poultry farming
-
కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించటం ఎలా?
వ్యాధి నిర్ధారణ అయిన కోళ్లకు, వాటి పక్కన ఉన్న కోళ్లకు చికిత్స చేయడానికి మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపయోగించండి. వీటిని మేత ద్వారా కంటే నీటిలో కలిపి ఇస్తే బాగా పనిచేస్తాయి. యాంటీబయాటిక్ ఔషధాలను వ్యాధి నివారణకు లేదా కోళ్ల పెరుగుదలను పెపొందించడానికి ఉపయోగించవద్దు.కోళ్ల షెడ్లోకి వచ్చే సందర్శకుల సంఖ్యను పరిమితం చేయండి. లోపలికి వెళ్లే ముందు బట్టలు, చెప్పులు/బూట్లు మార్చుకోవాలి. చేతులు కడుక్కోవాలి. ఆవరణలోకి ప్రవేశించే ముందు వాహనాలను క్రిమిసంహారకాలతో శుభ్రపరచండి. వ్యాధులను వ్యాపింపజేసే ఎలుకలు, పురుగులు, పెంపుడు జంతువులు, అడవి జంతువులు కోళ్ల ఫారాలల్లోకి రానివ్వకండి. నాణ్యతతో కూడిన మంచి వ్యాక్సిన్లను ఉపయోగించండి. తయారీదారు సూచించిన విధంగా వాటిని నిల్వ చేయండి, జాగ్రత్తగా వాడండి.మీ ఫౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ల ఆరోగ్యాన్ని, ప్రవర్తనను ప్రతిరోజూ తనిఖీ చేయండి. వాటిల్లో అకస్మాత్తుగా లేదా క్రమంగా వస్తున్న మార్పులను వెంటనే గుర్తించండి. చనిపోయిన పక్షులను తొలగించి పారవేయండి.గాలి, వెల్తురు, మేత, నీటి సరఫరా, కోళ్ల సంఖ్య (స్టాకింగ్ డెన్సిటీ) ఇతర విషయాలకు సంబంధించి నిపుణుల సిఫార్సులను అనుసరించండి.కోళ్లకు వేసే మేత నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి. మేతలో తగినంత శక్తినిచ్చే దినుసులు, ఖనిజాలను సమతుల్యంగా ఉండాలి. మేతను జాగ్రత్తగా నిల్వ చేయండి. మొక్కలు, గింజలతో కూడిన మేతను ఇవ్వటమే మేలు.ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, సుగంధ తైలాలు, ఆర్గానిక్ యాసిడ్స్, నీటకరగని పీచు కోళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి పేగులలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. సూక్ష్మక్రిములను నిరోధిస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.చదవండి: మనం తింటున్న ఆహార నాణ్యత ఎంత?మీ ఫౌల్ట్రీ షెడ్‌ను, పరికరాలను క్రిమిసంహారకాలతో శుభ్రం చేసిన తర్వాత.. మురికిని శుభ్రంచేయటానికి డిటర్జెంట్లు లేదా వేడి నీటిని ఉపయోగించండి. ప్రతి బ్యాచ్ తర్వాత తగినన్ని రోజులు షెడ్‌ను ఖాళీగా ఉంచండి.కొత్తగా కోడి పిల్లలను తెచ్చుకునేటప్పుడు విశ్వసనీయమైన హేచరీల నుంచి తెచ్చుకోండి. టీకాలు వేసి, వ్యాధులు సోకని తల్లి కోళ్ల నుంచి పుట్టిన పిల్లలనే ఎంచుకోండి.కోడిపిల్లలను తెచ్చిన వెంటనే మేతను, నీటిని అందించండి. వాటికి అవసరమైన అన్ని పోషకాలు ఇవ్వండి. శారీరక అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేయండి.చదవండి: కుమ్ఖాత్ పండు.. పోషక విలువలు మెండుశుభ్రమైన, మంచి నాణ్యత గల నీరు అందుబాటులో ఉండేలా చూసుకోండి. నీటి సరఫరా గొట్టాలను తరచుగా శుభ్రపరచండి. డ్రింకింగ్ లైన్లను వారానికోసారి శుభ్రపరచండి.మరిన్ని ముఖ్యాంశాలుకోడి పిల్లలకు మొదటి నుంచే అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన కోడి పిల్లలను మాత్రమే పెంచండి. మీ కోళ్ల ఫారాన్ని సిద్ధం చేయండి.మేతలో ప్రత్యేక పోషకాలు కలిపి ఇవ్వండి.మేత ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.సౌకర్యవంతమైన వాతావరణం కల్పించండి.ప్రతి రోజూ కోళ్లను పరిశీలించండి.సకాలంలో టీకాలు వేయండి.గట్టి జీవ భద్రతా చర్యలు పాటించండి. యాంటీ బయాటిక్స్‌ను తగుమాత్రంగా వాడండి.అధిక నాణ్యత గల నీరివ్వండి. -
ఆర్గానిక్ విధానం లో నాటు కోళ్ల పెంపకం
-
తక్కువ సమయంలో అధిక ఆదాయం.. నెలకు లాభం ఎంతంటే?
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా స్వయం సహాయక సంఘాల్లో ఔత్సాహికుల కోసం పెరటికోళ్ల పెంపకం(లైవ్‌స్టాక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గొర్రెల పంపిణీ మాదిరగా మేలుజాతి పెరటి కోళ్లను ఈ పథకం ద్వారా రాయితీపై పంపిణీ చేయనుంది. ఇప్పటికే జిల్లాలో వెలుగు కార్యాలయాల వద్ద లైవ్‌స్టాక్ యూనిట్ల పంపిణీ సైతం ప్రారంభమైంది. పెరట్లోనే ఆదాయం.. పెరటి కోళ్ల పెంపకం అనేది మహిళలకు తక్కువ సమయంలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉండే వారు నెలకు రూ.10వేలు వరకు సంపాదించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి వద్ద తినిపడేసే వ్యర్థ పదార్థాలతో పాటు పథకం కింద అందజేసే దాణాను కోళ్లకు ఆహారంగా వేస్తే సరిపోతుంది. బాయిలర్ కోడి గుడ్డు రూ.5 ధర పలుకుతుంటే, ఈ దేశవాళీ పెరటి కోడి గుడ్లు ఒక్కొక్కటి రూ.10 వరకు పలుకుతుంది. సాధారణ కోళ్ల కంటే రెట్టింపు బరువుతో మాంసం అమ్మకానికి ఉపయోగపడతాయి. కుక్కల బెడద నుంచి కాపాడుకుంటే సరిపోతుంది. యూనిట్ల కోసం దరఖాస్తు ఇలా.. పెరటి కోళ్ల పెంపకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వీటిని సబ్సిడీపై సమకూరుస్తుంటే వాటి రక్షణ, వ్యాక్సినేషన్ ఇతర బాధ్యతలు పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ చూస్తోంది. మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయంలో ఏపీఎంలకు గ్రామాల్లోని సీఎఫ్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి లబ్ధిదారులకు వాహనం ద్వారా కోళ్లు సరఫరా చేస్తారు. సంరక్షణ నియమావళి, ఇతర సౌకర్యాలను అధికారులే వివరిస్తారు యూనిట్ ధర రూ.3970. ఇందులో ఎనిమిది కోడిపెట్టలు, మూడు కోడి పుంజులు ఉంటాయి. ఒక్కో కోడి నాలుగు కేజీల బరువు వరకు పెరుగుతాయి. ఆరోగ్య పరిస్థితి బట్టి 160 నుంచి 180 వరకు గుడ్లు పెడతాయి. వీటితో పాటు 30 కేజీల దాణా అందించనున్నారు. మార్కెట్లో కిలో దాణా రూ.240 వరకు పలుకుతుంది. కోళ్లు ఎటువంటి అనారోగ్యం కాకుండా నలభై రోజులు వరకు పనిచేసే డీ వార్మింగ్– ఎండీ వ్యాక్సినేషన్ చేయించి అందిస్తారు. మెడికల్ కిట్లు సైతం సరఫరా చేస్తారు. ఇందులో లివర్ టానిక్, బి–కాంప్లెక్సు వంటి యాంటి బయాటిక్‌లు ఉంటాయి. చదవండి: ‘ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది’ చురుగ్గా గుర్తింపు ప్రక్రియ జిల్లాలోని 25 మండలాలకు గాను 2500 యూనిట్లను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేసింది. మండలానికి తొలిదశలో భాగంగా 100 యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో 1530 యూనిట్లకు సరఫరా చేసేందుకు లబ్దిదారుల గుర్తింపు జరిగింది. పలాస మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనం వద్ద పథకం తొలి విడత పంపిణీ ప్రారంభమైంది. ఏపీఎంలను సంప్రదించాలి పెరటికోళ్ల పెంపకం ఇటీవలే ప్రారంభమైంది. మండలాల వారిగా కోళ్ల పంపిణీ జరుగుతోంది. యూనిట్ల కోసం వెలుగు కార్యాలయంలో ఉన్న ఏపీఎంలను సంప్రదించాలి. – డాక్టర్ మోతిక సన్యాసిరావు, డీఆర్డీఏ డీపీఎం, శ్రీకాకుళం -
