన పాటల పేర్లను శరీరమంతా టాటూలుగా వేయించు కొన్నాడు. ఛాతి మీద సైరస్ పేరు, రెండు భుజాలకూ సైరస్ బొమ్మలు, చేతులు, కాళ్లు, పొట్ట, చేతి వేళ్లు, వీపు మీద, మెడ వెనుకభాగం... మొత్తం ఇతడి శరీరం మీద సైరస్కు సంబంధించి 22 టాటూ లున్నాయి. దీన్ని బట్టి ఇతడికి మిల్లీ సైరస్ వైరస్‌లా సోకిందని అనుకోవాలేమో!