Postal Life Insurance
-
ప్రత్యేక సంస్థగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్?
కోల్‌కతా: భారతీయ తపాలా శాఖ తన బీమా వ్యాపార విభాగం ‘పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్’ను (పీఎల్ఐ) ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ గౌతమ్ భట్టాచార్య గురువారం కోల్‌కతాలో మీడియాకు చెప్పారు. పీఎల్ఐ పథకాలు గతంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకే పరిమితం కాగా, ఇప్పుడు లిస్టెడ్ కార్పొరేట్ సంస్థలు, వృత్తి నిపుణులు సైతం వీటిని తీసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. పీఎల్ఐ మార్కెట్ వాటా 3 శాతంగా ఉండగా, పాలసీదారులకు బోనస్ మాత్రం ఇతర బీమా సంస్థలతో పోలిస్తే అధికంగా ఇస్తోంది. కమీషన్ చెల్లింపులు తక్కువగా ఉండడంతోపాటు నిర్వహణ వ్యయాలు కూడా తక్కువగా ఉండడమే అధిక బోనస్ చెల్లింపులకు కారణమని భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతం తపాలా శాఖ ఆదాయంలో 60 శాతం సేవింగ్స్ పథకాల ద్వారానే వస్తోందని, పార్సెల్ మెయిల్స్ నుంచి వచ్చే ఆదాయన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టామని చెప్పారు. -
ప్రత్యేక కంపెనీగా పోస్టల్ ఇన్సూరెన్స్: సిన్హా
న్యూఢిల్లీ: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని పోస్టల్ శాఖ భావిస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలను ఒక ప్రత్యేక వ్యాపార విభాగంగా (సెపరేట్ బిజినెస్ యూనిట్) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు కేబినెట్ నోట్‌ను పంపామని సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. రెండు వారాల్లో ఈ నోట్‌ను కేబినెట్ ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు. మొదటి దశలో ఎస్‌బీయూను, రెండో దశలో పూర్తి స్థాయి బీమా కంపెనీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)రెండో వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఇటీవల ఐపీపీబీ 1.26 లక్షల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేసిందని, 10 రోజుల్లో మరో పదివేల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నదని వివరించారు. బజాజ్ ఆటో లాభం 20% అప్ న్యూఢిల్లీ: అమ్మకాల్లో వృద్ధితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బజాజ్ ఆటో నికర లాభం 20 శాతం పెరిగి రూ. 1,221 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సంస్థ నికర లాభం రూ. 1,014 కోట్లు. ఇక తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 19% వృద్ధి చెంది రూ. 6,595 కోట్ల నుంచి రూ. 7,879 కోట్లకు చేరింది. వాహన విక్రయాలు 26 శాతం వృద్ధితో 10.01 లక్షల నుంచి 12.60 లక్షల యూనిట్లకు చేరాయి. దేశీయంగా మోటార్ సైకిల్స్ అమ్మకాలు 4,66,431 నుంచి 6,44,093 యూనిట్లకు పెరిగాయి. బుధవారం బజాజ్ ఆటో షేరు బీఎస్ఈలో 2.65 శాతం క్షీణించి రూ. 2,499 వద్ద క్లోజయ్యింది. -
పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ పాలసీ చెల్లింపుల్లో మార్పులు
♦ హోల్ లైఫ్ పాలసీని సవరించిన కేంద్రం ♦ 80 ఏళ్లు దాటిన తర్వాత మెచ్యూరిటీ నగదుతో కలిపి బోనస్ సాక్షి, విజయవాడ బ్యూరో : పోస్టాఫీసుల్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు (పీఎల్ఐ), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు (ఆర్పీఎల్ఐ) కింద హోల్‌లైఫ్ పాలసీలు కలిగిన వారికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇప్పటి వరకూ హోల్ లైఫ్ పాలసీ చేసిన వ్యక్తి మరణానంతరం వారి వారసులకు పాలసీ మొత్తం, బోనస్ లభించేవి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని సవరించింది. ఈ పాలసీ కలిగిన వ్యక్తి 80 ఏళ్ల వరకూ జీవించి ఉంటే మెచ్యూరిటీ మొత్తంతో పాటు బోనస్ కూడా అందించనుంది. దీనివల్ల జీవించి ఉన్నపుడే పాలసీదారుడు పాలసీ ఫలాలను అనుభవించే వీలుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సులో హోల్ లైఫ్ ఎస్యూరెన్సు కింద లక్ష రూపాయలకు పాలసీ చేస్తే 60 ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లిస్తారు. అంటే 35 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లింపులు జరుగుతాయి. ఆ తరువాత మెచ్యూరిటీ మొత్తంతో పాటు బోనస్‌ను కలిపి వారసులకు అందజేస్తారు. ఈ లెక్కన వీరికి 35 ఏళ్లకు లెక్కించి బోనస్ చెల్లింపులు జరిగేవి. అయితే సవరణ అమల్లోకి వచ్చిన దరిమిలా 80 ఏళ్ల వరకూ జీవించిన పాలసీదారులకు 55 ఏళ్లకు బోనస్ లెక్కించి అందజేస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 7.30 లక్షల మంది హోల్‌లైఫ్ పాలసీలు కలిగి ఉన్నారు. ఇందులో 12%మంది 80 ఏళ్లు పైబడిన వారున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరూ తమ పాలసీలకు సంబంధించిన ఫలాలను అందుకునేందుకు దగ్గర్లో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలని ఆంధ్రా, తెలంగాణ సర్కిళ్ల చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ వైపీ రాయ్ బుధవారం నాడొక ప్రకటనలో కోరారు. -
బీమా ప్రీమియంచెల్లింపులకు తపాలా శాఖ కొత్త సాఫ్ట్వేర్...
సాక్షి, విజయవాడ బ్యూరో: తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియంలను ఆన్లైన్లో చెల్లించే విధంగా తపాలా శాఖ మెకానిష్ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిం చింది. దశల వారీగా దీన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. కాగా పాలసీదారులు తమకు దగ్గరలో ఉన్న తపాలా శాఖ ప్రధాన కార్యాలయాలకు వెళ్లి ప్రీమియం పాస్ పుస్తకాలనుగానీ, వాటి నకలు కాపీలను గానీ అందజేసి ప్రీమియం చెల్లింపులను క్రమబద్ధీకరించుకోవాలనీ, ఈ నెల 15 లోగా ఈ చెల్లింపులను పూర్తి చేసుకోవాలని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల తపాలా శాఖ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
తపాలా బీమా ప్రీమియం ఆన్‌లైన్‌లోనూ చెల్లించొచ్చు
విజయవాడ: తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియాలను ఆన్లైన్లో చెల్లించే విధంగా తపాలా శాఖ మెకానిష్ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దశల వారీగా దీన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. పాలసీదారులు తమకు దగ్గరలో ఉన్న తపాలా శాఖ ప్రధాన కార్యాలయాలకు వెళ్లి ప్రీమియం పాస్ పుస్తకాలనుగానీ, వాటి నకలు కాపీలను గానీ అందజేసి ప్రీమియం చెల్లింపులను క్రమబద్ధీకరించుకోవాలనీ, ఈ నెల 15 లోగా ఈ చెల్లింపులను పూర్తి చేసుకోవాలని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల తపాలా శాఖ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం బుధవారం నాడొక ప్రకటనలో పేర్కొంది. -
సేవలకు తలుపులు తెరిచిన తపాలా
తపాలా శాఖ తన సేవలను విస్తృతం చేసింది. కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడానే కాకుండా బహుముఖాలుగా సేవలందిస్తోంది. జిల్లా పరిధిలో రెండు పోస్టల్ డివిజన్లలో 927 పోస్టాఫీసులున్నాయి. ఒంగోలు పోస్టల్ డివిజన్ పరిధిలో నాలుగు హెడ్పోస్టాఫీసులతో పాటు 94 సబ్‌పోస్టాఫీసులు, 565 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నాయి. మార్కాపురం హెడ్ పోస్టాఫీసు పరిధిలో 29 సబ్‌పోస్టాఫీసులు, 234 బ్రాంచ్ పోస్టాఫీసులున్నాయి. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈ సౌకర్యం ద్వారా 24 గంటల్లో డబ్బులు వేరే ప్రాంతంలో ఉండేవారికి అందజేయవచ్చు. మొదటగా పోస్టాఫీసులో వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే సంబంధిత అధికారి ఏ ప్రాంతానికైతే మనీ ఆర్డర్ బుక్ అయిందో ఆయా ప్రాంత కార్యాలయ అధికారికి మెసేజ్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసి డబ్బులు అందేటట్టు చూస్తారు. కొంచెం సుదూర ప్రాంతం, ఇతర సమస్యలు వస్తే మాత్రం 48 గంటల సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మనీఆర్డర్‌ను వినియోగదారునికి అందజేస్తారు. ఆశీర్వచనం ఆశీర్వచనం పథకం ప్రశంసలు అందుకుంటోంది. పోస్టల్‌శాఖలో వినూత్న పథకంగా కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంతన ఉన్న అక్షింతలను కేవలం రూ.5 ఆర్డర్ ద్వారా పొందవచ్చు. అక్షింతలతోపాటు స్వామివారి ఫోటో కూడా అందుతుంది. తిరుపతి వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఈ పథకం ఓ వరంగా చెప్పవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ పోస్టల్ ఖాతాలో బ్యాంకుల్లో ఉన్న జమ, విత్‌డ్రా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏటీఎం సౌకర్యం సైతం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకు మాదిరిగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సేవింగ్స్ బ్యాంక్‌లో అయితే వయోవృద్ధులకు బ్యాంకులాగానే 9 శాతం వడ్డీని పోస్టల్‌శాఖ చెల్లిస్తుంది. కొన్ని రోజుల్లో పోస్టల్ బ్యాంక్‌లు కూడా వస్తాయని పోస్టల్ అధికారులంటున్నారు. మై స్టాంప్ స్టాంప్ అనగానే అదొక మంచి గుర్తింపు ముద్ర అని అందరికీ తెల్సిన విషయం. గతంలో లాల్‌బహుదూర్‌శాస్త్రి, సర్దార్ వల్లభాయ్‌పటేల్ వంటి ప్రముఖుల ఫొటోలు, చారిత్రక ప్రదేశాల ఫొటోలు స్టాంపులుగా పోస్టల్ శాఖ అందించింది. అయితే ఈ మధ్య కాలంలో మైస్టాంప్ పేరుతో కొత్త సౌకర్యం అందుబాటు లోకి వచ్చింది. దీనిద్వారా ఎవరి ఫొటో వారు స్టాంపుగా తయారు చేయించుకోవచ్చు. దీనికి కేవలం రూ.300 సొమ్ము పోస్టల్‌శాఖకు చెల్లిస్తే సరిపోతుంది. రూ.240 పోస్టల్‌శాఖ ఖాతాకు జమకాగా, రూ.5 విలువగల 12 స్టాంపులను వినియోగదారునికి అందజేస్తారు. ఈ స్టాంపులు దూరప్రాంతాలకు పంపే కవరులపై అంటించినా చెల్లుబాటు అవుతాయి. మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వారికైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం లభిస్తుంది. ముందుగా పోస్టల్ కార్యాలయంలో డబ్బు జమ చేయగానే, మనీ అందుకోవాల్సిన సంబంధిత చిరునామా గల వ్యక్తి మొబైల్‌కు ఓ కోడ్ నంబర్ ఆన్లైన్ ద్వారా మెసేజ్‌గా వెళ్తుంది. అనంతరం ఆ కోడ్ నంబర్‌గల మొబైల్‌ను డబ్బులు అందుకోవాల్సిన వ్యక్తి పోస్టల్ కార్యాలయంలో చూపిస్తే వెను వెంటనే బల్క్ మొత్తం డబ్బులు అయినా ఒక ఐడీ ఫ్రూఫ్‌ను తీసుకుని పోస్టల్ సిబ్బంది అందజేస్తారు. త్వరలో