Positive signs
-
నిఫ్టీ ‘వరుస లాభాల’ రికార్డు
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, యుటిలిటీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. అధిక వెయిటేజీ షేర్లు భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీ బ్యాంకు, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. 1996లో ఎన్ఎస్ఈ ప్రారంభం తర్వాత 12 రోజులు వరుసగా లాభాలు గడించిన నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,236 వద్ద స్థిరపడింది. ఒక దశలో 116 పాయింట్లు బలపడి 25,268 వద్ద కొత్త ఆల్‌టైం హైని తాకింది. సెన్సెక్స్ 502 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్టం వద్ద మొదలైంది. చివరికి 231 పాయింట్ల లాభంతో 82,366 సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది తొమ్మిదో రోజు లాభాల ముగింపు. ఎఫ్ఎంసీజీ మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 1,941 పాయింట్లు(2.41%) పెరగడంతో బీఎస్ఈలో 10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.464.39 లక్షల కోట్ల(5.54 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1.85 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొంతమయ్యాయి. -
Stock Market: సెన్సెక్స్ 80000
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో బుధవారం మరో మరపురాని రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తొలిసారి 80,000 శిఖరాన్ని తాకింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, పారిశ్రామిక షేర్లు ముందుండి నడిపించాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 2% రాణించి సూచీలకు దన్నుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ముగింపులోనూ తాజా రికార్డులు నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 572 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయిపైన 80,013 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 633 పాయింట్లు పెరిగి 80,074 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 545 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయి దిగువన 79,987 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 183 పాయింట్లు ఎగసి 24,307 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 163 పాయింట్ల లాభంతో 24,287 వద్ద స్థిరపడింది. లార్జ్‌క్యాప్ షేర్లలో ర్యాలీ క్రమంగా చిన్న, మధ్య తరహా షేర్లకు విస్తరించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.86%, 0.86 శాతం రాణించాయి. → బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి పరిమితం కావడంతో బ్యాంకింగ్ షేర్లు మరింత రాణిస్తాయని విశ్లేషకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఎస్బీఐలు 2% లాభపడ్డాయి.→ బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో పాటు ఎంఎస్సీఐ ఇండెక్సు ఆగస్టు సమీక్షలో వెయిటేజీ పెంచవచ్చనే అంచనాలతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2% పెరిగి రూ.1,768 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.50% ఎగసి రూ.1,792 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,758 కోట్లు ఎగసి రూ.13.45 లక్షల కోట్లకు చేరుకుంది. → ఈ జూన్ 25న 78 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్... 80,000 స్థాయిని చేరేందుకు కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్ల సమయాన్ని మాత్రమే తీసుకుంది. → ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం(జూన్ 9న) నాటి నుంచి 3,294 పాయింట్లు ర్యాలీ చేసింది. → సెన్సెక్స్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ జీవితకాల గరిష్ట స్థాయి రూ.445.43 లక్షల కోట్లకు చేరింది. వ్రజ్ ఐరన్ బంపర్ లిస్టింగ్ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో 16% ప్రీమియంతో రూ.240 వద్ద లిస్టయ్యింది. ఈక్విటీ మార్కెట్ రికార్డు ర్యాలీతో మరింత కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 22% లాభపడి రూ.252 అప్పర్ సర్క్యూట్ వద్ద లాకైంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.831 కోట్లుగా నమోదైంది.సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకోవడం దలాల్ స్ట్రీట్‌కు దక్కిన పెద్ద విజయం. లేమన్ సంక్షోభం(2008)లో 8800 స్థాయికి దిగివచి్చంది. కానీ 16 ఏళ్లలో 9 రెట్ల ఆదాయాలు ఇచి్చంది. నాలుగేళ్ల క్రితం కరోనా భయాలతో 26,000 స్థాయికి చేరుకుంది. అయితే పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా పుంజుకుంది. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాయి అనేందుకు ఇది నిదర్శనం. – శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ -
Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్‌మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ప్రథమార్థపు ట్రేడింగ్‌లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.61%, యుటిలిటీస్ 2.59%, పవర్ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్‌మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్‌టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్, ► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు బీఎస్ఈలో 5% లోయర్ సర్క్యూట్‌తో రూ.325 వద్ద లాకైంది. ► ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► బ్లాక్‌డీల్ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి రూ.268 వద్ద ముగిసింది. -
సానుకూలతలు కనిపిస్తున్నాయ్.. రికవరీ కొనసాగొచ్చు!
