ఇకపై ప్రముఖుల చిత్రాలతో స్టాంపులు
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ స్టాంపుల మీద ఎందరో సంఘసంస్కర్తలు, రాజకీయ నాయకుల చిత్రాలనుచూశాం. ఇకపై ప్రముఖ గాయకులు, చిత్రకారులు, రచయితలు, స్వాతంత్ర్యసమరయోధుల చిత్రాలతో స్టాంపులను విడుదల చేయనున్నారు. ఈ స్టాంపుల డిజైన్లను ప్రజల నుంచి కూడా సేకరించాలని భావిస్తోంది. చాంపియన్షిప్ ఆఫ్ కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర ప్రసాద్ తో సమావేశమైన అనంతరం దీనిపై స్టాంపుల సలహాకమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా ప్రముఖుల చిత్రాలతో ముద్రించిన స్టాంపులను తాజ్ మహల్, అజంతా, ఎల్లోరా, బెలూర్ మాత్, కజరహో వంటి పర్యాటక స్థలాల వద్ద విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే 'స్వచ్ఛ భారత్' పేరుతో ఇతివృత్తాన్ని ముద్రించి తపాలా శాఖ జనవరి 30న స్టాంపులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మహిళా సాధికారత గౌరవార్థంగా ఓ స్టాంపును ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. స్టాంపులపై ప్రకటించే ప్రతి సమాచారం ప్రజలకు చేరేలా ఒక మొబైల్ యాప్ను రూపొందిచాలని భావిస్తున్నట్టు మంత్రి ప్రసాద్ చెప్పారు.