పెరటి కోళ్లతో జీవనోపాధి.. 10 వేల యూనిట్లు టార్గెట్
ఒకప్పుడు పల్లెల్లోనే నాటు కోళ్లు సందడి చేసేవి. కోడి కూతతోనే గ్రామాల్లో ప్రజలు మేల్కొనేవారు. ప్రతీ ఇంట్లో 10 నుంచి 15 కోళ్లు ఉండేవి. నాటు కోడి గుడ్లు, మాంసంతో వారి జీవనోపాధికి చేదోడుగా నిలిచేవి. ప్రజలకు ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా దన్నుగా నిలిచిన వీటి పెంపకం క్రమంగా తగ్గుతూ వచ్చింది. పల్లెలో పట్టణ వాతావరణం వ్యాపించడంతో వీటి స్థానంలో బ్రాయిలర్ కోళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఒకవైపు నాటు కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పెరటి కోళ్ల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా జిల్లాలో పదివేల యూనిట్లు అందజేసే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. చీమకుర్తి(ప్రకాశం జిల్లా): డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెరటి కోళ్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లో ఆసక్తి చూపే మహిళలకు రూ.4800 విలువ చేసే పెరటి కోళ్ల యూనిట్‌ను వడ్డీ లేని రుణం కింద అందించనుంది. ఒక్కో యూనిట్ కింద 9 కోడి పెట్టలు, 3 కోడిపుంజులు, వాటి పెంపకానికి అవసరమైన 30 కేజీల దాణాను మొత్తం కలిపి కూడా రూ.4800కే అందిస్తోంది. 9 కోడిపెట్టలు వరుసగా 100 గుడ్లు వరకు పెడుతుంది. రెండేళ్ల తర్వాత ఒక్కో కోడి కనీసం 2 కేజీల మాంసం అందిస్తుంది. ఈ విధంగా 12 కోళ్ల ద్వారా 24 కేజీల మాంసం వస్తుంది. నాటుకోడి కేజీ మాంసం ధర రూ.400 పలుకుతుందని అధికారుల అంచనా. ఇలా 24 కేజీల నుంచి రూ.9,600 ఆదాయం వస్తుంది. అలాగే కోడిగుడ్లు, మాంసంతో కలిపి రెండేళ్లలో కనీసం రూ.12 వేల ఆదాయం లభిస్తుంది. వచ్చిన ఆదాయంలో వైఎస్సార్ క్రాంతి పథం గ్రూపులకు 24 లేక 36 వాయిదాలలో వడ్డీ లేకుండా రుణం కింద ఇచ్చిన రూ.4800ను నెల నెలా చెల్లించగా, ఇంకా దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు లాభసాటిగా ఉంటుంది. అనంతపురం నుంచి దిగుమతి డ్వాక్రా మహిళలకు పెరటి కోళ్ల పెంపకం ద్వారా అందించే నాటుకోళ్లను అనంతపురంలోనున్న ఎస్సెల్ బ్రీడ్ కంపెనీ వారి ద్వారా దిగుమతి చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి కనీసం 10 వేల యూనిట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో పెరటి కోళ్ల పెంపకంతో పాటు పొట్టేళ్లు, మేకలను కూడా ఒక్కో కుటుంబానికి ఒక యూనిట్‌ను అందించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని పీడీ తెలిపారు. జీవనోపాధికి ఇప్పటికే పలు పథకాలు జిల్లాలో డీఆర్డీఏ సంస్థ ద్వారా వైఎస్సార్ క్రాంతి పథకం నుంచి గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళల జీవనోపాధి కోసం ఇప్పటికే పలు పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తూ వారి జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దానికోసం డీఆర్డీఏలో ఉన్న సుమారు రూ.200 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. దానిలో