హోళీ కానుక: ఆ కంపెనీ రోజుకి 1జీబీ డేటా
రిలయన్స్ జియో ప్రైమ్ సర్వీసెస్కు పోటీగా తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.345 ప్లాన్ ను ప్రకటించిన ఎయిర్ టెల్ మరో ఆఫర్ తో వినియోగదారుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సారి ప్రకటించే ఆఫర్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకట. హోళీ పండుగ సందర్భంగా ఎయిర్ టెల్ ఓ స్పెషల్ ఆఫర్ ను తన పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ ఆఫర్ కింద రూ.150కు రోజుకు 1జీబీ డేటా ఆఫర్ ను అందించనుందట. ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న ఆఫర్ మాదిరిగానే 1జీబీ డేటాలో 500 ఎంబీ రోజంతా వాడుకున్న తర్వాత, మరో 500 ఎంబీని అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాడుకునే అవకాశం కల్పించనుందని తెలుస్తోంది.
కొత్తగా ఆఫర్ చేస్తున్న ఈ డేటా వివరాలను తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు కంపెనీ సీఈవో గోపాల్ మిట్టల్ ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా తెలిపినట్టు తెలుస్తోంది. తన పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కింద ఇటీవలే డేటా బెనిఫిట్స్ ను ఎయిర్ టెల్ మరింత మెరుగుపర్చింది. ఎయిర్ టెల్ మాదిరిగా వొడాఫోన్, ఐడియాలు కూడా రోజుకు 1జీబీ డేటా ప్యాక్ లను ఇప్పటికే తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రకటించాయి. అయితే రాత్రి, పగలు పూట విడివిడిగా కాకుండా.. రోజంతా ఈ బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి.