Post office savings schemes
-
కేంద్రం కొత్త నిబంధనలు.. మీకు ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం ఉందా?
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీంతో కేంద్రం తెచ్చిన నిర్ణయాలు అమలు కానున్నాయి. ఇప్పటికే ఆధార్ - పాన్ లింక్ గడువును కేంద్రం పెంచింది. అయితే తాజాగా ఆధార్ - పాన్ విషయంలో మరో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్ వంటి చిన్న పొదుపు పథకాల్లో (small saving schemes) పాన్‌కార్డ్, ఆధార్ కార్డులను తప్పని సరిచేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 31,2023న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో స్మాల్ సేవింగ్స్ స్కీంలో పెట్టుబడులు పెట్టేందుకు కేవైసీ తప్పని సరి చేసింది. దీంతో పాటు నిర్దిష్ట థ్రెషోల్డ్ కంటే ఎక్కువ పెట్టుబడిపై పాన్ కార్డును అందించాలని సూచించింది. చిన్న పొదుపు పథకాల్లో కొత్త నిబంధనలు కేంద్ర ఆర్ధిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. చిన్న పొదుపు పథకాల్లోని చందాదారులు సెప్టెంబర్ 30,2023లోగా ఆధార్ నెంబర్ ను జతచేయాలని తెలిపింది. కొత్తగా పథకాల్లో చేరిన చందాదారులు 6 నెలల్లోగా ఆధార్‌ను లింక్ చేయాలని సూచించింది. ఒక వేళ స్మాల్ సేవింగ్స్ స్కీంలో కొత్తగా చేరిన వారి 6 నెలల్లోగా ఆధార్‌ను అందించాలని లేదంటే అక్టోబర్ 1, 2013 నుంచి సదరు అకౌంట్లు పనిచేయడం ఆగిపోతాయని వెల్లడించింది. పాన్ కార్డ్సైతం చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు తెరిచే సమయంలో పాన్‌కార్డ్‌ని సమర్పించాలి. ఆ సమయంలో సాధ్యం కాకపోతే రెండు నెలల్లో పాన్ కార్డ్‌ను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి. ఇక ఆ అకౌంట్లలో రూ.50 వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఒక ఖాతాలో అన్ని క్రెడిట్స్ రూ.లక్ష దాటినప్పుడు, ఒక నెలలో ఖాతా ట్రాన్సాక్షన్ల లావాదేవీలు రూ.10 వేలు దాటితే.. పాన్‌ను సమర్పించాలి. లేదంటే పాన్ అప్డేట్ చేసే వరకు సదరు ఖాతాలు స్తంభించిపోనున్నాయి. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్ - ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్! -
ఎన్ఎస్సీ, పీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్లలో వడ్డీరేట్లు.. పన్ను రాయితీలు ఇలా
ట్యాక్స్ ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ వారం మరికొన్నింటి గురించి తెలుసుకుందాం. ప్రతి ఉద్యోగికి పి.పి.ఎఫ్. తప్పనిసరే. యజమాని తప్పనిసరిగా పీఎఫ్ రికవరీ చేసి, తాను మరికొంత చేర్చి, భవిష్య నిధికి జమ చేస్తారు. ఇది కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ.1,50,000 ఉంటుంది. కాస్త ఎక్కువ జీతం ఉన్న వారికి పీఎఫ్ మొత్తం రూ. 1,50,000 దాటిపోతుంది. వీరికి 80సి కింద సేవింగ్స్ చేసినా ఎటువంటి మినహాయింపు ఉండదు. ఇతర అంశాల జోలికి పోవడంవల్ల ఉపయోగం ఉండదు. తక్కువ రికవరీ ఉన్నవారు అవసరం అయితే పెంచుకోవచ్చు. వడ్డీ 8.5 శాతం వస్తుంది. వడ్డీ మీద ఎటువంటి పన్ను భారం లేదు. 15 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 3 సదుపాయాలు ఉంటాయి. దీన్ని E,E.E. అంటారు. ఇన్వెస్ట్ చేసినందుకు మినహాయింపు, వడ్డీకి మినహాయింపు, విత్‌డ్రా చేసుకున్నప్పుడు వచ్చే మొత్తానికి కూడా మినహాయింపు లభిస్తుంది. అంటే పన్నుభారం లేదు. దాచిన మొత్తాన్ని ఏడాదికి ఒకసారి విత్‌డ్రా చేసుకోవచ్చు (5వ సంవత్సరం తర్వాత నుండి). కోర్టుద్వారా ఎటువంటి అటాచ్మెంట్ చేయరు. రుణం తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. జాయింట్‌గా తీసుకోవడానికి వీలుండదు. ఎన్నారైలకు వర్తిం చదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆలోచించుకోండి. ఉన్నవాటిలో ఇది అత్యుత్తమమైనది. కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ఇక ఎన్ఎస్సీలు.. అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు. ఒకప్పుడు ఆరు సంవత్సరాల్లో రెట్టింపై ఎంతో లాభసాటిగా ఉండేవి. క్రమేపీ వడ్డీ రేటును తగ్గించేశారు. ఇప్పుడు 6.8 శాతం వస్తుంది. ఇక్కడ E.E.E నియమం వర్తిస్తుంది. కనీసం రూ. 1,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. వడ్డీని అసలుకు కలుపుతారు. 80సి కింద దక్కే ప్రయోజనం పరిమితి రూ. 1,50,000. కొన్ని సందర్భాల్లో ముందుగానే నగదుగా మార్చుకోవచ్చు. ఏడాదిలోపే తీసేసుకుంటే వడ్డీ ఇవ్వరు. మొదటి సంవత్సరం దాటి 3 సంవత్సరాల లోపల అయితే సాధారణ వడ్డీ ఇస్తారు. నామినేషన్ సదుపాయం ఉంది. మరోవైపు, పోస్టాఫీస్‌లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంటులో జమకి 80సి మినహాయింపు లేదు. ఏటా 4 శాతం వడ్డీ ఉంటుంది. కనీసం రూ. 50 నుంచి గరిష్టంగా ఎంతైనా ఉంచవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా కొనసాగించవచ్చు. జాయింటుగా చేరవచ్చు. సింగిల్‌లో రూ. 3,500, జాయింటులో రూ. 7,000 వడ్డీకి మినహాయింపు ఉంటుంది. కానీ 80 టీటీఏ కింద రూ. 10,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు 80 టీటీబీ కింద రూ.50,000 వరకూ మినహాయింపు ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఒక స్కీమ్ ఉంది. వడ్డీ 7.4 శాతం లభిస్తుంది. కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 15,00,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. 5 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. వడ్డీకి మినహాయింపు ఉంటుంది. వడ్డీ రూ. 50,000 దాటితే టీడీఎస్ ఉంటుంది. దీనికి 80సి వర్తిస్తుంది.60 సంవత్సరాల వారికే ఇది వర్తిస్తుంది. 55 సంవత్సరాలు దాటిన వారు రిటైర్ అయిపోతే ఇందులో చేరవచ్చు (కొన్ని షరతులకు లోబడి). జాయింటు అకౌంటు తెరిచేందుకు వీలుంటుంది. ఇలా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
బ్యాంకింగ్ వ్యవస్థలో చేరిపోనున్న పోస్టాఫీసులు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు లావాదేవీలకు దూరంగా ఉంటూ... పోస్టాఫీసునే బ్యాంకుగా భావించే కోట్ల మందికి ఇది నిజ్జంగా శుభవార్తే. ఎందుకంటే కొన్నేళ్లుగా ‘పోస్టల్ బ్యాంక్’ మాట వినిపిస్తున్నా బ్యాంకుకు ఉండాల్సిన చాలా లక్షణాలు పోస్టాఫీసులకింకా రాలేదు. ఇదిగో... వీటన్నిటినీ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొస్తామని నిర్మల హామీనిచ్చారు. అంటే పోస్టాఫీసు ఖాతాదారులంతా ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో డిపాజిట్లు చేయొచ్చు. వేరే ఖాతాలకు నగదు బదిలీ చేయొచ్చు. ఆర్డీ, ఎఫ్డీ సహా బ్యాంకుల నుంచి పొందే ఆన్లైన్ సేవలన్నీ పొందొచ్చు. కాలం చెల్లిన సేవలకు క్రమంగా స్వస్తి చెబుతూ...ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొని వినూత్న ఆలోచనలు, సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. తాజాగా కేంద్ర బడ్జెట్– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. ఇప్పటికే ఐపీపీ బ్యాంక్ పోస్టాఫీసుల ద్వారా మూడు రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాల సేవలు అందిస్తోంది. చదవండి: బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండానే పీఎం కిసాన్, రైతుబంధు డబ్బులు -
లాక్డౌన్.. స్ఫూర్తిని వీడని పోస్టల్ శాఖ
న్యూఢిల్లీ : ఓవైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా భారత తపాలా శాఖ పూర్తి స్థాయిలో సేవలను అందిస్తోంది. క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తూ స్ఫూర్తి కొనసాగిస్తుంది. ప్రస్తుత తరుణంలో తపాలా సేవలు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రజలకు ఇంటి వద్దే బ్యాంక్‌లో ఉన్న డబ్బును ఉపసంహరించుకునే సౌలభ్యం, గ్రామీణ డాక్ సేవలతో సహా వివిధ విధులను పోస్టల్ ఉద్యోగులు నిర్వర్తిస్తున్నారు. వీటికి తోడు అవసరమైన చోట్ల మెడిసిన్, ఆహార పొట్లాలు, అవసరమైన సరుకులు కూడా సరఫరా చేస్తున్నారు. కష్టకాలంలో పేదలకు చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అందజేసిన సబ్సిడీలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మరోవైపు కరోనా వేళ సేవలు అందిస్తున్న తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధులను నిర్వహిస్తున్న ఉద్యోగులు ఈ వైరస్ బారిన పడి మరణిస్తే రూ.పది లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్లో ఏప్రిల్ 25వరకు పోస్టల్ శాఖ అందజేసిన సేవలు.. రూ. 452 కోట్లు విలువచేసే 23 లక్షలకు పైగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలు రూ. 700 కోట్లు విలువచేసే 74.6 లక్షల డీబీటీ(ప్రత్యక్ష నగదు బదిలీ) పేమెంట్స్ అందజేత రూ. 33,000 కోట్లు విలువచేసే 2.3 కోట్ల పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ లావాదేవీలు, రూ. 2,600 కోట్లు విలువచేసే ఒక కోటి ఐపీపీబీ(ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) లావాదేవీలు 42.5 లక్షల లేఖలు, రూ. 355 కోట్లు విలువచేసే 31.5 లక్షల మనీ ఆర్డర్స్ వినియోగదారులకు అందజేత -
ఎనిమిదో వింత... ఎంత?
నిధి కావాలా? చిన్న వయసు నుంచే మొదలెడితే చక్రవడ్డీతో ఎంతో లాభం అతితక్కువ మొత్తంతో భారీ రిటైర్మెంట్ నిధి అప్పుడే ఉద్యోగులైన యువతకూ ఇదో చక్కని దారి 25వ ఏడాది 32వ 39వ 46వ 53వ 60వ 1,00,000 2,00,000 4,00,000 8,00,000 16,00,000 32,00,000 ఓ చిన్న కథ. దాన్లో ఓ మహారాజు. ముందూవెనకా చూడకుండా వరాలిస్తుంటాడు. తనను చదరంగంలో ఓడించిన మంత్రిని ఏం కావాలో కోరుకోమన్నాడు. తగిన పాఠం నేర్పాలనుకున్నాడు మంత్రి. ‘‘మహారాజా! చదరంగంలో 64 గడులున్నాయి కదా!!. మొదటి గడిలో రూపాయి పెట్టండి. రెండో గడిలో రెండ్రూపాయలు. మూడో గడిలో 4. అలా... రెట్టిస్తూ వెళ్లండి. అది చాలు’’ అన్నాడు మంత్రి. ‘మరీ ఇంత చిన్న కోరికా?’ అనుకున్నాడు మహారాజు. కోశాధికారిని పిలిచి గడుల్లో డబ్బు పెట్టమన్నాడు. ఇంతలో మంత్రి మరో డిస్కౌంటిచ్చాడు. ‘‘రాజా! నాకు 64వ గడిలోని మొత్తం మాత్రం చాలు. మిగిలింది అక్కర్లేదు’’ అన్నాడు. రాజు నవ్వాడు. కాసేపటికే కోశాధికారి ఆందోళనగా వచ్చాడు. ఏమైందన్నాడు రాజు. రాజా! మంత్రిగారి కోరిక తీర్చటం అసాధ్యం. ఎందుకంటే 64వ గడిలో 92వేల కోట్ల కోట్లు పెట్టాలి. మన రాజ్యం మొత్తమ్మీద అంత డబ్బులేదు’’ అన్నాడు కోశాధికారి. షాకైన రాజు.. అదెలా సాధ్యమన్నాడు. అదే చక్రవడ్డీ మహత్యమంటూ నవ్వాడు మంత్రి. మన చక్రవడ్డీయే ఇంగ్లీషులో కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్మెంట్ గురుగా పేర్కొనే వారెన్ బఫెట్ దీన్ని ‘‘ప్రపంచ వింతల్లో ఎనిమిదోది’’ అని వర్ణించారంటే దీని సత్తా తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. మరీ మంత్రి చెప్పినంత మొత్తం కాకపోయినా... ప్రణాళికతో ముందుకెళితే మనమూ మన పొదుపుపై చక్రవడ్డీ లాభాలు అందుకోవచ్చు. అతితక్కువ మొత్తంతో భారీ నిధిని సమీకరించుకోవచ్చు కూడా. అదెలా చేయవచ్చో చెప్పేదే ఈ కథనం. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి వదిలేసినా... ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే... పోస్టాఫీసు పొదుపు పథకాల్లో గానీ, ఇతర డిపాజిట్ పథకాల్లో గానీ సొమ్మును మదుపు చేస్తే ఇంచుమించు ఏడేళ్లలో అది రెట్టింపవుతోంది. రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లుగా పరిగణనలోకి తీసుకుంటే... పిల్లల పేరిట వారి తొలి ఏడాది నుంచీ పొదుపు మొదలుపెడితే 60 ఏళ్ల లోపు దాదాపు 9 సార్లు ఆ మొత్తం రెట్టింపవుతుంది. (అదెలాగన్నది పై గ్రాఫిక్‌లో చూడొచ్చు...) అంటే పుట్టిన బిడ్డ పేరిట తొలి ఏడాదిలో వెయ్యి రూపాయలు పొదుపు చేసి వదిలేస్తే... ఆ బిడ్డకు 56 ఏళ్ల వయసొచ్చేసరికి అది ఏకంగా రూ.2,56,000 అవుతుంది!!. అదీ చక్రవడ్డీ మహిమ. ఒకవేళ అదే బిడ్డ పేరిట ఏడాదికి రూ.1000 చొప్పున తొలి పదేళ్లూ ఇలాంటి పోస్టాఫీస్ సర్టిఫికెట్లలో ఇన్వెస్ట్ చేసి... రెట్టింపయ్యాక తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకోండి. ఆ 10వేలకు గాను తనకు 65 ఏళ్లు వచ్చేసరికి చేతికొచ్చేదెంతో తెలుసా? సాక్షాత్తూ రూ.25,60,000. పాతిక లక్షలంటే దాదాపు రిటైర్మెంట్ నిధి ఏర్పడినట్లే కదా? ఉద్యోగులకూ భవిష్య నిధి... మేం పుట్టగానే మా పేరిట తల్లిదండ్రులు కదా పొదుపు చేయాల్సింది! వాళ్లు చేయకపోతే మేమేం చెయ్యాలి? అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పొదుపుపై అవగాహన లేకపోవటమో, ధీమా వల్లనో, చిన్న వయసు నుంచే పొదుపు మొదలుపెడితే వచ్చే లాభాలు తెలియకపోవటం వల్లో చాలామంది ఇలాంటి పథకాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఉద్యోగం సంపాదించుకున్న వెంటనే యువత కూడా ఇలాంటి పథకాలవైపు చూడొచ్చు. ఎందుకంటే 25 ఏళ్ల వయసులో పొదుపు మొదలెట్టినా 60 ఏళ్లు వచ్చేసరికి దాదాపు 5 సార్లు రెట్టింపయ్యే అవకాశం వస్తుంది. పెపైచ్చు ఉద్యోగం వచ్చాక అంటే... వారిలో పొదుపు చేయగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆరంభం నుంచే కాస్త ఎక్కువ మొత్తాన్ని చేయొచ్చు. అదెలాగన్నది కింది పట్టికలో వివరంగా చూడొచ్చు. ఈ లెక్కన చూస్తే... 25వ సంవత్సరంలో లక్ష రూపాయలు పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి అది రూ.32 లక్షలవుతోంది. అంటే 25 ఏళ్ల వ్యక్తి వరసగా ఐదేళ్లపాటు రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ సమయానికి దాదాపు కోటిన్నర నిధి సమకూరుతుందన్న మాట. ఒకవేళ క్రమం తప్పకుండా నెలకు రూ.వెయ్యి చొప్పునో, ఏడాదికి రూ.10వేల చొప్పునో చివరిదాకా ఇన్వెస్ట్ చేస్తే...? వారికి నిజంగానే నిధి దొరుకుతుంది. చక్రవడ్డీ ఇచ్చే నిధి.