భాగంగా స్త్రీనిధి, ఉన్నతి (ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్), సీఐఎప్ (కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్), హెచ్‌డీఐఎఫ్ (హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్) పథకాలను అందిస్తోంది. స్త్రీనిధితో స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయల వరకు జీవనోపాధి పెంపునకు అందిస్తుంది. వాటి ద్వారా గొర్రెలు, గేదెలను పెంచుకోవచ్చు. ఉన్నతి పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే సబ్‌ప్లాన్ పథకం నుంచి అందిస్తారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా ఒక్కో వ్యక్తికి రూ.50 వేల వరకు రుణ సదుపాయం వడ్డీలేకుండానే అందిస్తారు. సీఐఎఫ్ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 వేలను ఇస్తారు. అయితే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కేటాయించాల్సి ఉంటుంది. హెచ్‌డీఐఎఫ్ ద్వారా గరిష్టంగా రూ.50 వేలను హెల్త్ యాక్టివిటీ కింద ముందుగానే ఎంపిక చేసిన 15 మండలాల్లో మాత్రమే అందిస్తున్నారు. వాటితో పాటు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ తోడు వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో 10 వేల యూనిట్ల వరకు పంపిణీకి సిద్ధం జిల్లాలోని 38 మండలాల్లో రానున్న ఏడాది లోపు 10 వేల యూనిట్లను పంపిణీ చేసేందుకు వైఎస్సార్ క్రాంతిపథం సిద్ధమవుతోంది. మొదటి విడతగా 4 వేల యూనిట్లను ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా ఇప్పటికే చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, వెలిగండ్ల, హనుమంతునిపాడు, కనిగిరి మండలాల్లో దాదాపు 600 యూనిట్లకు పైగా పంపిణీ చేశారు. 10 వేల యూనిట్ల పెరటి కోళ్లు అందించేందుకు చర్యలు జిల్లాలో పెరటి కోళ్ల పెంపకానికి సంబంధించిన 10 వేల యూనిట్లను డ్వాక్రా మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో యూనిట్ ద్వారా 9 కోడిపెట్టలు, 3 కోడిపుంజులు, 30 కేజీల దాణాలను అందిస్తున్నాం. ఈ సంవత్సరం 4 వేల యూనిట్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 6 మండలాల్లో అందించాం. త్వరలో పొట్టేళ్లు, మేకలను కూడా అందించేందుకు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాం. – బీ.బాబూరావు, పీడీ, డీఆర్డీఏ, ఒంగోలు మా కుటుంబంలోనే 4 యూనిట్లను తీసుకున్నాం జగనన్న పేద మహిళల ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకొచ్చిన పెరటి కోళ్ల పెంపకం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. మా కుటుంబంలోనే నాతో పాటు నా కుమార్తె, కోడలు వేరువేరుగా 4 యూనిట్లను తీసుకున్నాం. మా ఎస్సీ కాలనీలో మొత్తం 30 యూనిట్లను ఇచ్చారు. పెరటి కోళ్ల వలన గుడ్లు, మాంసం ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంలో జీవనోపాధి పెరగటమే కాకుండా ఖర్చులకు ఉపయోగపడుతుంది. – జంగాల లలిత కుమారి, ఆశాజ్యోతి గ్రూపు, మద్దులూరు, సంతనూతలపాడు -
కోళ్లయందు ‘కడక్‌నాథ్’ వేరయా..!
