పోతన రామాయణం రాశారు: చంద్రబాబు | CM Chandrababu Worngly says Pothana wrote Ramayanam | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 31 2018 2:46 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

CM Chandrababu Worngly says Pothana wrote Ramayanam - Sakshi

సాక్షి, కడప: బమ్మెర పోతన మహాకవి తెలుగువారందరికీ సుపరిచితులు. ఆయన రచించిన ‘శ్రీమదాంధ్ర భాగవతం’లోని పద్యాలు, కీర్తనలు తెలుగువారికి కంఠతా వస్తాయి. ఇప్పటికీ తేనెలొలుకు ఆ తెలుగు పద్యాలు తెలుగువారి నోట జాలువారుతుంటాయి. అలాంటి బమ్మెర పోతన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు జారారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంట్టిమిట్టలో బమ్మెర పోతన రామాయణం రాసి.. అక్కడి కోదండరామస్వామికి అంకితమిచ్చేశారని అనేశారు.  

ఒంటిమిట్టలో శుక్రవారం శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘కోదండరామస్వామి దేవాలయం.. ఒక చరిత్ర కలిగిన దేవాలయం. ఒక చరిత్ర ఉండే దేవాలయం ఇది. ఆ చరిత్రను ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోని ఈ టెంపుల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆ రోజు బమ్మెర పోతన ఇక్కడనే రామాయణం రాసి.. ఈ దేవునికి అంకితం చేసిన విషయం కూడా మనమందరం గుర్తుపెట్టుకోవాలి’ అని చెప్పుకొచ్చారు.  అయితే, చంద్రబాబు బమ్మెర పోతన విషయమై చేసిన వ్యాఖ్యలపై తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బమ్మెర పోతన ‘వీరభద్ర విజయము’, ‘భోగినీ దండకము’, ‘భాగవతము’, ‘నారాయణ శతకము’ వంటి రచనలు చేశారు. ఆయన రామాయణాన్ని రచించలేదు. ఈ నేపథ్యంలో భాగవతం రాసిన పోతనను రామాయణం రాశారని చంద్రబాబు పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది. ఇది చంద్రబాబుకు ఉన్న జ్ఞానం అని నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

(వీడియో టీటీడీ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement