post card
-
మధుర జ్ఞాపకాలను మిగిల్చిన ఉత్తరం
చిల్లకూరు: తోక లేని పిట్ట తొంభై ఆమడల దూరం పోయింది.. అది ఏంటీ అనే సామెత అడిగిన వెంటనే ‘ఉత్తరం’ అని సమాధానం వచ్చేది. అయితే ఇప్పుడు ఆ మాట చెప్పుకునేందుకే తప్ప.. ఉత్తరం రాసేవారే కరువయ్యారు. పోస్టు అని ఇంటి ముంగిట పోస్టు మ్యాన్ కేక వేయగానే.. ఉత్తరం అందుకునేందుకు ఉరుకున వచ్చేవారు. తమ బంధుమిత్రులు అందించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉత్సుకతతో ఉత్తరాల కోసం ఎదురుచూసేవారు. మంచి వార్తను మోసుకొచ్చిన జాబులను భద్రంగా దాచుకునేవారు. ఆ రోజులు మధుర జ్ఞాపకాల్లా మిగిలిపోయాయి. నేటి సమాజంలో పిల్లలకు పోస్టులో ఉత్తరం వచ్చి దానిని చదువుకుని ఎంతో తృప్తి పడే వారమని పెద్దలు చెబితే.. ఇంకా లేఖలు ఏంటి.. నేరుగా సెల్ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదా అని అంటున్నారు. అయితే ముఖాముఖీగా వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడుతున్నా, సంబోధనలో ఎన్నో మార్పులు ఉంటాయి. అయితే ఉత్తరంలో పలకరింపులు సంప్రదాయబద్ధంగా ఉంటూ మనసును ఆకట్టుకుంటాయి. పెద్దలైతే మహారాజశ్రీ, చిన్న వారైతే చిరంజీవి, మహిళలను లక్ష్మీ సమానురాలైన, వితంతువులైతే గంగా భాగీరథీ సమానులైన అని సంబోధించేవారు. అలాగే ఉత్తరం ముగింపులో కూడా పెద్దలకు నమస్కారంతో అని, చిన్నవారికి ఆశీస్సులతో అని రాసేవారు. ఎవరైనా కాలం చేసిన వార్తను ఉత్తరంలో రాసేప్పుడు ఒక వైపున నలుపు రంగు ఉండేలా చూసేవారు. ఆ ఉత్తరాన్ని ఇంట్లోకి తీసుకెళ్లకుండా బయటనే చించివేసేవారు. అలాగే ముఖ్యమైన సమాచారం ఉండే లేఖరను జాగ్రత్తగా ఒక కమ్మీకి కుట్టి పెట్టే వారు.స్మార్ట్‌ఫోన్ ప్రభావంతోనే..ఉత్తరాలు రాసుకునే రోజుల్లో ప్రేమలేఖ, శ్రీవారికి ప్రేమలేఖ, ఇలా ఎన్నో లేఖలపై సినిమాలు తీశారు. అవి ప్రేక్షకులను సైతం విశేషంగా అలరించాయి. అయితే నేటి యువత చేతిలోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ ను గంటల తరబడి వాడుతున్నప్పటికీ అవతల వారి పూర్తి యోగ క్షేమాలు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఒకటి రెండు మాటలు మాట్లాడిన తర్వాత టిక్ టాక్‌లు, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ ఇలా వేరే వ్యాపకాలకు మొగ్గుచూపుతున్నారు. క్షేమ సమచారాలను కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో పంచుకునేందుకు కూడా ఇష్ట పడడం లేదు. ఉత్తరాలు రాసుకునే సమయంలో మరో ఉత్తరం వచ్చే వరకు ఎదురు చూపులు ఉండేవి. సమయం లేక రాయలేని వారికి ఉత్తరం రాసి చాలా రోజులైందనే దిగులు ఉండేది. కానీ నేడు స్మార్ట్ ఫోన్ల రాకతో ఉత్తరాల ఊసే లేకుండా పోయింది. దీంతో యువత అరకొర సందేశాలను పంపుకుని సంతోష పడుతున్నారే కానీ, పాత కాలంలో లాగా పూర్తి సమాచారం చదువుకుని తృప్తి పడలేక పోతున్నారు. -
విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఉత్తరం రాసెయ్.. ప్రధానిని కలిసెయ్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమాన్ ఊరూరూ తిరుగుతూ ‘సార్.. పోస్ట్’అనుకుంటూ ఉత్తరాలు పంచడం ఇప్పుడెక్కడా కనిపించట్లేదు. ఈకాలంలో ఎవరూ అసలు ఉత్తరాలే రాయట్లేదు. నేటి తరం వాళ్లకు చాలా మందికి అసలు పోస్టు కార్డు అంటే ఏంటో కూడా తెలియదు. అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఉత్తరాలు రాసే ఇష్టాన్ని పెంచడానికి తపాలా శాఖ ఓ మంచి కార్యక్రమం మొదలుపెట్టింది. ఇందుకు ఆజాదీ కా అమృతమహోత్సవాలను వేదికగా చేసుకుంది. 75 లక్షల పోస్టు కార్డులను ప్రత్యేకంగా ప్రింట్ చేసి రాష్ట్రాలకు పంపింది. విద్యార్థులు అర్ధ రూపాయికి వాటిని కొని వ్యాసం రాసి పంపాలని పోటీ పెట్టింది. గెలిచిన వాళ్లకు బహుమతులతో పాటు నేరుగా ప్రధాని మోదీని కలవొచ్చని చెప్పింది. ఎంట్రీలకు ఈ నెల 20 చివరి తేదీ అని, రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా వ్యాసం రాసి పంపొచ్చని తెలిపింది. మన రాష్ట్రానికి 3 లక్షలు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తపాలా శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 75 లక్షల పోస్టు కార్డులను ఎంపిక చేసింది. 4వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులను అర్హులుగా ప్రకటించింది. ఆసక్తి ఉన్న వాళ్లు అర్ధ రూపాయి చెల్లించి తపాలా కార్డు కొని దానిపై క్లుప్తంగా వ్యాసం రాయాల్సి ఉంటుంది. డిమాండ్ లేకపోవటంతో తపాలా కార్డులను ఆ శాఖ ప్రింట్ చేయట్లేదు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కార్డులను ముద్రించింది. అన్ని రాష్ట్రాలకూ వాటిని పంపింది. రాష్ట్రానికి 3 లక్షల కార్డులను విద్యా శాఖ, కేంద్రం పరిధిలోని సీబీఎస్సీ పాఠశాలల అధికారులకు అందించింది. ఆసక్తి ఉన్న పాఠశాలల విద్యార్థుల నుంచి ఎంట్రీలు కోరుతోంది. ఒక్కో విద్యా సంస్థ నుంచి 10కి మించకుండా.. స్వాతంత్య్ర సమరయోధులు, 2047 (వందేళ్ల స్వతంత్ర భారతం) నాటికి దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు.. ఈ రెండు అంశాలపై క్లుప్తంగా వ్యాసం రాయాల్సి ఉంటుంది. అలా రాసిన కార్డులను సంబంధిత విద్యా శాఖ అధికారులు సేకరిస్తారు. ఒక్కో విద్యా సంస్థ నుంచి 10 మించకుండా ఉత్తమమైన రచనలను గుర్తించాలి. వాటిని https://innovateindia.mygov.in/postcardcampaign/ లో అప్లోడ్ చేయాలి. వాటిల్లోంచి అతి ఉత్తమమైన 75 ఎంట్రీలను ఎంపిక చేసి ఆ విద్యార్థులు జనవరి 17న స్వయంగా ప్రధానితో ముఖాముఖికి అవకాశం కల్పిస్తారు. బహుమతులు కూడా అందిస్తారు. ఇతర వివరాల కోసం దగ్గర్లోని పోస్టాఫీసుల్లో కూడా సంప్రదించవచ్చని తపాలా శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరాలు రాయడం అలవాటు చేయాలని.. తపాలా శాఖ పునరుత్తేజం పొందేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నా ఉత్తరాలు రాసే అలవాటును పెంచలేకపోతోంది. ఆ అలవాటు సమాజం నుంచి దాదాపు మాయమైంది. దీంతో నేటి తరానికి లేఖలు రాసే విష యంలో అవగాహన కూడా లేదు. గతంలో కొన్నిసార్లు మన్‌కీ బాత్ లాంటి కార్యక్రమాల్లో స్వయం గా ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తరాలు రాస్తే కలిగే అనుభూతిని నేటి తరం కూడా పొందాలని.. స్నేహితులు, బంధువులకు సరదాగానైనా ఉత్తరాలు రాయాల ని పిలుపునిచ్చారు. ఫోన్లో పలకరింపుతో పోలిస్తే ఉత్తరం ద్వారా మాట్లాడటం గొప్ప అనుభూతి అన్నారు. కానీ ఆ దిశగా స్పందన రావట్లేదు. దీంతో విద్యార్థులతో ఉత్తరాలు రాయించే కార్యక్రమాన్ని చేపట్టాలని తపాలా శాఖ నిర్ణయించింది. -
అంగారక గ్రహం నుంచి వచ్చిన పోస్ట్కార్డ్ను చూశారా..!