ముంబై: దేశీయ సూచీలు ఈ వారం కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్ ఆస్కారం ఉన్నందున ఒడిదుడుకులకు అవకాశం లేకపోలేదంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి కదలికలు, క్రూడాయిల్ ధరల కదిలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు. గతవారం మొత్తంగా సెన్సెక్స్ 167 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయాయి. ఆటో, బ్యాంకులు, ఇంధన, ఫార్మా, ఆయిల్ – గ్యాస్ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెక్నాలజీ, రియల్టీ షేర్లు రాణించాయి. ‘‘క్రూడాయిల్ ధరల రికవరీ, ఆర్బీఐ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపు, దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక డేటా నమోదు పరిణామాల నుంచి దలాల్ స్ట్రీట్ కొంత సానుకూలత మూటగట్టుకుంది. కావున ఈ వారం రికవరీ కొనసాగొచ్చు. వచ్చే వారం ఐటీ, బ్యాంకింగ్ రంగాల క్వార్టర్ ఫలితాల ప్రకటన ప్రారంభం నేపథ్యంలో ఈ రంగానికి చెందిన షేర్లపై అధిక ఫోకస్ ఉంటుంది. కొనుగోళ్ల మద్దతు కొనసాగితే నిఫ్టీ మరోసారి 19,800 – 20,000 పాయింట్ల పరిధిని పరీక్షింవచ్చు. అమ్మకాలు నెలకొంటే 19,300 వద్ద తక్షణ మద్దతు నెలకొని ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు పర్వేష్ గౌర్ తెలిపారు. కార్పొరేట్ ఫలితాల సీజన్ మొదలు దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఈ అక్టోబర్ 11న(బుధవారం) సెప్టెంబర్ 30 నాటితో ముగిసిన క్యూ2 ఆర్థిక ఫలితాలను ప్రకటించి కార్పొరేట్ ఫలితాల సీజన్‌కు తెరతీయనుంది. మరుసటి రోజు గురువారం హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ కంపెనీలు ఫలితాలు వెల్లడించనున్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్యూరెన్స్13న, అవెన్యూ సూపర్‌మార్ట్స్ 14న, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15న రిజల్ట్స్ ప్రకటించనున్నాయి. బ్యాంక్స్, ఆటో, అయిల్ మార్కెట్ కంపెనీల మెరుగైన పనితీరుతో నిఫ్టీ 50 కంపెనీల ఆదాయ వృద్ధి క్యూ2లో 21–23% గా నమోదవ్వొచ్చని బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచ పరిణామాలు... స్థూల ఆర్థిక డేటా జపాన్ ఆగస్టు కరెంట్ అకౌంట్ డేటా, అమెరికా ఆగస్టు హోల్‌సేల్ నిల్వల గణాంకాలు మంగళవారం విడుదల అవుతాయి. అమెరికా పీపీఐ ద్రవ్యోల్బణ డే టా, ఫెడ్ రిజర్వ్ సమా వేశ వివరాలు, చైనా సెప్టెంబర్ వాహన విక్ర యాలు బుధవారం వెల్ల డి కానున్నాయి. భారత, యూఎస్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు యూఎస్ నిరుద్యోగ డేటా గురవారం విడుదల అవుతుంది. వారాంతాపు రోజు భారత డబ్ల్యూపీ ద్రవ్యోల్బణం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గణాంకాలు వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల స్థితిగతులను తెలియజేసే కీలక స్థూల ఆర్థిక డేటా వెల్లడి మార్కెట్లో అప్రమత్తత చోటు చేసుకోవచ్చు. వారంలో రూ.8 వేల కోట్లు వెనక్కి.. దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ అక్టోబర్ నెలలో మొదటి వారం రోజుల్లోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 8,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అమెరికా డాల ర్ విలువ, బాండ్లపై రాబడులు స్థిరంగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.ఎఫ్‌పీఐలు ఇప్పట్లో భారత మార్కెట్లలో కొనుగోళ్లకు దూరంగా ఉండొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. డిపాజిటరీ డేటా ప్రకారం, గత నెలలో ఎఫ్‌పీఐ లు రూ. 14,767 కోట్ల విలువైన షేర్ల అమ్మారు. మార్చి – ఆగస్టు మధ్య రూ. 1.74 లక్షల కోట్ల నిధులను మార్కెట్లలో పెట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల మొత్తం పెట్టుబడి రూ. 1.12 లక్షల కోట్లకు చేరగా, డెట్ మార్కెట్లో రూ. 31,200 కోట్లకు పైగా ఉంది. -
‘వారంతా 18-25 ఏళ్ల వయస్సు వాళ్లే’.. దేశంలో పెరిగి పోతున్న ఉద్యోగం చేసే వారి సంఖ్య
