post-matric hostels
-
ఖజానా.. ఖాళీ!
సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు కాగితాల మీద మాత్రమే నిధులు మంజూరవుతున్నాయి. నిర్వహణ ఖర్చుల కోసం పెడుతున్న బిల్లులను ఖజానా శాఖ పాస్ చేయడం లేదు. దీంతో నెలల తరబడి బిల్లులు రాక వార్డెన్లు (హాస్టల్ వెల్ఫేర్ అధికారులు)ప్రైవేట్ గా వడ్డీలకు తెచ్చి ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు. పాలు, పండ్లు, గుడ్లతో పాటు కిరాణ సరుకులు, కూరగాయలు, తదితర వస్తువులను అప్పులు తెచ్చి కొనుగోలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నెలలు తరబడి ప్రభుత్వం నుంచి డబ్బులు అందకపోవడంతో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ భారంగా మారింది. కిరాణ సరుకులు, గుడ్లు, పాలు, పండ్లు అరువుకు తేవడంతో దుకాణదారులు డబ్బులు అడుగుతుండడంతో వారికి డబ్బులు ఎలా చెల్లించాలో అర్థంకాక సతమతమవుతున్నారు. వార్డెన్లు బిల్లుల కోసం ప్రతిరోజూ ట్రెజరీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి హాస్టళ్ల నిర్వహణకు ప్రభుత్వం పైసా కూడా విదిల్చలేదు. జిల్లాలో సాంఘిక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు నడుస్తున్నాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే బాలబాలికల కోసం ప్రీ మెట్రిక్ హాస్టళ్లను, ఇంటర్మీడియట్నుంచి పోస్ట్రుగాడ్యుయేషన్ (పీజీ) వరకు చదివే విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి బడ్జెట్లను మూడు, నాలుగు విడతలుగా విడుదల చేస్తుంటుంది. ఆ బడ్జెట్‌ను అవసరాన్ని బట్టి ఆయా హాస్టళ్ల వార్డెన్లకు జిల్లా సంక్షేమ శాఖల అధికారులు విడుదల చేస్తారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 8 మాసాలు కావస్తుండగా, మొదటి విడతకు సంబంధించి ఆగసుట్ వరకు బడ్జెట్ విడుదల చేశారు. ఆయా హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులకు కూడా పంపిణీ చేశారు. కాగా, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బడ్జెట్ విడుదల చేసినట్లు చూపించినా, అది కాగితాల వరకే పరిమితం అయ్యింది. విడుదలైన బడ్జెట్ ఆధారంగానే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అన్ని బిల్లులు తయారు చేసి నవంబర్‌లో ట్రెజరీ కార్యాలయాలకు బిల్లులు పంపించారు. కానీ, ట్రెజరీలో బడ్జెట్ ఫ్రీజింగ్ మొదలు కావడంతో నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా పాస్ కాలేదు. ఇదీ ... తంతు ! ∙ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి జిల్లాలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 46, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 15 మొత్తం 61 హాస్టళ్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 7,097 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రీమెట్రిక్కు సంబంధించి రూ.5,10,935 కాస్మొటిక్ చార్జీల కింద బడ్జెట్ విడుదలైంది. అదే విధంగా డైట్ చార్జీల కింద రూ.81.38 లక్షలు విడుదల కాగా, ఈ రెండింటి బిల్లులు ట్రెజరీకి చేరినా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి బిల్లు పాస్ కాకపోవడంతో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అవస్థలు పడుతున్నారు. నాలుగు మాసాలకు సంబం ధించి బిల్లులు పాస్ కావాల్సి ఉంది. ∙బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో .. జిల్లాలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు 32 ఉండగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 12 ఉన్నాయి. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో 3,407 మంది విద్యార్థులు ఉండగా, పోస్ట్మెట్రిక్లో 2,050 మంది ఉన్నారు. వీరికోసం ప్రభుత్వం రూ.3.10 కోట్లు బడ్జెట్ విడుదల చేసింది. అందులో రూ.1.80 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం నవంబర్ నుంచి ఫ్రీజింగ్ కొనసాగుతుండడంతో రెండో విడత పెట్టుకున్న బిల్లులు కూడా పాస్ కాలేదు. నాలుగు నెలలకు సంబం«ధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పోస్ట్ మెట్రిక్కు సంబంధించి రూ.2.98 కోట్లు రాగా, రూ.1.98 కోట్లు మొదటి రెండు మాసాల్లో ఖర్చయింది. ఆ తర్వాత పంపిన బిల్లులకు నేటికీ మోక్షం లేదు. అన్నీ ట్రెజరీల్లోనే మగ్గుతున్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు 22 ఉండగా కళాశాల హాస్టళ్లు 11 