NASA Curiosity Rover Sends A Rare Postcard From Mars To Mark 10th Anniversary: భూగ్రహమే కాకుండా మానవులకు నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూమికి అత్యంత సమీపంలోని అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చుననే భావనతో నాసా ఇప్పటికే మార్క్‌పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్ రోవర్లను ప్రయోగించింది. తాజాగా క్యూరియాసిటీ రోవర్‌ను లాంచ్ చేసి నవంబర్ 26తో పది వసంతాలు ముగిశాయి. 2011 నవంబర్ 26న క్యూరియాసిటీ రోవర్‌ను నాసా లాంచ్ చేసింది. మార్స్‌పైకి పది సంవత్సరాల క్రితం ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ ఇంకా పనిచేస్తోండడం గమనార్హం. అద్భుతమైన పోస్ట్‌కార్డ్..! క్యూరియాసిటీ రోవర్ పది వసంతాలను పూర్తి చేసుకోవడంతో మార్స్ నుంచి భూమికి అద్భుతమైన ఫోటోలను పంపింది. మార్టిన్ ల్యాండ్‌స్కేప్‌లో క్యూరియాసిటీ రోవర్ బంధించిన ఆసక్తికరమైన రెండు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను నాసా తన సోషల్‌మీడియా ఖాతాలో క్యూరియాసిటీ పంపిన పోస్ట్కార్డుగా వర్ణిస్తూ షేర్ చేసింది. ఫోటో కర్టసీ: నాసా క్యూరియాసిటీ పంపిన ఫోటోలను నాసా శాస్త్రవేత్తలు కాస్త ఎడిట్ చేస్తూ..‘విష్ యూ వర్ హియర్’ అనే ట్యాగ్ లైన్‌తో సోషల్ మీడియా నాసా పోస్ట్చేసింది. క్యూరియాసిటీ రోవర్ 360 డిగ్రీల కెమెరా సహయంతో ఈ ఫోటోలను తీసింది. క్యూరియాసిటీ రోవర్ నిర్వహణ బాధ్యతలను నాసా జెట్ ప్రొపెల్షన్ లాబోరేటరీ చూసుకుంటుంది. ఇప్పటివరకు మార్స్‌పై క్యూరియాసిటీ కనిపెట్టిన వాటిలో ముఖ్యమైనవి..! ⇒మార్టిన్ రేడియేషన్ వాతావరణాన్ని అంచనా వేసింది. ⇒అంగారక గ్రహాన్ని చేరిన ఏడు సంవత్సరాల తరువాత క్యూరియాసిటీ రోవర్ మార్స్‌పై ఉన్నపురాతన ప్రవాహాన్ని కనుగొంది. దీంతో మార్స్‌పై నీరు ఒకప్పుడు ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ⇒మార్స్ నేలపై జరిపిన డ్రిల్లింగ్ సహాయంతో సల్ఫర్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ , కార్బన్‌తో జీవానికి సంబంధించిన కొన్ని కీలక రసాయన పదార్థాలను క్యూరియాసిటీ గుర్తించింది. ⇒పురాతన గేల్ క్రేటర్‌లో మిలియన్ల సంవత్సరాలుగా సరస్సులు ఉన్నాయని క్యూరియాసిటీ గుర్తించింది. View this post on Instagram A post shared by NASA (@nasa) చదవండి: ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో ఏదంటే..! -
Post Cord Day: ఆ పాత ‘ఉత్తరం’ ఎక్కడోపోయింది..
సాక్షి, సుజాతనగర్(భద్రాద్రి కొత్తగూడెం): బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నా.. స్నేహితులతో కబుర్లు చెప్పుకోవాలన్నా.. ప్రియుడు/ప్రియురాలితో మనసులోని భావాలను పంచుకోవాలన్నా.. సైనికులు తమ కుటుంబాలకు వివరాలు తెలపాలన్నా.. పాత రోజుల్లో పోస్ట్‌కార్డు (ఉత్తరం) ఉండేది. ఆ ఉత్తరాల ద్వారానే అన్ని రకాల సమాచారం చేరవేసుకునేవారు. ఇంటి ముందటికి పోస్ట్‌మ్యాన్ వచ్చి పోస్ట్ అనగానే ఇంటిల్లిపాది అతడి దగ్గరవాలిపోయేవారు. ఉత్తరాలు చదివి.. తిరిగి జవాబు రాసి పంపించి ఎంతో ఆనందించేవారు. నేడు పోస్ట్ కార్డు డే సందర్భంగా ఆ పాత ఉత్తరాన్ని గుర్తుచేశాం. చదవండి: తలకు గన్నుపెట్టి భూమి పత్రాలను రాయించుకున్న ఎస్సై.. -
ఉత్తరమా.. ఏది నీ చిరునామా?
సాక్షి, ఖమ్మం : పోస్ట్..అంటూ పోస్ట్‌మన్ పిలుపు వినిపిస్తే చాలు..ఎంతో సంతోషంగా ఇంట్లో నుంచి ఎదురేగి ఉత్తరం అందుకునేవారు దశాబ్దాల కిందట. పోస్టుకార్డు, ఇన్లాండ్ లెటర్లలోని ఆత్మీయ, అనుంబంధాలు, యోగ, క్షేమాల అక్షర రూపాలను తనివితీరా చదివి ఆనందించడం ఆ రోజుల్లోని మధురానుభూతి. ఆధునిక పరిజ్ఞానంతో అందివచ్చిన స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లు, ఈ మెయిళ్ల నేటి కాలంలో ఉత్తర, ప్రత్యుత్తరాలు ఆగిపోయి తోకలేని పిట్ట తుర్రుమంది. కేవలం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు, ఉద్యోగ పిలుపులు, ఇతర సమాచారం కోసం ఈ సేవలు కొనసాగుతున్నాయి. మన దేశంలో ఆంగ్లేయుల పాలనలో 1879 జూలై1న పోస్టుకార్డు ఆవిర్భవించిందని చరిత్ర చెబుతోంది. నాడు బంధువులకు, మిత్రులకు ఉత్తరాల ద్వారానే సమాచార మార్పిడి జరిగేది. ఇంకా అభిప్రాయాల సేకరణ, సాహితీ విశ్లేషణ, కలం స్నేహం, ఆకాశవాణి, దూరదర్శన్‌లకు ఉత్తరాలు రాయడం, అక్కడి నుంచి జాబులు అందుకోవడం ఓ అరుదైన జ్ఞాపకమే మరి. జూలై 1న పోస్టు కార్డు దినోత్సవం సందర్భంగా నాటి ఉత్తరంతో అనుబంధాన్ని పలువురు ఇదిగో ఇలా పంచుకున్నారు. ఉత్తరం కోసం ఎదురుచూసేవాడిని నాకు ఉద్యోగం రాక ముందు స్నేహితులకు, బంధువులకు లెటర్లు రాసేది. ఉత్తరం తీసుకుని పోస్టుమన్ ఎప్పుడు వస్తాడా..అని ఎదురూచూస్తుండేది. అంతటి ఆదరణ కలిగిన పోస్టు కార్డులు నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. – సంకటాల శ్రీనివాసరావు, పెద్దమ్మ తల్లి దేవస్థానం ఈఓ, పాల్వంచ పరీక్ష పాసయ్యానని లెటర్ వచ్చింది.. 1990లో ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ సర్వీస్ కోచింగ్‌కు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించినట్లు పోస్టుకార్డు ద్వారా సమాచారం వచ్చింది. అది నేటికీ మరిచిపోలేను. మా చుట్టాలు యోగక్షేమాలు రాసి పంపేవారు. - డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్, పాల్వంచ మూడు రోజుల్లో చేరేది.. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఉత్తరం రాస్తే..అది మూడు రోజుల్లో వారికి చేరేది. వాళ్లు రాసి పంపినా అన్నే రోజులు పట్టేది. మేం వారి ఉత్తరం కోసం ఎంతో ఆత్రుతగా నిరీక్షించి చూసేవాళ్లం. - భాస్కర్‌రావు, రిటైర్డ్ వీఆర్వో, పాల్వంచ పోస్టుకార్డులు అమ్ముడు పోవట్లేదు.. గతంలో మాదిరిగా పోస్టు కార్డులు ఈ రోజుల్లో అమ్మకాలు జరగట్లేదు. పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు మాత్రమే అప్పుడప్పుడు కొనుగోలు చేస్తున్నాయి. నేటితరం వారు తీసుకోవట్లేదు. - కిరణ్‌కుమార్, పాల్వంచ ఇన్చార్జ్ పోస్టుమాస్టర్ కలం స్నేహం గుర్తుకొస్తోంది.. ఆ రోజుల్లో ఉత్తరం రాయడం ద్వారానే చాలామంది స్నేహితులు పరిచయమయ్యారు. ఇప్పటికీ కొంతమందితో ఆ స్నేహం కొనసాగుతోంది. నాటి ఉత్తరాలు అనేకం నా వద్ద ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అభిప్రాయాలను పంచుకునేందుకు ఉత్తరాన్ని మించిన వేదిక మరొకటి ఉండదు. - బత్తుల వీరయ్య, టీఆర్ఎస్ నాయకుడు, నాయకులగూడెం -
పోస్టుకార్డు.. ఈ-మెయిల్
కార్డు ముక్క: అప్పుడు అవసరం.. ఇప్పుడు జ్ఞాపకం మన దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు ఏదైనా సమాచారం పంపాలంటే.. పోస్టుకార్డులే దిక్కు. తొలినాళ్లలో వీటిని ఏనుగులు.. గుర్రాలు.. ఒంటెలపై ఒక ప్రాంతం నుంచి మరో చోటికి బట్వాడా చేసేవారు. కాలక్రమంలో మార్పులకు అనుగుణంగా రైళ్లు.. బస్సులు.. విమానాల్లో కూడా వీటిని చేరవేస్తున్నారు. 1861 నాటికి దేశవ్యాప్తంగా 889 పోస్టాఫీసులు ఉండేవి. వీటి ద్వారా 4.3 కోట్ల ఉత్తరాలు.. 45 లక్షల వార్తా పత్రికలు బట్వాడా అయ్యేవి. స్వాతంత్య్రం వచ్చే నాటికి వీటి సంఖ్య 23,344కు చేరింది. అదే 2011 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 1,54,866 పోస్టాఫీసులు ఉంటే.. వాటిలో సుమారు 5,66,000 మంది విధులు నిర్వహిస్తున్నారు. పోస్ట్.. అంటూ సైకిల్‌పై వచ్చి మన ఇంటి దగ్గర ఉత్తరాలు ఇచ్చివెళ్లే పోస్ట్‌మ్యాన్ మనకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. ఒకప్పుడు మంచి.. చెడు.. పెళ్లి.. పేరంటం.. చావు.. పుట్టుక.. ఇలా రకరకాల విషయాలు చేరేది ఈ ‘కార్డుముక్క’ ద్వారానే. సాధారణ సమాచారం పంపాలంటే పోస్టు కార్డులు.. కీలక సమాచారం కొంచెం భద్రంగా పంపాలంటే ఇన్‌ల్యాండ్ లెటర్లు ఉపయోగించే వారు. లేఖలను పంపాలంటే ఇన్‌ల్యాండ్ కవర్లు అందుబాటులో ఉండేవి. 1990 తర్వాత రిజిస్టర్ పోస్ట్.. ఎయిర్‌మెయిల్.. స్పీడ్ పోస్టు.. కొరియర్.. వంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటి హవా కొన్నాళ్లు.. నడిచింది. ఇప్పుడంతా స్పీడ్ యుగం. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ దూరాన్ని చెరిపేసింది. దీంతో ఉత్తరాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఈమెయిల్స్ ద్వారా సమాచారాన్ని పంపడం తేలికైపోయింది. మనం ఏ క్షణం ఏంచేస్తున్నామో.. తక్షణం సుదూర ప్రాంతంలో ఉన్న స్నేహితులు, బంధువులకు ఈమెయిల్ ద్వారా క్షణాల్లో చేరవేయవచ్చు. అవసరమైతే వారితో నేరుగా చాట్ చేయవచ్చు. దీంతో పోస్టు కార్డు.. ఇన్‌ల్యాండ్ లెటర్లు.. పాత జ్ఞాపకంగా మిగిలిపోతున్నాయి.