న్యూఢిల్లీ: ఉపాధి కల్పనకు సంబంధించి నవంబర్ సానుకూల సంకేతం ఇచ్చింది. 2022 నవంబర్‌లో నికరంగా 16.26 లక్షల మంది చందాదారులు చేరినట్లు కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ సంఖ్య 16.5 శాతం అధికంగా ఉండడం గమనార్హం. ఇక 2022 అక్టోబర్‌తో పోల్చితే ఈ గణాంకాలు ఏకంగా 25.67 శాతం అధికంగా ఉన్నాయి. తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► నవంబర్‌లో 16.26 లక్షల మంది నికరంగా ఈపీఎఫ్ఓ చందాదారులగా చేరితే అందులో 8.99 లక్ష మంది మొదటి సారి చేరినవారు. ఇలా చేరిన వారు అక్టోబర్‌తో (7.28 లక్షలు) పోల్చితే 1.71 లక్షల మంది అధికం. ► కొత్తగా ఆర్గనైజేషన్‌లో చేరిన వారిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సువారు 2.77 లక్షల మంది. 22–25 మధ్య వయస్సు వారు 2.32 లక్షల మంది. మొత్తం కొత్త సభ్యుల్లో 18 నుంచి 25 మధ్య వయస్కుల వారి వెయిటేజ్ 56.60 శాతంగా ఉంది. మొదటిసారి ఉద్యోగంలో చేరినవారు భారీగా సంఘటిత రంగంలోనే నమోదయినట్లు ఈ గణాంకాలు పేర్కొనడం సానుకూల అంశం. ► ఇక దాదాపు 11.21 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓమెంబర్షిప్లో తిరిగి చేరారని కూడా డేటా పేర్కొంది. ఉద్యోగాల మార్పు, ఈపీఎఫ్ఓ కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరడం, తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా సామాజిక భద్రతా రక్షణను పొడిగిస్తూ వారి నిధిని బదిలీ చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నవారు ఇందులో ఉన్నారు. ► ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం, నవంబర్ 2022లో నికర మహిళా సభ్యుల నమోదు సంఖ్య 3.19 లక్షలు. అక్టోబర్ 2022కు సంబంధించి 2.63 లక్షల మందితో పోల్చితే ఇది 0.56 శాతం అధికం. ఈఎస్ఐ స్కీమ్ గణాంకాలు ఇలా... ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈఎస్ఐ స్కీమ్) తొలి విడత 2022 నవంబర్ పేరోల్ డేటాను కూడా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో సమీక్షా నెల్లో 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగులు జతయ్యారు. 2021 నవంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య నికరంగా 5.24 లక్షలు పెరిగింది. డేటా ప్రకారం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద తమ ఉద్యోగులకు సామాజిక భద్రత కవరేజీని అందజేయడానికి ఉద్దేశించి నవంబర్ 2022 నెలలో దాదాపు 21,953 కొత్త సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. ఈఎస్ఐ కింద నవంబర్‌లో జతయిన 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగుల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు 8.78 లక్షల మంది. నమోదయిన నికర మహిళా సభ్యుల సంఖ్య 3.51 లక్షలు. నవంబర్‌లో మొత్తం 63 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు కూడా ఈఎస్ఐ స్కీమ్‌లో నమోదు చేసుకున్నట్లు డేటా పేర్కొంది. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి ( సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
సెన్సెక్స్ 402 పాయింట్లు జూమ్
వారం రోజుల గరిష్టంలో క్లోజింగ్ - రెండు రోజుల్లో 826 పాయింట్ల పెరుగుదల - 7,800 పాయింట్ల పైకి నిఫ్టీ ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా సంస్కరణల జోరు వార్తలతో బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 402 పాయింట్లు ఎగిసింది. వారం రోజుల గరిష్ట స్థాయి 25,720 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా కీలకమైన 7,800 పాయింట్ల మార్కును అధిగమించింది. కేంద్ర క్యాబినెట్ స్పెక్ట్రం ట్రేడింగ్ నిబంధనలు ఓకే చేయడం, గోల్డ్ సావరీన్ బాండ్లకు లైన్ క్లియర్ చేయడం తదితర అంశాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఇన్వెస్టర్లకు ఉత్సాహమిచ్చే పలు చర్యలతో పాటు అమెరికా సూచీలు సానుకూలంగా ఉండటం, చైనాలో ప్రభుత్వ ఆర్థిక సహాయక ప్యాకేజీ ఆశలతో స్థిరత్వం నెలకొనే సంకేతాలు, జపాన్ సూచీలు 2008 తర్వాత తొలిసారి అత్యంత భారీగా ఎగియడం మొదలైనవి కూడా మార్కెట్లకు తోడ్పాటునిచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలపడి 66.41కి పెరగడం సైతం సెంటిమెంటుకు తోడైంది. సెన్సెక్స్ ఇంట్రా డేలో 25,821 పాయింట్ల గరిష్ట స్థాయిని కూడా తాకింది. చివరికి 1.59 శాతం లాభంతో 25,720 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 3 తర్వాత ఇదే అత్యధిక స్థాయి క్లోజింగ్. దీంతో రెండు రోజుల్లోనే సెన్సెక్స్ 826 పాయింట్లు లాభపడినట్లయింది. అటు నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 7,819 పాయింట్ల వద్ద ముగిసింది.