రాజాం సిటీ: చర్మం నలుపు, మాంసం నలుపు, ముక్కు, గోళ్లు, ఎముకలు.. ఆఖరకు నాలుక కూడా నలుపే. ఈ నలుపే ఇప్పుడు జిల్లా వాసుల మనసు గెలుచుకుంటోంది. కొత్త రుచుల అన్వేషణలో మాంసం ప్రియులకు దొరికిన మేలుజాతి వజ్రం కడక్‌నాథ్ కోళ్లు. దండిగా పోషకాలు, మెండుగా ఔషధ గుణాలు కలిగిన ఈ కోడి రాజాం తదితర ప్రాంతాల్లో కొక్కొరొక్కో అంటోంది. మటన్‌తో సమానంగా దీని మాంసం ధర పలుకుతున్నా.. ఫర్లేదండి అంటూ జిల్లావాసులు ఇష్టంగా లాగించేస్తున్నారు. కోళ్లయందు కడక్నాథ్లు వేరయా అనిపించుకుంటున్న ఈ బ్రీడ్ గురించి తెలుసుకుంటే.. మొత్తం నలుపే.. కడక్‌నాథ్ కోళ్లు కొత్తవేం కావు. పేపర్లు, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ఇవి బాగా తెలుసు. అయితే సిక్కోలులో లభ్యం కావడం మాత్రం కొత్తే. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో చాలా కాలంగా ఈ కోడి రుచులు పంచుతోంది. ఆయా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి. సాధారణంగా కోళ్లులో బొచ్చు రంగు రంగులుగా ఉన్నప్పటికీ మాంసం మాత్రం ఎరుపుగానే ఉంటుంది. ఈ కడక్‌నాథ్ కోళ్లు మాత్రం బొచ్చుతోపాటు చర్మం, ముక్కు, గోళ్లు, ఎముక లు, చివరికి నాలుక కూడా నలుపుగానే ఉంటుంది. ఈ కోళ్లను మాంసం కోసం పెంపకం చేపడుతుంటారు. వీటి గుడ్లు కాఫీకలర్తోపాటు కొంత పింక్ కలర్లో ఉంటాయని కోళ్ల ఫారం యజమానులు చెబుతున్నారు. పోషక విలువలు భేష్ కడక్‌నాథ్ కోళ్లలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కొవ్వు, కొలె్రస్టాల్ శాతం తక్కువగా ఉంటాయి. దీని మాంసం తింటే ఊబకాయం రాదు. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడమే కాకుండా శ్వాస సంబంధమైన ఆస్తమా వంటి రోగాలను కూడా నియంత్రిస్తుంది. పురిటి నొప్పులు తగ్గించడంలోనూ మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుందనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రయోజనాలతోపాటు మంచి రుచిగా ఉండడంతోపాటు కడక్‌నాథ్ చికెన్ ధర రూ. 800లు వరకు పలుకుతోంది. తేడా ఇదే.. కడక్‌నాథ్ కోళ్లు మంచి బరువు తూగేందుకు 8 నెలల సమయం పడుతుంది. సాధారణంగా మార్కెట్లో లభించే బ్రాయిలర్ కోళ్లు 45 రోజుల్లోనే ఒకింత బరువు పెరుగుతాయి. ఇక్కడే సాధారణ కోడికి, కడక్‌నాథ్ కోడికి తేడా ఉంది. కడక్‌నాథ్ కోళ్లలో క్వాలిటీ ఉంటుంది. వీటి పెంపకం నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. అందుకే దీని ధర అధికంగా ఉంటుందని పెంపకందారులు చెబుతున్నారు. రుచి బాగుంది... ఈ ప్రాంతంలో కడక్‌నాథ్ కోళ్లు విక్రయిస్తున్నారని తెలుసుకుని వచ్చాం. నాటు కోడి మాంసం కంటే చాలా బాగుంది. ఈ మాంసం తిన్న తర్వాత బ్రాయిలర్ కోడి మాంసం తినాలనిపించడంలేదు. కోడితోపాటు మాంసం కూడా నలుపురంగులో ఉండడంతో ఎలా ఉంటుందో అని అనుకున్నాం. కానీ వంటకం తర్వాత దాని రుచి చాలా బాగుంది. ఇప్పుడు వారంలో ఓ సారి ఈ మాంసం మాత్రమే తింటున్నాం. – ఆర్.