ఎయిర్‌టెల్‌ మరో ఆఫర్‌ : వారికి ఫ్రీగా అమెజాన్‌ ప్రైమ్‌ | Airtel is Offering Free Amazon Prime Subscription to Its Users | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ మరో ఆఫర్‌ : వారికి ఫ్రీగా అమెజాన్‌ ప్రైమ్‌

Published Fri, Jan 12 2018 3:45 PM | Last Updated on Fri, Jan 12 2018 6:13 PM

Airtel is Offering Free Amazon Prime Subscription to Its Users - Sakshi

రిలయన్స్‌ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ అన్ని రకాల ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా మరో బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. తన పోస్టుపెయిడ్‌, వీ-ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు తమ టీవీ యాప్‌ డౌన్‌లోడ్‌పై ఏడాది పాటు ఉచితంగా అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రమోషనల్‌ ఆఫర్‌ అంతకముందు కేవలం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం అర్హత గల కస్టమర్లందరికీ ఈ  సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ప్రమోషనల్‌ ఆఫర్‌తో కేవలం సినిమాలు, టీవీ షోలు చూడటానికి మరో ప్లాట్‌ఫామ్‌ను అందించడమే కాకుండా... జియోకు గట్టి పోటీ ఇవ్వడానికి దోహదం చేయనుందని కంపెనీ చెప్పింది. 

2018 జూన్‌ వరకు సబ్‌స్క్రైబర్లకు ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ను ఉచితంగా అందించడం ప్రారంభించిన వెంటనే, ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ కేవలం 499 రూపాయలు, ఆపై మొత్తాలతో మైఇన్ఫినిటీ ప్లాన్లను యాక్టివేట్‌ చేసుకుంటున్న ఎయిర్‌టెల్‌ పోస్టు పెయిడ్‌ కస్టమర్లకు, వెయ్యి రూపాయల పైన ప్లాన్లు రీఛార్జ్‌ చేసుకుంటున్న వీ-ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లకు ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్‌ ఎవరికైతే అందుబాటులో ఉంటుందో వారు 12 నెలల పాటు ఈ సర్వీసులను ఆస్వాదించవచ్చని కంపెనీ తెలిపింది. ఒకవేళ సబ్‌స్క్రైబర్‌ ఈ ఉచిత సర్వీసులను ఏప్రిల్‌లో యాక్టివేట్‌ చేసుకుంటే, కేవలం తొమ్మిది నెలలే ఉచిత ప్రైమ్‌ వాడకాన్ని పొందవచ్చు. 

ఆఫర్‌ను క్లయిమ్‌ చేసుకోవడమెలా?

  • యాప్‌ స్టోర్‌ లేదా ప్లే స్టోర్‌ నుంచి ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ను సబ్‌స్క్రైబర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రర్‌ మొబైల్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వాలి
  • లాగిన్‌ అయ్యాక, స్క్రోల్‌ డౌన్‌ చేయాలి. అక్కడ అమెజాన్‌ ప్రైమ్‌ బ్యానర్‌ కనిపిస్తుంది
  • బ్యాన్‌ను ట్యాప్‌ చేస్తే, ప్రైమ్‌ సర్వీసుల వివరాలతో కూడిన డైలాగ్‌ బాక్స్‌ వస్తుంది. దాన్ని యాక్టివేట్‌ చేసుకోవాలి.
  • అమెజాన్‌ అకౌంట్‌ వివరాలు ఇక్కడ చాలా అవసరం
  • ఒక్కసారి ఆ వివరాలు వెరిఫై అయ్యాక, ఉచితంగా 365 రోజుల అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమవుతుంది. ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా మీకు ఈ ఉచిత సర్వీసులు యాక్టివేట్‌ అయినట్టు ధృవీకరణ మెసేజ్‌ వస్తుంది.
  • ఈ ఆఫర్‌ కూడా కేవలం ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లేని అమెజాన్‌ యూజర్లకు మాత్రమే. ఒకవేళ మీరు ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లు అయి ఉంటే, ప్రస్తుతం నడుస్తున్న సబ్‌స్క్రిప్షన్‌ ముగిసిన తర్వాత ఈ ఆఫర్‌ను పొందాల్సి ఉంటుంది.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement