postpaid subscribers
-
రూ.199 ప్యాక్‌పై రోజుకు 2.8 జీబీ డేటా
ముంబై : రిలయన్స్ జియోకు కౌంటర్ ఇవ్వడానికి టెలికాం కంపెనీలన్నీ దాదాపు తమ ప్లాన్లను సమీక్షిస్తూనే ఉన్నాయి. అంతకముందు ఆఫర్ చేసే డేటాను దాదాపు రెండింతలు పెంచుతున్నాయి. తాజాగా వొడాఫోన్ సైతం తన డేటా పరిమితిని రెండింతలు చేసింది. తన మెస్ట్ అఫార్డబుల్ ప్యాక్ 199 రూపాయలపై రోజుకు 2.8 జీబీ 3జీ లేదా 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అంతకముందు ఈ ప్యాక్‌పై కేవలం రోజుకు 1.4జీబీ డేటా మాత్రమే అందించేది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకేనని, వొడాఫోన్ సబ్స్క్రైబర్లందరికీ కాదని తెలిసింది. అదనంగా ఈ ఆఫర్ వొడాఫోన్ 4జీ ఉన్న టెలికాం సర్కిళ్లకు అందుబాటులో ఉంది. అప్డేట్ చేసిన 199 రూపాయల ప్రీపెయిడ్ ప్యాక్, అపరిమిత వాయిస్ కాల్స్‌ను అందిస్తోంది. అయితే ఈ ఉచిత వాయిస్ కాల్స్‌లోనూ రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు వాడుకునే పరిమితి మాత్రమే ఉంది. వొడాఫోతో పోలిస్తే, రిలయన్స్ తన అఫార్డబుల్ రూ.198 ప్యాక్‌పై కేవలం రోజుకు 2 జీబీ డేటా మాత్రమే ఇస్తోంది. పోస్టు పెయిడ్ సబ్స్క్రైబర్లకు, వొడాఫోన్ ఇటీవలే ‘లోయస్ట్ బిల్ గ్యారెంటీ’తో కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. అదేవిధంగా ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌తో కూడా వొడాఫోన్ జతకట్టింది. ఈ భాగస్వామ్యంలో అమెజాన్ ప్రైమ్ సర్వీసులను ఏడాది పాటు ఎంపిక చేసిన యూజర్లకు ఉచితంగా అందిస్తోంది. అయితే ఆ సబ్స్క్రైబర్లు వొడాఫోన్ రెడ్ పోస్టు పెయిడ్ ప్లాన్‌ను కలిగి ఉండాలి. -
ఎయిర్టెల్ మరో ఆఫర్ : వారికి ఫ్రీగా అమెజాన్ ప్రైమ్
రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అన్ని రకాల ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. తన పోస్టుపెయిడ్, వీ-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు తమ టీవీ యాప్ డౌన్లోడ్పై ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ అంతకముందు కేవలం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం అర్హత గల కస్టమర్లందరికీ ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎయిర్టెల్ తెలిపింది. ఈ ప్రమోషనల్ ఆఫర్‌తో కేవలం సినిమాలు, టీవీ షోలు చూడటానికి మరో ప్లాట్‌ఫామ్‌ను అందించడమే కాకుండా... జియోకు గట్టి పోటీ ఇవ్వడానికి దోహదం చేయనుందని కంపెనీ చెప్పింది. 2018 జూన్ వరకు సబ్స్క్రైబర్లకు ఎయిర్టెల్ టీవీ యాప్‌ను ఉచితంగా అందించడం ప్రారంభించిన వెంటనే, ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం 499 రూపాయలు, ఆపై మొత్తాలతో మైఇన్ఫినిటీ ప్లాన్లను యాక్టివేట్ చేసుకుంటున్న ఎయిర్టెల్ పోస్టు పెయిడ్ కస్టమర్లకు, వెయ్యి రూపాయల పైన ప్లాన్లు రీఛార్జ్ చేసుకుంటున్న వీ-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్ ఎవరికైతే అందుబాటులో ఉంటుందో వారు 12 నెలల పాటు ఈ సర్వీసులను ఆస్వాదించవచ్చని కంపెనీ తెలిపింది. ఒకవేళ సబ్‌స్క్రైబర్ ఈ ఉచిత సర్వీసులను ఏప్రిల్‌లో యాక్టివేట్ చేసుకుంటే, కేవలం తొమ్మిది నెలలే ఉచిత ప్రైమ్ వాడకాన్ని పొందవచ్చు. ఆఫర్‌ను క్లయిమ్ చేసుకోవడమెలా? యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచి ఎయిర్టెల్ టీవీ యాప్‌ను సబ్స్క్రైబర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యాక, స్క్రోల్ డౌన్ చేయాలి. అక్కడ అమెజాన్ ప్రైమ్ బ్యానర్ కనిపిస్తుంది బ్యాన్‌ను ట్యాప్ చేస్తే, ప్రైమ్ సర్వీసుల వివరాలతో కూడిన డైలాగ్ బాక్స్ వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అమెజాన్ అకౌంట్ వివరాలు ఇక్కడ చాలా అవసరం ఒక్కసారి ఆ వివరాలు వెరిఫై అయ్యాక, ఉచితంగా 365 రోజుల అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది. ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా మీకు ఈ ఉచిత సర్వీసులు యాక్టివేట్ అయినట్టు ధృవీకరణ మెసేజ్ వస్తుంది. ఈ ఆఫర్ కూడా కేవలం ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లేని అమెజాన్ యూజర్లకు మాత్రమే. ఒకవేళ మీరు ప్రైమ్ సబ్స్క్రైబర్లు అయి ఉంటే, ప్రస్తుతం నడుస్తున్న సబ్స్క్రిప్షన్ ముగిసిన తర్వాత ఈ ఆఫర్‌ను పొందాల్సి ఉంటుంది. -
హోళీ కానుక: ఆ కంపెనీ రోజుకి 1జీబీ డేటా
రిలయన్స్ జియో ప్రైమ్ సర్వీసెస్‌కు పోటీగా తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.345 ప్లాన్ ను ప్రకటించిన ఎయిర్ టెల్ మరో ఆఫర్ తో వినియోగదారుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సారి ప్రకటించే ఆఫర్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకట. హోళీ పండుగ సందర్భంగా ఎయిర్ టెల్ ఓ స్పెషల్ ఆఫర్ ను తన పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ ఆఫర్ కింద రూ.150కు రోజుకు 1జీబీ డేటా ఆఫర్ ను అందించనుందట. ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న ఆఫర్ మాదిరిగానే 1జీబీ డేటాలో 500 ఎంబీ రోజంతా వాడుకున్న తర్వాత, మరో 500 ఎంబీని అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాడుకునే అవకాశం కల్పించనుందని తెలుస్తోంది. కొత్తగా ఆఫర్ చేస్తున్న ఈ డేటా వివరాలను తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు కంపెనీ సీఈవో గోపాల్ మిట్టల్ ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా తెలిపినట్టు తెలుస్తోంది. తన పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కింద ఇటీవలే డేటా బెనిఫిట్స్ ను ఎయిర్ టెల్ మరింత మెరుగుపర్చింది. ఎయిర్ టెల్ మాదిరిగా వొడాఫోన్, ఐడియాలు కూడా రోజుకు 1జీబీ డేటా ప్యాక్ లను ఇప్పటికే తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రకటించాయి. అయితే రాత్రి, పగలు పూట విడివిడిగా కాకుండా.. రోజంతా ఈ బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి.