possibility
-
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో రేపు(బుధవారం) అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 గంటల్లో (మే24) మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల చివర వరకు తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని వెల్లడించింది.ఈశాన్య దిశగా కదులుతూ బలపడనున్న అల్పపీడనం.. నైరుతి బంగాళాఖాతానికి అనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. దీంతో అయిదు రోజుల పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకూ ఆవరించింది. ఈ కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీతెలిపింది. -
ఒకేరోజు 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
ఛత్తీస్‌గఢ్‌లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయాయి. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు తగ్గింది. తేమ 87 శాతానికి పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలోని ఇళ్లు, కార్యాలయాల్లోని ఏసీలు, కూలర్లకు విశ్రాంతి దొరికింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. గడచిన 24 గంటల్లో రాయ్‌పూర్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది, రాయ్‌పూర్‌లో 24.7, మనాలో 24, బిలాస్పూర్లో 28.4, పెండ్రారోడ్లో 29.6, అంబికాపూర్‌లో 31.5, జగదల్పూర్లో 26.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయ్‌పూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గింది. -
నీటి కేటాయింపులు.. ఆ ఆరు ప్రాజెక్టులకే పరిమితం
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ఆరు ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడంపైనే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 పరిమితమైందని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం తమకు లేదంటూ ‘పాలమూరు–రంగారెడ్డి’ పథకంపై చేసిన విచారణలో ట్రిబ్యునల్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ.. తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులకే పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడాలని విభజన చట్టంలో సెక్షన్–89లో కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లే అవకాశంలేదు. ఉమ్మడి రాష్ట్రానికి మిగులు జలాలు 194 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయిస్తూ 2013లో తుది నివేదిక ఇచ్చింది. ఇందులో తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ద్వారా కేంద్రం ఆ ట్రిబ్యునల్‌కే కట్టబెట్టింది. దాంతో 2016 నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది. ఏపీకి 125.5.. తెలంగాణకు 47 టీఎంసీలు విభజన చట్టం 11వ షెడ్యూలులో కేంద్రం ఆమోదించిన తెలుగుగంగకు తుది తీర్పులోనే 25 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. శ్రీశైలం నుంచి 29 టీఎంసీల కృష్ణా వరద జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలు జతచేసి తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. తెలుగుగంగకు మరో 4 టీఎంసీలు అవసరం. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా, 38 టీఎంసీలు తరలించేలా గాలేరు–నగరి, 43.5 టీఎంసీలు తరలించేలా వెలిగొండను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 125.5 టీఎంసీలు అవసరం. మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 22 టీఎంసీలు తరలించేలా నెట్టెంపాడు, శ్రీశైలం నుంచి 25 టీఎంసీలు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతలను చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకు తెలంగాణకు 47 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే 172.5 టీఎంసీలు అవసరం. కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు 169 టీఎంసీలను.. ఆ ఆరు ప్రాజెక్టులకు ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు సర్దుబాటు చేయనుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు కొత్త ట్రిబ్యునలే.. ఇక విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంతో మదింపు చేయించుకుని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రాని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కోసం అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంచేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ ‘కృష్ణా’పై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, నెట్టెంపాడు, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథలకు నీటి కేటాయింపులపై విచారణ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్‌ను వేయాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసంలో జమిలీ ఎన్నికలపై జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు. 'వన్ నేషన్ వన్ ఎలెక్షన్'పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు మొదటిసరి అధికారికంగా సమావేశమయ్యింది. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించి సిఫారసులు చేయనుంది. రాజ్యాంగ సవరణలు: ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది. రాష్ట్రాల అనుమతి: ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే వాటి సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? లేక కేంద్రమే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవచ్చా అన్నదానిపై కూడా స్పష్టతనివ్వాలి. సంకీర్ణాలైతే : ఇక ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అధ్యయనం చేసి హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై కూడా ఈ కమిటీ సూచనలు తెలియజేయాలి. సాధ్యం కాకపోతే: ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ పూర్తి వివరాలను తెలియజేయాలి. భవిష్యత్తు : ఒకసారి పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా సిఫారసులు చెయ్యాలి. సిబ్బంది: ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించాలి. ఒక్కటే ఓటర్ కార్డు: లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలో తెలియజేయాలి. ఇది కూడా చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్ -
జమిలి ఎన్నికలపై ఫస్ట్ స్టెప్, కోవింద్ నేతృత్వంలో కమిటీ
ఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై కమిటీని నియమించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 16 మందితో కూడిన ఈ కమిటీ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించి రిపోర్టును సమర్పించనుంది. ప్రత్యేక సమావేశాల్లోనే జమిలి బిల్లు.? సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన వెంటనే కేంద్రం ఈ కమిటీని నియమించింది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. STORY | Ex-President Kovind-headed committee to explore possibility of 'one-nation, one-election'READ: https://t.co/UyGLbbKpdF(File Photo) pic.twitter.com/XVbXHjd75f— Press Trust of India (@PTI_News) September 1, 2023 అయిదు రాష్ట్రాల్లో యథాతధం.? అయితే షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లోగా అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగాలి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలి. దానికి గాను ఎన్నికల సంఘం ముందున్న గడువు డిసెంబర్ 13, 2023. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వాటికి సంబంధం లేకుండా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిషన్ ఒకటి వచ్చే సోమవారం మధ్యప్రదేశ్ లో పర్యటించనుంది. Sources say that ECI is going ahead with its schedule for conduct of assembly elections in five states, namely, Madhya Pradesh, Chhattisgarh, Rajasthan, Telangana and Mizoram; elections to these five States have to be completed before 13.12.2023. Commission to visit MP on Monday… — Arvind Gunasekar (@arvindgunasekar) September 1, 2023 లా కమిషన్ కసరత్తు వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసిన లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ పార్లమెంట్లో ప్రధాని మోదీ ఈ అంశంపై పలుమార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ఉంది. మొదట్లో జమిలీ ఎన్నికలే.. 1967 వరకు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడిన తర్వాత ఈ పద్ధతి ఆగిపోయింది. లోక్‌సభ కూడా మొదటిసారిగా 1971లో షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. ఇదీ చదవండి: ప్రత్యేక సమావేశాలు.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు బీజేపీ ప్లాన్! -
ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ సన్నాహాలు
-
ఐపీఎల్‌పై మళ్లీ ఆశలు...
కరోనా దెబ్బకు ఆగిపోయిన ఐపీఎల్‌ను మళ్లీ నిర్వహించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇది కాస్త కార్యరూపం దాలిస్తే భారత అభిమానులకే కాదు యావత్ క్రికెట్ ప్రియులకు వినోదం పంచుతుంది. అసలే ప్రేక్షకులంతా క్రికెట్ ఎంటర్టైన్మెంట్కు పరితపిస్తున్నారు. మ్యాచ్‌లు గానీ జరిగితే టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. కోవిడ్–19 విలయంతో మార్చి, ఏప్రిల్‌లలో జరగాల్సిన ఈ లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ విషయంలో మరోసారి కదలిక వచ్చింది. ఇన్నాళ్లు జరుగుతుందా లేదా అన్న సందేహాలతో ఊగిసలాడుతున్న లీగ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటన కొత్త ఊపిరి పోసింది. ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ పోటీలు నిర్వహించేందుకైనా సిద్ధమేనని గంగూలీ సంకేతమిచ్చాడు. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తున్నామని చెప్పాడు. బుధవారం ఐసీసీ బోర్డు మీటింగ్ ముగిసిన తర్వాత గంగూలీ లీగ్ వ్యవహారంపై దృష్టిసారించాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించేందుకు బోర్డు అన్ని అవకాశాల్ని సునిశితంగా పరిశీలిస్తుంది. గేట్లు మూసైనా సరే మ్యాచ్‌లు జరిపేందుకు సిద్ధంగా ఉంది. లీగ్ కోసం అభిమానులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు, భాగస్వామ్య పక్షాలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల భారత ఆటగాళ్లే కాదు... విదేశీ ఆటగాళ్లు సైతం లీగ్‌లో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మేం కూడా టోర్నీ జరుగుతుందనే ఆశావాహ దృక్పథంతో ఉన్నాం. లీగ్ భవిష్యత్ కార్యాచరణను బోర్డు త్వరలోనే ప్రకటిస్తుంది’ అని గంగూలీ తెలిపాడు. అలాగే రాష్ట్రస్థాయి, దేశవాళీ సీజన్‌పై కూడా సమగ్ర కార్యాచరణతో ముందడుగు వేస్తామన్నాడు. ‘బోర్డు ఏ అవకాశాన్ని వదలట్లేదు. దేశవాళీ క్రికెట్‌పై ప్రణాళికను సిద్ధం చేస్తుంది. రంజీ, దులీప్, విజయ్ హజారే టోర్నీల నిర్వహణ కోసం విస్తృతంగా పరిశీలిస్తుంది. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలను బోర్డు వెల్లడిస్తుంది’ అని గంగూలీ అన్నాడు. దీనికి సంబంధించి బుధవారం గంగూలీ రాష్ట్ర క్రీడా సంఘాలకు లేఖ రాశాడు. ముఖ్యంగా కరోనా పరిస్థితుల్ని అధిగించేందుకు బోర్డు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను రూపొందించే పనిలో ఉందని, రాష్ట్ర సంఘాలకు ఎస్ఓపీ మార్గదర్శకాలు విడుదల చేస్తుందని, ముందస్తు జాగ్రత్తలు, రక్షిత ఏర్పాట్లన్నీ అందులో ఉంటాయని చెప్పాడు. ఇందుకోసం సభ్య రాష్ట్ర సంఘాలన్నీ సమగ్ర వివరాలతో నిధుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని గంగూలీ పేర్కొన్నారు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అలాగే టి20 ప్రపంచకప్‌పై కూడా లీగ్ నిర్వహణ ఆధారపడివుంది. ఐసీసీ గనక మెగా ఈవెంట్‌ను వాయిదా వేస్తే ఆ తేదీలను ఐపీఎల్‌కు వినియోగించుకోవాలని బోర్డు భావిస్తోంది. ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐ సుమారు రూ. 4 వేల కోట్లు నష్టపోయే అవకాశం ఉంది. మరో వైపు ప్రేక్షకులే లేకుండా టోర్నీ జరపాలని భావిస్తే ఏ దేశంలో నిర్వహించినా ఒకటేనని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వ్యాఖ్యానించారు. -
ఉక్కు కోసం ఉద్యమిద్దాం
సాక్షి, కడప కార్పొరేషన్ : కడప ఉక్కు పరిశ్రమ బీజేపీ ప్రభుత్వం వేసే భిక్ష కాదని, పార్లమెంటులో చేసిన చట్టమని, హక్కుదారులు కావాలంటే ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని అఖిపక్షనేతలు పిలుపునిచ్చారు. కడపలోని వైఎస్ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు రావాలని వైఎస్ఆర్ కలలు కనేవారన్నారు. ఈ మేరకే ఆయన హయాంలో జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారన్నారు. బ్రాహ్మణి యాజమాన్యం రూ.1800కోట్లు ఖర్చు చేసి పరిశ్రమ ఏర్పాటు చేసిందని, రూ.1200కోట్లు ఖర్చు చేస్తే అది పూర్తవుతుందన్నారు. అయితే దురదృష్టవశాత్తు మొదటి నుంచి జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. ఉక్కు పరిశ్రమను విభజన చట్టంలో పొందుపరిచారని, పరిశ్రమ స్థాపనకు కావలసిన ఎయిర్‌పోర్టు, రైల్వే, విద్యుత్, నీరు, వనరులు వంటి అన్ని అనుకూలతలు ఇక్కడ ఉన్నా అది రాకపోవడానికి ప్రధాన కారణం టీడీపీయేనని ధ్వజమెత్తారు. నాలుగేళ్లపాటు కలిసి పోరాడుదామంటే ముందుకు రాని టీడీపీకి ఈరోజు ప్రతిపక్షాలు కనిపించాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి లక్షల కోట్లు పచ్చచొక్కాల వారికి పంచేసి పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు, ఉక్కు పరిశ్రమ వల్లే విశాఖపట్నం అంతపెద్ద నగరంగా అభివృద్ధి చెంది, 42 శాతం ఆదాయాన్నిస్తోందన్నారు. కడపకు ఉక్కు పరిశ్రమ వస్తే అదే తరహాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అందరూ ఐక్యంగా సైనికుల వలే పోరాడి సాధించాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ సభ్యుడు బండి జకరయ్య మాట్లాడుతూ జెండాలు పక్కనబెట్టి ఉక్కు పరిశ్రమే ఏకైక ఎజెండాగా పోరాడాలన్నారు. నాలుగేళ్లు ఉక్కు పరిశ్రమపై పట్టించుకోని టీడీపీ ఈనాడు అఖిలపక్షాన్ని పిలవడం సిగ్గుచేటన్నారు. బీఎస్పీ నాయకులు గుర్రప్ప మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధనకు అన్ని వర్గాలను ఏకం చేసి పోరాడాలని సూచించారు. జనసేన నాయకులు చలపతి మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఇన్నాళ్లు చేసిన పోరాటం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యిందన్నారు. లీగల్ సెల్ అథారిటీ కన్వీనర్ గుర్రప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్ దూరదృష్టితో ఉక్కు పరిశ్రమ స్థాపించారని, రెండు పత్రికలు మాత్రం బ్రాహ్మణి మూతపడే వరకూ విశ్రమించకుండా కథనాలు రాశాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ జల్లికట్టు, తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమించాలని చెప్పారు. మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధనకోసం ప్రాణ త్యాగానికైనా, అరెస్టులు కావడానికైనా, జైలుకెళ్లడానికైనా సిద్దమేనని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఐఎన్ సుబ్బమ్మ, స్టీల్‌ప్లాంటు సాధన సమితి నాయకులు సీఆర్వీ ప్రసాద్, రైతు స్వరాజ్య వేదిక శివారెడ్డి, కిషోర్ కుమార్, చల్లా రాజశేఖర్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, టి. సునీల్, విజయ్‌కుమార్, ఖాజా, షఫీ, పత్తి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉన్నా మోడీ నోట్లో శని.. బీజేపీ కళ్లున్న కబోదిలా వ్యవహరించింది. నాలుగేళ్లు కమిటీల పేరుతో కాలయాపన చేసి ఈనాడు సాధ్యం కాదని చెప్పడం దారుణం. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు కావలసినంత భూమి, నీరు, రైల్వేలైన్, ఎయిర్‌పోర్టు, ముడిసరుకు ఉందని.. అన్నీ ఉన్నా మోడీ నోట్లో శని ఉన్నట్లు పరిస్థితి తయారైంది. ఉక్కు పరిశ్రమ సాధనకు చేసే ఉద్యమానికి కాంగ్రెస్ పూర్తి సహకారం ఇస్తుంది. – నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు ఉక్కు ఉద్యమానికి ఏపీయూడబ్లు్యజే మద్దతు... కడపలో ఉక్కు పరిశ్రమ సాధనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేసే ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్లు్యజే) పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి తెలిపారు. విభజనతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, విభజన చట్టంలో ఉన్న ఉక్కు పరిశ్రమను ఇన్నాళ్లు ఇస్తాం, ఇస్తాం అని ఊరించిన కేంద్రం ఒక్కసారిగా సాధ్యం కాదని చెప్పడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్ఎస్ రెడ్డి, జయపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉక్కు ఉద్యమం పల్లెల వరకూ పాకాలి.. ఉక్కు ఉద్యమం పల్లెల వరకూ పాకాలి. అందుకోసం విస్తృత ప్రచారం చేయాలి. ద్రోహం చేసిన వారు, ఆ ద్రోహానికి సహకరించిన వారు కూడా దోషులే. అన్యాయం చేసేవారితో చేతులు కలపొద్దని, ద్రోహులను ఏకాకిని చేసి ఉక్కు పరిశ్రమ ఒక్కటే ఏకైక ఎజెండాగా పోరాడాలి. అమరావతికి భూమిపూజ చేసేటప్పుడు మట్టి, నీళ్లు తెచ్చి మొఖాన కొట్టిన మోడీ, ఈనాడు రాయలసీమ ఆశలపై నీళ్లు చల్లారు. – ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి -
లైంగిక చర్యతో కూడా జికా వ్యాప్తి!
న్యూయార్క్: జికా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. ప్రెగ్నెన్సీ మహిళలు దీని బారిన పడితే వారికి పుట్టే పిల్లల్లో తల పరిమాణం చిన్నదిగా ఉండి మెదడుకు సంబంధించిన ఎదుగుల తక్కువగా ఉంటోంది ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల కాలంలో జికా వైరస్ ప్రభావానికి గురైతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటివరకూ జికా వైరస్ దోమ కాటు ద్వారానే వ్యాప్తి చెందుతుందని భావిస్తూ వచ్చారు. ఎడీస్ ఈజిప్టి దోమ జికా వైరస్‌ను వ్యాప్తి చెస్తోంది. అయితే లైంగిక చర్య ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జికా వైరస్ బారినపడిన ఓ వ్యక్తి రక్తంతో పాటు వీర్యం శాంపిల్స్‌లో కూడా రెండు వారాల పాటు వైరస్ ఉనికిని గుర్తించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాల్లో ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. బ్రెజిల్లో జికా వైరస్ విజృంభిస్తుండటంతో రియో ఒలంపిక్స్పై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. పలు దేశాలు తమ మహిళా క్రీడాకారిణిలను బ్రెజిల్ పంపడానికి సందిగ్ధంలో పడ్డాయి. అయితే ఒలంపిక్స్ నాటికి జికాను అదుపులోకి తెస్తామని బ్రెజిల్ చెబుతోంది. భారత్‌లో డెంగీ వ్యాప్తి చేసే ఎడీస్ దోమలకు కొదువలేదు. ఈ దోమలే జికా వైరస్‌నూ వ్యాప్తి చెందిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఐసిస్ అలకిడి..