Positive developments
-
71,000 శిఖరంపై సెన్సెక్స్
ముంబై: ఐటీ, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 71,000 పాయింట్ల ఎగువన ముగిసింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీలు తాజా గరిష్టాలు నమోదు చేశాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల ప్రభావం భారత్‌తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై కొనసాగింది. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు అంశాలు కలిసొచ్చాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్ 70,804 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 1,092 పాయింట్లు ఎగసి 71,484 వద్ద కొత్త జీవితకాల గరిష్టం తాకింది. చివరికి 970 పాయింట్లు లాభపడి 71,484 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 310 పాయింట్లు బలపడి 21,492 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 274 పాయింట్లు లాభపడి 21,457 వద్ద నిలిచింది. ఎఫ్ఎంసీజీ, ఆటో, రియలీ్ట, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► సూచీల రికార్డుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ గత ట్రేడింగ్ సెషన్లలో రూ.8.11 లక్షల కోట్ల పెరిగి రూ.357.87 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ ఐదు మాత్రమే నష్టపోయాయి. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్ 1,658 పాయింట్లు, నిఫ్టీ 487 పాయింట్లు చొప్పున లాభాలు నమోదు చేశాయి. ఇరు సూచీలకిది వరుసగా ఏడో వారం లాభాల ముగింపు. ► పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓకు చివరిరోజు నాటికి 93.40 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 88.37 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 82.54 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 115.97 రెట్లు, రిటైల్ కోటా 69.10 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటా 66.47 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ► డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువెత్తడం, స్టాక్ సూచీల కొత్త శిఖరాలకు ► ఫెడ్ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపు, ద్రవ్యోల్బణం దిగివచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో ఐటీ షేర్లు రెండో రోజూ లాభపడ్డాయి. ఇనీ్ఫబీమ్ 12%, జెన్సార్ టెక్ 11%, మెస్టేక్ 6.50%, హెచ్‌సీఎల్ టెక్ 6%, పర్సిస్టెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు 5%, కో ఫోర్జ్, సైయంట్ 4%, టెక్ మహీంద్రా 3 చొప్పున లాభపడ్డాయి. ► బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు ఒకటిన్నర శాతం లాభపడి రూ.91.24 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.ఒక లక్షల కోట్లను అధిగిమించింది. -
మద్యనిషేధంతో బిహార్ ఇలా..
సాక్షి, పట్నా : బిహార్‌లో 2016 నుంచి మద్యనిషేధం అమలు తర్వాత రాష్ట్రంలో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని, బిహార్ పాలు, తేనెలకు హబ్‌గా మారిందని అథ్యయనాలు స్పష్టం చేశాయి. మద్యనిషేధం విధించిన క్రమంలో 2016-17లో బిహార్‌లో పాల ఉత్పత్తుల విక్రయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 17.5 శాతం పెరిగిందని డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ (డీఎంఐ) చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. ఫ్లేవర్డ్ మిల్క్, సుధా స్పెషల్ లస్సీ, ప్లెయిన్ దహీ వంటి పాల ఉత్పత్తుల విక్రయం మరింతగా వృద్ధి చెందాయని వెల్లడైంది. ప్రైవేట్ వర్తకుల విక్రయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ గణాంకాలు మరింత అధికమని అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తేనె విక్రయాలు 380 శాతం, వెన్న విక్రయాలు 200 శాతం పెరిగాయి. మద్యపాన ప్రియులు మద్యంపై వెచ్చించే మొత్తాన్ని ఇతర వినిమయ ఉత్పత్తులపై వెచ్చించినట్టు ఈ అథ్యయనంలో వెల్లడైంది. ఖరీదైన చీరల విక్రయాలు ఏకంగా పది రెట్లు, ఖరీదైన డ్రెస్ మెటీరియల్ అమ్మకాలు తొమ్మిది రెట్లు, ప్రాసెస్ట్ ఫుడ్ విక్రయాలు 46 శాతం మేర పెరిగాయని తేలింది. బిహార్‌లో మద్యనిషేధం అమలైనప్పటి నుంచీ వినోద పన్ను వసూళ్లు 29 శాతం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. కొనుగోలు శక్తి పెరగడంతో కార్లు, ట్రాక్టర్ల విక్రయాలు 30 శాతం, ద్విచక్ర వాహనాల విక్రయాలు 32 శాతం పెరిగాయి. 2011 గణాంకాల ప్రకారం బిహార్‌లో మద్యనిషేధం ప్రకటించిన సమయంలో రాష్ట్రంలో 44 లక్షల మంది మద్యపాన ప్రియులున్నారు. వీరంతా నెలకు రూ 1000 ఖర్చు చేసినా ఏటా రూ 5,280 కోట్లు మద్యానికి వెచ్చించాల్సి వచ్చేది. ఇక మద్యనిషేధంతో బిహార్‌లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని పట్నాకు చెందిన ఆసియన్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. దోపిడీల కోసం జరిగే కిడ్నాప్ ఘటనలు 66 శాతం, హత్యలు 28 శాతం, దోపిడీలు 22 శాతం మేర తగ్గుముఖం పట్టాయని ఈ అథ్యయనంలో వెల్లడైంది. సమాజంలో అణగారిన వర్గాలకు మద్యనిషేధం ద్వారా మేలు చేకూరిందని ఈ అథ్యయనాలు పేర్కొన్నాయి. -
మార్కెట్ మళ్లీ జంప్
- ఈసారి చైనా జోష్ - సెన్సెక్స్ 424 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు అప్ - కోలుకున్న రూపాయి కొన్నాళ్లుగా కలవరపెడుతున్న చైనా నుంచి కాస్త సానుకూల పరిణామాలు రావడంతో మంగళవారం దేశీ మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 424 పాయింట్లు ఎగిసి కీలకమైన 25,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 129 పాయింట్లు పెరిగింది. ఎకానమీని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలు, బ్యంకర్లు, ఆర్థికవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం కూడా మార్కెట్లకు ఊతమిచ్చినట్లు జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండమెంటల్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. రూపాయి కూడా 27 పైసల మేర బలపడి రెండేళ్ల కనిష్టం నుంచి 66.54 స్థాయికి కోలుకుంది. సెన్సెక్స్ ఒక దశలో ఇంట్రా డే గరిష్ట స్థాయి 25,411 పాయింట్లను కూడా తాకి.. చివరికి 25,318 వద్ద ముగిసింది. చైనా, వర్షాభావ భయాలతో గడిచిన రెండు సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 871 పాయింట్లు క్షీణించింది. మరోవైపు నిఫ్టీ సైతం కొంత సేపు 7,700 మార్కుపై కదలాడి చివరికి 129 పాయింట్ల లాభంతో 7,688 వద్ద ముగిసింది. వెలుగులో ఫైనాన్షియల్ స్టాక్స్.. బేస్ రేట్ ఆధారిత వడ్డీ రేట్లకు సంబంధించిన ప్రతిపాదిత నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ కొంత సడలించే అవకాశాలున్నాయన్న వార్తలతో ఫైనాన్షియల్ స్టాక్స్ ప్రధాన ఆకర్షణగా నిల్చాయి. 30 షేర్ల సెన్సెక్స్‌లో 26 స్టాక్స్ లాభపడ్డాయి. బీఎస్ఈలో 1,459 స్టాక్స్ లాభాల్లో.. 1,190 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవరు రూ. 2,042 కోట్ల నుంచి రూ. 2,666 కోట్లకు పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 660 కోట్ల విలువ చేసే స్టాక్స్ విక్రయించగా.. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 447 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. మరోవైపు, ఎన్ఎస్ఈ స్టాక్స్‌లో రూ. 16,034 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 2,19,091 కోట్లు టర్నోవరు నమోదైంది. షార్ట్ కవరింగ్, తక్కువ స్థాయుల్లో కొనుగోళ్ల కారణంగా బ్లూ చిప్ షేర్లు మొదలైనవి పెరిగాయని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. అయితే, వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రకటించిన తర్వాతే మార్కెట్లు స్థిరపడే అవకాశం ఉందని వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. చైనా ఊతం.. చైనా ప్రభుత్వం కొత్తగా ఆదాయ పన్ను కోతలు, స్వల్పకాలిక స్పెక్యులేషన్‌ను నివారించేందుకు.. షేర్ల పతనాన్ని నిరోధించేందుకు సర్క్యూట్ బ్రేకర్లను ప్రతిపాదించడం అక్కడి మార్కెట్స్‌కు ఉత్సాహాన్నిచ్చింది. చైనా షాంఘై కాంపోజిట్ సూచీ 2.92 శాతం మేర, హాంకాంగ్‌కి చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 3.28 శాతం పెరగ్గా.. జపాన్ సూచీ నికాయ్ మాత్రం 2.43 శాతం క్షీణించింది. మరోవైపు, జర్మనీ ఎగుమతులు దిగుమతుల సానూకూల గణాంకాలతో యూరోపియన్ సూచీలు పెరిగాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ మొదలైన దేశాల సూచీలు 2.04 శాతం దాకా లాభపడ్డాయి.