మరికొన్ని.. పోస్టల్‌శాఖలో మరికొన్ని సేవలు వస్తాయని తెలుస్తోంది. కూరగాయలను వేరే ప్రాంతాలకు చేరవేయడం, పోస్టల్ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చి అన్ని ప్రాంతాలకు విస్తరించడం వంటి సౌకర్యాలు వస్తాయి. వీటితోపాటు మరికొన్ని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సౌకర్యాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ దీని ప్రత్యేకత. పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా, పట్టణంలోని ఇతరులందరికి ఎంప్లాయిస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ తపాలా బీమా ఉపయోగపడుతుంది. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం ఏ జిల్లాల్లో అయితే రైల్వే రిజర్వేషన్ కార్యాలయం లేదో, ఆ ప్రాంతంలోని పోస్టాఫీసులో ఈ సౌకర్యం లభిస్తుంది. లాజిస్టిక్ పోస్టు ఈ లాజిస్టిక్ పోస్టు సౌకర్యంలో మరికొన్ని సేవలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వస్తువులను వేరే ప్రాంతాలకు పంపించుకోవచ్చు. నగరంలో నివసించే వారు అయితే హౌస్షిప్టింగ్కు కూడా వినియోగింపవచ్చు.ఇల్లు మార్పిడికి ఇక వేలకువేలు చెల్లించే అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు మారిపోవచ్చు. ఈ సౌకర్యం బాగుందని తపాలా శాఖ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధమైన హౌస్ షిప్టింగ్ సౌకర్యం ఉందని కొందరికి మాత్రమే తెలుసునని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు. -
సేవలకు తలుపులు తెరిచిన తపాలా
బహుముఖ సేవలందిస్తున్న తపాలా శాఖ * బ్యాంకింగ్, బీమా, హౌస్ * షిఫ్టింగ్, మైస్టాంప్ సేవలు * ప్రశంసిస్తున్న వినియోగదారులు నల్లగొండ అర్బన్ : పోస్టాఫీసులంటే ఒకప్పుడు ఉత్తరాల బట్వాడాకే పరిమితం. మరిప్పుడు... బ్యాంకుల్లోలా డబ్బులు వెయ్యచ్చు..తీయవచ్చు. వేరే ఊరికి డబ్బులు పంపొచ్చు. ఏటీఎం సేవలూ లభ్యం. తపాలా సేవలతో అతితక్కువ ఖర్చుతో ఇల్లు మారవచ్చు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం, బీమా సేవలు... వీటితో పాటు మీకో చక్కటి వరం తిరుపతి వెంకన్న స్వామి అక్షింతలతో ‘ఆశీర్వచనం’ సేవలు. ‘మై స్టాంప్’ సేవల కింద మీ ఫొటోలతోనే స్టాంపులు మీకు లభ్యం. నిన్నమొన్నటి వరకు కొన్ని రకాల సేవలకే పరిమితమైన తపాలా శాఖ ప్రస్తుతం తలుపులు బార్లా తెరిచి బహుముఖాలుగా తన సేవలను విస్తరించింది. జిల్లాలో 4 హెడ్‌పోస్టాఫీసులున్నాయి. ఇవి నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేటలలో సేవలందిస్తున్నాయి. మండల కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో 37 సబ్పోస్టాఫీసులుండగా 349 బ్రాంచ్ పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. ఇవేకాకుండా ప్రభుత్వ పింఛన్ల పంపిణీ, ఉపాధిహామీ కూలీల భృతి చెల్లించేందుకు 269 గ్రామాల్లో ఏజెన్సీల ద్వారా పోస్టల్ సేవలందుతున్నాయి. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈ సౌకర్యం ద్వారా 24 గంటల్లో డబ్బులు వేరే ప్రాంతంలో ఉండేవారికి అందజేయవచ్చు. మొదటగా పోస్టాఫీసులో వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే సంబంధిత అధికారి ఏ ప్రాంతానికైతే మనీ ఆర్డర్ బుక్ అయిందో ఆయా ప్రాంత కార్యాలయ అధికారికి మెసేజ్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసి డబ్బులు అందేటట్టు చూస్తారు. కొంచెం సుదూర ప్రాంతం, ఇతర సమస్యలు వస్తే మాత్రం 48 గంటల సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మనీఆర్డర్‌ను వినియోగదారునికి అందజేస్తారు. ఆశీర్వచనం ఆశీర్వచనం పథకం ప్రశంసలు అందుకుంటోంది. పోస్టల్‌శాఖలో వినూత్న పథకంగా కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంతన ఉన్న అక్షింతలను కేవలం రూ.5 ఆర్డర్ ద్వారా పొందవచ్చు. అక్షింతలతోపాటు స్వామివారి ఫోటో కూడా అందుతుంది. తిరుపతి వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఈ పథకం ఓ వరంగా చెప్పవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ పోస్టల్ ఖాతాలో బ్యాంకుల్లో ఉన్న జమ, విత్‌డ్రా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏటీఎం సౌకర్యం సైతం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకు మాదిరిగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సేవింగ్స్ బ్యాంక్‌లో అయితే వయోవృద్ధులకు బ్యాంకులాగానే 9 శాతం వడ్డీని పోస్టల్‌శాఖ చెల్లిస్తుంది. కొన్ని రోజుల్లో పోస్టల్ బ్యాంక్‌లు కూడా వస్తాయని పోస్టల్ అధికారులంటున్నారు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం ఏ జిల్లాల్లో అయితే రైల్వే రిజర్వేషన్ కార్యాలయం లేదో, ఆ ప్రాంతంలోని పోస్టాఫీసులో ఈ సౌకర్యం లభిస్తుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సౌకర్యాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ దీని ప్రత్యేకత. పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా, పట్టణంలోని ఇతరులందరికి ఎంప్లాయిస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ తపాలా బీమా ఉపయోగపడుతుంది. లాజిస్టిక్ పోస్టు ఈ లాజిస్టిక్ పోస్టు సౌకర్యంలో మరికొన్ని సేవలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వస్తువులను వేరే ప్రాంతాలకు పంపించుకోవచ్చు. నగరంలో నివసించే వారు అయితే హౌస్షిప్టింగ్కు కూడా వినియోగింపవచ్చు.ఇల్లు మార్పిడికి ఇక వేలకువేలు చెల్లించే అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు మారిపోవచ్చు. ఈ సౌకర్యం బాగుందని తపాలా శాఖ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధమైన హౌస్ షిప్టింగ్ సౌకర్యం ఉందని కొందరికి మాత్రమే తెలుసునని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు. మై స్టాంప్ స్టాంప్ అనగానే అదొక మంచి గుర్తింపు ముద్ర అని అందరికీ తెల్సిన విషయం. గతంలో లాల్‌బహుదూర్‌శాస్త్రి, సర్దార్ వల్లభాయ్‌పటేల్ వంటి ప్రముఖుల ఫొటోలు, చారిత్రక ప్రదేశాల ఫొటోలు స్టాంపులుగా పోస్టల్ శాఖ అందించింది. అయితే ఈ మధ్య కాలంలో మైస్టాంప్ పేరుతో కొత్త సౌకర్యం అందుబాటు లోకి వచ్చింది. దీనిద్వారా ఎవరి ఫొటో వారు స్టాంపుగా తయారు చేయించుకోవచ్చు. దీనికి కేవలం రూ.300 సొమ్ము పోస్టల్‌శాఖకు చెల్లిస్తే సరిపోతుంది. రూ.240 పోస్టల్‌శాఖ ఖాతాకు జమకాగా, రూ.5 విలువగల 12 స్టాంపులను వినియోగదారునికి అందజేస్తారు. ఈ స్టాంపులు దూరప్రాంతాలకు పంపే కవరులపై అంటించినా చెల్లుబాటు అవుతాయి. మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వారికైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం లభిస్తుంది. ముందుగా పోస్టల్ కార్యాలయంలో డబ్బు జమ చేయగానే, మనీ అందుకోవాల్సిన సంబంధిత చిరునామా గల వ్యక్తి మొబైల్‌కు ఓ కోడ్ నంబర్ ఆన్లైన్ ద్వారా మెసేజ్‌గా వెళ్తుంది. అనంతరం ఆ కోడ్ నంబర్‌గల మొబైల్‌ను డబ్బులు అందుకోవాల్సిన వ్యక్తి పోస్టల్ కార్యాలయంలో చూపిస్తే వెను వెంటనే బల్క్ మొత్తం డబ్బులు అయినా ఒక ఐడీ ఫ్రూఫ్‌ను తీసుకుని పోస్టల్ సిబ్బంది అందజేస్తారు. త్వరలో మరికొన్ని.. పోస్టల్‌శాఖలో మరికొన్ని సేవలు వస్తాయని తెలుస్తోంది. కూరగాయలను వేరే ప్రాంతాలకు చేరవేయడం, పోస్టల్ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చి అన్ని ప్రాంతాలకు విస్తరించడం వంటి సౌకర్యాలు వస్తాయి. వీటితోపాటు మరికొన్ని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్లు పోస్టల్ సేవలం కోసం నల్లగొండలోని హెడ్‌పోస్టాఫీసు 08682-244204, భువనగిరి ప్రాంతం వరకు 08682-242585 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఫోన్ 08682-244267 ద్వారా సంప్రదించవచ్చు అందుబాటులో అన్ని రకాల సేవలు హెడ్పోస్టాఫీసుల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మీ సేవ ద్వారా పొందే సేవలన్నింటినీ ఇక్కడ పొందవచ్చు. కరెం ట్బిల్లులు, అన్ని నెట్‌వర్క్‌ల టెలిఫోన్ బిల్లులు, అంబేద్కర్ ఓపెన్ యూని వర్సిటీ ఫీజులను చెల్లించవచ్చు. త్వరలో పోస్టుమాన్ ఉద్యోగాల కోసం పరీక్ష నిర్వహిస్తున్నాం. దీనికి ఇక్కడ ఫీజు చెల్లించవచ్చు. - రఘునాథస్వామి, జిల్లా ఇన్చార్జ్ పోస్టల్ సూపరింటెండెంట్ -
ఆన్లైన్లో తపాలా సేవలు
బొబ్బిలి, న్యూస్‌లైన్ : రానున్న ఆరు నెలల్లో తపాలా శాఖలో పూర్తిగా ఆన్లైన్ చేసి ఖాతాదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు ఆ శాఖ డిప్యూటీ డివిజనల్ మేనేజర్ కె.వెంక ట్రావురెడ్డి చెప్పారు. ఇక్కడ విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 బ్రాంచి కార్యాలయూలు ఉన్నట్టు తెలిపారు. వీటిలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్ఐ) ఖాతాదారులు నాలుగు లక్షల 50 వేల మంది ఉండగా, గ్రామీణ పీఎల్ఐ ఖాతాదారులు 50 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఇన్ఫోసిస్‌తో అంగీకారం కుదుర్చుకొని ఆన్లైన్ చేస్తున్నామని, వచ్చే ఏడాదిలో ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. వీటి వల్ల గడువు తీరిన బీమాలకు చెల్లింపులతో పాటు అదనపు సదుపాయూలు కూడా లభిస్తాయని చెప్పారు. ప్రధాన కేంద్ర కార్యాలయంలో ఉండే కంట్రోలు ప్రొసెస్ సెంటరు(సీపీపీ) ద్వారా దేశ వ్యాప్తంగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే వారికే వర్తించేవని, ఇప్పుడు ప్రైవేటుగా నడుస్తున్న ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, హైస్కూల్, బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో పని చేస్తున్న వారికి కూడా అమలు చేస్తూ విస్తరించామన్నారు. అన్ని బీమా సంస్థల కంటే పోస్టల్ బీమా ద్వారా బోనస్, వడ్డీలు అధికంగా ఉన్నాయని చెప్పారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ డబ్బులు వస్తాయని తెలిపారు. గ్రామీణ పోస్టల్ ఇన్సూరెన్స్‌ను రూ.3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచామన్నారు. వికలాంగులు బీమా చేయించుకోవడానికి ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు ఉండేదని, ఇప్పుడు దానిని రూ.20లక్షలకు పెంచామని చెప్పారు. ఎవరికైనా సలహాలు, సూచనలు అవసరమైతే టోల్ ఫ్రీ నంబరు 18001805232 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట సూపరింటెండెంట్ డబ్ల్యు నాగాదిత్య కుమార్, రవి ఉన్నారు.