Pothana
-
నిన్ను సంతోషంగా కానీ.. దుఃఖంతో కానీ.. ఉంచేది నీ మనసే!
మీరు పిల్లలు... మార్పు మీ దగ్గరే ప్రారంభం కావాలి. ప్రయత్న పూర్వకంగా కొన్ని మంచి లక్షణాలు పసి వయసులోనే అలవాటు చేసుకోవాలి. దీనికి ఉపకరించేవి పెద్దలు, గురువులు చెప్పే మాటలు.. అలాటిదే శతక నీతి కూడా... ఇప్పడు మనం తెలుసుకుంటున్న ‘తన కోపమె తన శత్రువు...’ సూక్తి సుమతీ శతకం లోనిది. మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తుంది, మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాలపట్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి... అంటూ మన సంతోషమే మనకు స్వర్గం, మన దుఃఖమే మనకు నరకం అంటారు బద్దెన గారు. పోతన గారు ఓ మాటంటారు... ‘‘వ్యాప్తిం బొందక వగవక /ప్రాప్తంబగు లేశమైన బదివే లనుచుం/దృప్తిం జెందని మనుజుడు/ సప్తద్వీపముల నయిన? జక్కంబడునే?’’ అంటే...లభించినది కొంచెం అయినా అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు....అంటారు. ‘నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులున్నారు, నాకు మంచి స్నేహితు లున్నారు. నేను మంచి పాఠశాలలో చదువుతున్నా. నాకు మంచి గురువులున్నారు..అలా మనకు ఉన్నవేవో వాటిలోని మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం, మన అభ్యాసం మటుకు నిజాయితీగా చేయాలి. ఇది చేయకుండా అంటే ఉన్నవాటిలోని మంచిని చూడకుండా... లేనివి ఏవో పనిగట్టుకుని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఉన్న పుణ్యకాలం గడిచిపోతుంది. అలా నిత్యం దిగాలుగా ఉండి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృథా చేసుకునేవాడిని ఆ దేముడు కూడా కాపాడలేడు. నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది నీ మనసే. దానిని అదుపు చేసుకో, దానికి నచ్చ చెప్పు. దాని మాట నీవు వినడం కాదు, నీ మాట అది వినేటట్లు చేసుకో. అది నీ చేతిలో ఉంది. అది ఇతరుల వల్ల సాధ్యం కాదు. అలా ఆలోచించి నిత్యం తృప్తిగా, సంతోషంగా ఉంటూ పనులు చక్కబెట్టు కుంటుంటే అదే నీకు స్వర్గం. మీకొక రహస్యం చెబుతా. మనం అందరం చెప్పుకునే స్వర్గలోకం శాశ్వతం కాదు.. మనం చేసిన మంచి పనుల వల్ల మనం స్వర్గం చేరుకునేది నిజమే అయినా... అది మన ఖాతాలో పుణ్యం ఉన్నంతవరకే. అది అయిపోగానే ... మనం పడిపోతాం. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మ నీకు దక్కింది... 84 లక్షల జీవరాశుల్లో దేనికీ దక్కని అదృష్టం వల్ల నీకు దక్కిన ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ... నీవు దొరికిన దానితో తృప్తిపడి... నిత్యం సంతోషంగా ఉంటే... నీ జీవితాంతం అలా ఉండగలిగితే... ఇక్కడే నీకు స్వర్గ సుఖాలు లభించినట్లు. అలాకాక నా స్నేహితుడు మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతున్నాడు, నేను కాలేకపోతున్నా... అని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే... నీ నరకాన్ని దేముడు కాకుండా నీవే సృష్టించు కున్నట్లయింది. జన్మజన్మలకూ నీవు కూడా సంతోషంగా ఉండాలంటే, నీకు కూడా నీ స్నేహితుడి లాగా సరస్వతీ కటాక్షం పొందాలంటే.. కష్టపడు, బాగా చదువు. ఈ జన్మలో నీకు వచ్చిన విద్య పదిమందికి పంచు, కష్టంలో ఉన్నవాడికి నీకు చేతనయినంత సహాయం చెయ్యి. నిత్యోత్సాహంతో ఉండు. ఫెయిల్ అయ్యావు... అంత మాత్రానికే లోకం తల్లకిందులయిపోయినంతగా దిగాలు పడొద్దు... అబ్దుల్ కలాం గారు.. ఎఫ్.ఎ..ఐ.ఎల్..ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్... అన్నారు. అంటే నీవు నేర్చుకోవడానికి నీవు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారు.. ఇప్పుడు నీవేం చేయాలి.. రెండో ప్రయత్నం. పట్టుదలతో, ఏకాగ్రతతో సాధించు... అంతే తప్ప నీ అరచేతిలో నీవు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నీవే కిందకు నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తల్లి తప్పటడుగు.. తండ్రీబిడ్డలు బలి
నిర్మల్/సారంగపూర్: భార్య వేసిన తప్పటడుగుకు భర్త, బిడ్డ బలయ్యారు. మరో ఇద్దరు .చిన్నారులు అమ్మ ఉన్నా.. అనాథల్లా మారారు. తల్లి వివాహేతర బంధం.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన కుదురు పోతన్న (34)కు 11ఏళ్ల క్రితం భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన దగ్గరి బంధువు పూజిత (30)తో వివాహమైంది. వీరికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పోతన్న గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పూజిత కొంతకాలంగా బోరిగాం గ్రామానికే చెందిన శ్రీకాంత్‌రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై గతంలోనే పంచాయితీ నిర్వహించి ఇద్దరూ దూరంగా ఉండాలని పెద్దలు సూచించినట్లు తెలిసింది. మళ్లీ ఇటీవల వారిద్దరూ తమ పాతబంధాన్నే కొనసాగిస్తుండడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న పూజిత తన చిన్నకూతురు క్యూటీ(3)ని తీసుకుని శ్రీకాంత్‌రెడ్డితో వెళ్లిపోయింది. మూడు రోజులపాటు వారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గడిపారు. ఈ నెల 25న శ్రీకాంత్‌రెడ్డి ఆమెను, చిన్నారిని నిర్మల్ బస్టాండ్‌లో వదిలి బోరిగాం వెళ్లిపోయాడు. తమను కూడా తీసుకెళ్లాలని పూజిత కోరగా అతడు నిరాకరించాడు. ఇంటికి ఫోన్ చేయగా, ఆమె వెళ్లిన రోజు సాయంత్రమే పోతన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, ఎటు వెళ్లాడో సమాచారం లేదని తెలిసింది. దీంతో దిక్కుతోచక బుధవారం రాత్రి నిర్మల్ బస్టాండ్ సమీపంలో ఓ లాడ్జి వద్ద తన కూతురికి క్రిమి సంహారక మందు తాగించి తానూ తాగింది. అపస్మారక స్థితికి చేరిన వారిని స్థానికుల సమాచారం మేరకు పట్టణ పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు చిన్నారి క్యూటీ మృతిచెందిందని చెప్పారు. పూజితకు ఐసీయూలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. పెళ్లి చేసుకుంటానని.. శ్రీకాంత్‌రెడ్డి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, రెండు రోజులు తన వెంట ఉంచుకొని నిర్మల్ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయాడని పూజిత తెలిపింది. ఇంట్లో పరిస్థితికి భయపడి పురుగల మందును తన బిడ్డకు తాగించి, తాను తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది. పోతన్న బలవన్మరణం.. భార్య వేరే వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో అటు పోతన్న జీర్ణించుకోలేకపోయాడు. అవమానభారంతో ఈ నెల 22న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గురువారం పూజిత ఘటన బయటపడగానే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, చుట్టుపక్కల గాలించారు. సారంగపూర్ మండలం ఆలూరు చెరువు వద్ద పోతన్న బైక్, సెల్‌ఫోన్, దుస్తులు కనిపించాయి. గజ ఈతగాళ్లను రప్పించి చెరువంతా గాలించారు. గురువారం సాయంత్రం పోతన్న మృతదేహం చెరువులో లభ్యమైంది. శ్రీకాంత్‌రెడ్డి, పూజితలపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం శ్రీకాంత్‌రెడ్డి పరారీలో ఉన్నాడని నిర్మల్ పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాగా, పూజిత ప్రాణాలతో బయటపడ్డా.. అటు తల్లిదండ్రులు, ఇటు అత్తగారింట్లో ఆమెను దగ్గరకు తీసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో పిల్లలు అభినయ్ (10), నిత్య (7) అమ్మ ఉన్నా.. అనాథల్లా మారారు. -
చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
-
చంద్రబాబు వాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు
-
పోతన రామాయణం రాశారు: చంద్రబాబు
సాక్షి, కడప: బమ్మెర పోతన మహాకవి తెలుగువారందరికీ సుపరిచితులు. ఆయన రచించిన ‘శ్రీమదాంధ్ర భాగవతం’లోని పద్యాలు, కీర్తనలు తెలుగువారికి కంఠతా వస్తాయి. ఇప్పటికీ తేనెలొలుకు ఆ తెలుగు పద్యాలు తెలుగువారి నోట జాలువారుతుంటాయి. అలాంటి బమ్మెర పోతన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు జారారు. వైఎస్ఆర్ జిల్లా ఒంట్టిమిట్టలో బమ్మెర పోతన రామాయణం రాసి.. అక్కడి కోదండరామస్వామికి అంకితమిచ్చేశారని అనేశారు. ఒంటిమిట్టలో శుక్రవారం శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘కోదండరామస్వామి దేవాలయం.. ఒక చరిత్ర కలిగిన దేవాలయం. ఒక చరిత్ర ఉండే దేవాలయం ఇది. ఆ చరిత్రను ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోని ఈ టెంపుల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆ రోజు బమ్మెర పోతన ఇక్కడనే రామాయణం రాసి.. ఈ దేవునికి అంకితం చేసిన విషయం కూడా మనమందరం గుర్తుపెట్టుకోవాలి’ అని చెప్పుకొచ్చారు. అయితే, చంద్రబాబు బమ్మెర పోతన విషయమై చేసిన వ్యాఖ్యలపై తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బమ్మెర పోతన ‘వీరభద్ర విజయము’, ‘భోగినీ దండకము’, ‘భాగవతము’, ‘నారాయణ శతకము’ వంటి రచనలు చేశారు. ఆయన రామాయణాన్ని రచించలేదు. ఈ నేపథ్యంలో భాగవతం రాసిన పోతనను రామాయణం రాశారని చంద్రబాబు పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది. ఇది చంద్రబాబుకు ఉన్న జ్ఞానం అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. (వీడియో టీటీడీ సౌజన్యంతో) -
సాక్షి ఫాంట్లు : ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి
'సాక్షి' సైట్ చూసేందుకు ఫాంట్స్ ఇబ్బందిగా ఉంటే.. సాక్షి ఫాంట్స్ ను ఇక్కడ పొందుపరిచాం. Mandali Normal : మండలి నార్మల్ (ఫాంటు డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి) Pothana : పోతన (ఫాంటు డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి) 1. మొదటగా మీకు కావల్సిన ఫాంట్ పై మౌస్ క్లిక్ చేశాక "Save file" option ఎంచుకొని మీ కంప్యూటర్లో కావల్సినచోట సేవ్ చేసుకోండి. 2. మీ కంప్యూటర్లో "Start " బటన్ ద్వారా "Control Panel" లోకి వెళ్ళండి. అక్కడ "Fonts" అనే ఫోల్డర్లోకి ఈ ఫాంటు ఫైల్‌ను పేస్ట్ చేయండి. ఆ ఫాంట్ ఇన్స్టాల్ అవుతుంది. 3. అప్పుడు మీకు కావల్సిన అప్లికేషన్లో మిగతా ఫాంట్లతో పాటు కొత్త ఫాంట్ కూడా ఉంటుంది.