ఇదేనా భాషా సేవ?
ఇంటర్లో ఇక నుంచి రెండవ తప్పనిసరి భాషగా తెలుగే ఉం టుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గిడుగువారి సభలో ప్రకటిం చడం హర్షించదగినదే. ఇంటర్ విద్య నుంచి తెలుగును తన్ని తగ లేసిన విద్యావ్యాపారులతో కూడిన మంత్రివర్గం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే, దానిని మసిపూసి మారేడుకాయ చేయగలమన్న ధీమా ఉండే ఉంటుంది. రెండవ తప్పనిసరి భాషపై సీఎం ప్రకటన మీద నమ్మకం కలగకపోవడానికి మరో కారణం- అధికార భాషా సంఘం అధ్యక్షుని నియామకం గురించి ఆ సభలో చేసిన ప్రక టన. పొట్లూరి హరికృష్ణ పేరును ప్రకటించగానే ఆయన వేదిక ఎక్కారు. హరికృష్ణ పేరు నేనైతే మొదటిసారి విన్నాను.
పాతిక వేలు పురస్కారం అందుకున్నారు కాబట్టి, ఆయన భాషకు రహస్య సేవ ఏదైనా చేసే ఉండాలి. వావిలాల వంటి సామా జిక కార్యకర్త, సినారె వంటి పండితుడు, పరుచూరి గోపాలకృష్ణ వంటి కళాసాహిత్యకారుడు, ఏబీకే వంటి సంపాదకుడు నిర్వహిం చిన ఆ పదవిని నేడు అలంకరించబోయే వ్యక్తి అర్హతలు ఏమిటో ఇంకా వెల్లడికావాల్సి ఉంది. కాగా అధికార భాషా సంఘం ఆవిర్భ వించి యాభైయ్యేళ్లయింది. కానీ తెలుగునాట తెలుగులో పాలనా వ్యవహారాలు జరగడం లేదు. సంఘం లక్ష్యాలు ఎంత వరకు నెరవే రాయో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి.
దివికుమార్ ప్రధాన కార్యదర్శి, జనసాహితి