ఉన్నాయి. ఇందుకు సంబంధించి 11,298 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టళ్ల నిర్వహణ కోసం రూ.8.57 లక్షల బడ్జెట్ కేటాయించారు. అందులో రూ.6.20 లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన బడ్జెట్‌కు సంబంధించి బిల్లులు పెట్టగా ఒక్కబిల్లూ పాస్ కాలేదు. దీంతో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొన్ని హాస్టళ్లే ఉన్నా వాటికి సంబంధించి కూడా బిల్లులు పాస్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నిధుల్లేకే... ఫ్రీజింగ్ ప్రభుత్వం కాగితాల మీద బడ్జెట్ విడుదల చేస్తుంది కానీ ఖజానాలో మాత్రం డబ్బులు లేవు. దీంతో బిల్లులు పాస్ చేయకుండా పెండింగ్‌లో పెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బయటికి చూడడానికి బడ్జెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇటు బిల్లులు పాస్ కాకుండా ట్రెజరీలో ఫ్రీజింగ్ పెట్టి అడ్డుకట్ట వేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా, ఇటు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, అటు హాస్టళ్లకు వస్తువులు సరఫరా చేసే వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బిల్లులు పాస్ అయ్యే విధంగా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై ట్రెజరీ అధికారులను వివరణ కోరితే.. ఫ్రీజింగ్ ఉండడం వల్లే బిల్లులు పాస్ చేయలేయమని అంటున్నారు. ఇతర విషయాలు తమకేం తెలియదంటూ జవాబిస్తున్నారు. -
మంత్రి పేరుతో మామూళ్ల దందా
► వసూళ్ల పర్వానికి తెరలేపిన ► గిరిజన సంక్షేమ శాఖాధికారులు ► విద్యార్థికి రూ.25 చొప్పున ఇవ్వాలంటూ ఒత్తిళ్లు ► ఇదేమి గోలంటున్న వార్డెన్లు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారు.. తాము కూడా అందిన కాడికి దోచుకోవటమే నన్నట్టుగా ఉంది అధికారుల ధోరణి. అక్కడ, ఇక్కడ అనే తేడా లేదు. ధనార్జనే ధ్యేయంగా గిరిజన సంక్షేమశాఖాధికారులు మామూళ్ళ పర్వానికి తెరలేపారు. ఈ సంగతిని పక్కనబెడితే రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేరుతో దందాలు చేస్తున్నారని తెలుస్తోంది. మంత్రి కార్యక్రమాలకు ఖర్చులు అవుతున్నాయంటూ వసతిగృహంలో ఉండే ఒకో విద్యార్థిపై రూ.25 చొప్పున కేటాయించి తమకు అందజేయాలని సంబంధిత శాఖాధికారులు వార్డెన్లకు మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. - గుంటూరు వెస్ట్ జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు 31 ఉండగా అందులో 4021 మంది, పోస్టుమెట్రిక్ హాస్టళ్లు 5 ఉండగా 621 ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవికాక ఆశ్రమ పాఠశాలలు 3 ఉన్నాయి. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ.1050, 3 నుంచి 7వ తరగతి చదివే ప్రీమెట్రిక్ విద్యార్థులకు రూ.750, 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు రూ.850 ప్రభుత్వం చెల్లిస్తున్నది. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఉండే బాలికలకు నెలకు కాస్మోటిక్ చార్జీల కింద రూ.65, బాలురకు రూ.57 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. రికార్డుల్లో నమోదు చేసిన వారందరికీ నెలవారీ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సదుపాయాలు సమకూరుతాయి. అయితే రికార్డులో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య, హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య భారీగా వ్యత్యాసం ఉంటున్నట్లు తెలిసింది. విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపించి ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలను వార్డెన్లు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. వీటిని ఆసరాగా చేసుకున్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు మంత్రి పర్యటన పేరుతో వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు సమాచారం. వసూల్‌రాజాల బాగోతం.. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరిన నేపథ్యంలో ఆయా హాస్టళ్లకు చెందిన వార్డెన్లకు బిల్లులు ట్రెజరీల ద్వారా బిల్లులు మంజూరవుతున్నాయి. ఇదేఅదనుగా భావించిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు ఒక్కొక్క విద్యార్థిపై రూ.25 చొప్పున స్కాలర్షిప్ వచ్చినంతకాలం ప్రతి నెలా చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక దిక్కు తోచని స్థితిలో వార్డెన్లు కూడా అధికారులకు మామూళ్ళు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారని సమాచారం. ఈ లెక్కన మంత్రి పేరు చెప్పి వసూలుచేస్తున్న పైకం రూ 12 లక్షలకు పైగా ఉంటుందని అధికారులే అంటున్నారు. అటువంటిదేమీ లేదు.. ఆయా ఆరోపణలపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి వి.నారాయణుడును వివరణ కోరగా అలాంటిది ఏమీలేదని అన్నారు. తనకు ఆ అవసరం లేదని చెప్పారు. కొంతమంది తనపై కావాలని ఆవిధంగా చెబుతున్నారని వివరించారు. అక్రమార్కులపై చర్యలేవీ? ఇటీవల గిరిజన హాస్టళ్లలో విధులు నిర్వహించే గ్రేడ్-2 వార్డెన్లకు గ్రేడ్-1 వార్డెన్లుగా నలుగురికి పదోన్నతులు కల్పించారు. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. ప్రమోషన్లు పొందినవారి నుంచి రూ. లక్షల్లో వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈపూరులోని హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను ఎలుకలు కొరికిన సంఘటన, రేపల్లె వార్డెన్ విధులకు హాజరుకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక లక్షల్లో నగదు చేతులు మారినట్లు కార్యాలయ అధికారులే చర్చించుకోవడం గమనార్హం. -
మెనూ చార్ట్ ఇదే...అమలు పరచండి
* 2015-16కు సంబంధించి పాటించాలని జిల్లాల్లోని హాస్టళ్లకు ఆదేశం * మెనూ చార్ట్‌ను సమీక్షించాలని కలెక్టర్లకు సూచన సాక్షి,హైదరాబాద్ : వెనుకబడిన తరగతులకు చెందిన ప్రీ -మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి (2015-16) సంబంధించి అమలుచేయాల్సిన మెనూచార్ట్‌ను ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ మేరకు సోమవారం నుంచి ఆదివారం వరకు వివిధ సమయాల్లో హాస్టళ్లలో అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆయా ఆహారపదారా్థుల గురించి అందులో వివరించారు. ఈ మెనూను అమలుచేయాలని అన్ని జిల్లాలకు ఆ చార్ట్‌ను బీసీసంక్షేమశాఖ పంపించింది. దీన్ని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు జిల్లా బీసీ సంక్షేమాధికారులతో సమీక్షించి, ఆయా జిల్లాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చునని సూచించింది. కొత్త విధానం ప్రకారం ప్రీమెట్రిక్ హాస్టళ్లకు సంబంధించి రోజుకు ఒక్కో విద్యార్థికి బియ్యం 400 గ్రాముల చొప్పున, పామాయిల్,పప్పులు,ఉప్పు, చింతపండు, కోడిగుడ్లు,పండ్లు,స్వీట్లు ఇతరాలు కలుపుకుని రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.27 వరకు ఖర్చు అవుతుందని లెక్క కట్టారు. పెద్దక్లాసుల విద్యార్థులకు నెలకు రూ. 850 వంతున, చిన్నక్లాసుల విద్యార్థులకు నెలకు రూ.750 వంతున కలుపుకుని సరాసరి రూ.810 వరకు అంచనావేశారు. ఇక పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ.35 చొప్పున ఖర్చు అవుతుందని, ఈ విధంగా ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,050 చొప్పున వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఇలా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రీ మెట్రిక్ హాస్టళ్లలోని విద్యార్థులకు సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6.30 గంటలకు రాగిమాల్ట్ (పాలతో), అల్పాహారంగా ఒక్కోరోజు ఉప్మా,కిచిడీ, పులిహోర, ఇడ్లీని ఏదైనా ఒక పండుతో పాటు ఇవ్వాలి. స్కూళ్లలోనే మధ్యాహ్నభోజనం అందుబాటులో ఉన్నందున ఆదివారం మాత్రం హాస్టళ్లలో రైతాతో పాటు ఎగ్ బిరియానీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హాస్టల్లోనే మధ్యాహ్నభోజనం అమలు చేయాలి. సాయంత్రం పల్లీ లడ్డు, శెనగగుగ్గిళ్లు, బిస్కెట్లు, 30 గ్రాముల బొబ్బర్లు, ఉలవలు పెట్టాలి. రాత్రి అన్నం,సాంబారు, ఒకకూర,పెరుగుతో పాటు శనివారం మినహా అన్ని రోజులు కోడిగుడ్డు పెట్టాలి. పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో .. అన్ని జిల్లాల్లోని పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6.30 గంటలకు తేనీరు, టిఫిన్‌గా ఉప్మా చెట్నీ,కిచిడి చెట్నీ, పులిహోర, టమా ట రైస్, పులగం వంటివి ఇవ్వాలి. మధ్యాహ్నభోజనం కింద అన్నం,సాంబారు, ఆకుకూరలు, ఆదివారాలు పెరుగుపచ్చడితో పా టు ఎగ్ బిరియానీ పెట్టాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హాస్టల్లోనే మధ్యాహ్నభోజనం పెట్టాలి. రాత్రి భోజనంలో సోమవారం నుంచి ఆదివారం వరకు అన్నం, ఆకుకూర, రసం,పెరుగు, ఆదివా రం మినహా కోడిగుడ్డు పెట్టాల్సి ఉంటుంది.