తిరుపతిరావు, జి.నారాయణరావు, మాంసం ప్రియులు డిమాండ్ ఉంది రాజాం ప్రాంతంలో ఎక్కువగా బ్రాయిలర్ ఫారాలు మాత్రమే ఉన్నాయి. వీటికి భిన్నంగా ఏదైనా వ్యాపారం చేయాలని నాటుకోళ్లఫారం పెట్టాను. మొదటిసారిగా నా స్నేహితుల ద్వారా కడక్‌నాథ్ కోళ్లు గురించి విన్నాను చిన్న పిల్లలను కొనుగోలు చేసి పెంపకం చేపట్టాను. మా ఫారంలో ఉన్నాయని తెలుసుకుని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫారంలో నాటుకోళ్లుతోపాటు వీటిని పెంచు తున్నా. నాటుకోళ్ల కంటే కడక్‌నాథ్ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. – ఎస్.చిన్నబాబు, ఎస్ఆర్ఎన్ కోళ్లఫారం యజమాని, పొనుగుటివలస, రాజాం బలవర్ధకమైన ఆహారం ప్రస్తుతం మార్కెట్లో లభించే బ్రాయిలర్, నాటు కోళ్ల కంటే కడక్‌నాథ్ కోడి మాంసం బలవర్ధకమైన ఆహారం. మిగతా వాటి కంటే కొవ్వు శాతం తక్కువగా ఉండడంతోపాటు ప్రోటీన్ల శాతం అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మాంసకృత్తులు లభిస్తాయి. ఈ మాంసం తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఇటు వినియోగదారులకు, అటు వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. – డాక్టర్ శివ్వాల మన్మథరావు, ఏడీ, పశుసంవర్ధకశాఖ, రాజాం చదవండి: ‘నాన్నా.. నా మనసేమీ బాలేదు’ హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం -
ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..
విజయనగరం ఫోర్ట్: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతకు ఓ చక్కని ఉపాధి మార్గం పెరటికోళ్ల పెంపకం. గ్రామీణ ప్రాంత రైతులే కాదు... పట్టణాల్లోని యువతకు కూడా ఇదో ఆదాయ వనరుగా మలచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆదాయం పొందడానికి ఆస్కారం ఉండే ఈ తరహా వ్యాపకం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటి పెంపకంపై పశుసంవర్థకశాఖ జేడీ ఎం.వి.ఎ.నరసింహం పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. (చదవండి: ప్రాధేయపడినా కనికరించలేదు..) ♦రాజశ్రీ రకానికి చెందిన కోళ్లు పెంచుకుంటే అధిక ఆదాయం వస్తోంది. ఈ కోళ్లు అధిక ఉత్పాదక శక్తి కల్గి ఉండి ఏడాదికి 160 నుంచి 180 గుడ్లు పెడతాయి. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుంటాయి. ♦వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పోషణ ఖర్చు తక్కువ. సాధారణ నాటు కోళ్ల మాదిరిగానే ఉంటాయి. ♦వీటి గుడ్లు నాటు కోడి గుడ్లు కన్నా పెద్దవిగా ఉంటాయి. పుంజుల్లో ఎదుగుదల నాటుకోళ్లతో పోలిస్తే ఎక్కువగా ఉండి, అధిక బరువు కల్గి ఉంటాయి. ఇవి నాటు కోళ్లమాదిరి త్వరగా మనిషికి మచ్చిక అవుతాయి. ♦రాజశ్రీ రకానికి చెందిన కోళ్లకు పొదుగు లక్షణాలు లేకపోవడం వల్ల ఈ కోళ్ల నుంచి వచ్చే గుడ్లు నాటు కోడి కిందగానీ, ఇంక్యూబేటర్ ద్వారా గాని పొదిగించి పిల్లలు పొందవచ్చు. కోడి పిల్లల సంరక్షణ: ♦నేలపై రెండు అంగుళాల మందంలో గుండ్రంగా వరి ఊకను గానీ వేరుశనగ తొక్కును గానీ పరిచి దానిపై ఒక పొర మందంగా పేపర్లు పరచాలి. ♦దానిపై ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉండే అట్ట ముక్క లు గానీ జీఐ షీట్లు గానీ అమర్చాలి. దీనిని చిక్ గార్డ్ అంటారు. ♦7 నుంచి 8 అంగుళాల వైశాల్యం ఉండే ప్రదేశం 250 కోడి పిల్లలు ఉండేందుకు సరిపోతుంది. ♦కోడి పిల్లలకు ఉష్ణోగ్రతను అందించేందుకు ఒక గొడు గు వంటి దానిని నేలపై ఉంచి అడుగు ఎత్తులో వేలాడ దీసి దానికి ఒక కోడి పిల్లకు ఒక వాట్ చొప్పున లెక్కవేసి విద్యుత్ బల్బులు అమర్చాలి. ♦100 కోడి పిల్లలకు 100 వాట్ బల్బులు సరిపోతాయి. ♦మొదటగా పిల్లలను తెచ్చిన వెంటనే బీకాంప్లెక్స్ను కలిపిన నీటిని వేరుగా ఉంచి కోడి పిల్ల ముక్కులు దానిలో ముంచి తరువాత చిక్ గార్డ్‌లోకి వదలాలి. ♦పేపర్‌పైన నూకలాగా మరపట్టిన మొక్క జొన్నను పలుచగా చల్లాలి. మొదటి వారం అంతా 24 గంటలు బల్బు వెలుగుతూ ఉండేలా చూడాలి. రెండో వారం నుంచి ఉష్ణోగ్రత తగ్గించాలి. ♦దీనికోసం గొడుగును కొంచెం ఎత్తు పెంచడం గానీ బల్బు సామర్ధ్యం తగ్గించడం గానీ చేయాలి. ♦10వ రోజున పేపర్ తీసివేసి చిక్గార్డు సైజ్ పెంచాలి. క్రమేపీ వయస్సు పెరిగిన కొద్దీ చిక్ గార్డు వెడల్పు చేస్తూ రెండో వారం చివరిలోగాని మూడవ వారంలో పూర్తిగా తీసి వేయవచ్చు. అనంతరం చిక్ గార్డు నుంచి బయటకు తీసి స్వేచ్ఛగా మెల్లగా పెరటిలోకి అలవాటు చేయాలి. ♦పెరటి కోళ్లకు దాణా కోనాల్సిన అవసరం ఉండదు. ఇవి కీటకాలు, గింజలు లేత గడ్డి ఇంట్లో ఉండే వ్యర్ధ పదార్థాలను తిని బతుకుతాయి. ♦పెరట్లో దొరికే ఆహారాన్ని బట్టి నూకలు మొక్కజొన్న తవుడుతో తయారు చేసిన సమీకృత దాణాను కూడా కొద్దిగా అందించాలి. ♦ఈ రకానికి చెందిన కోళ్లు 6 నెలల వయస్సు వచ్చేసరికి గుడ్డు పెట్టడం మొదలు పెడుతుంది. ఈ దశలో కాంతిని అందించడం అనేది ముఖ్యమైన చర్య. దీని కోసం గృహ వసతి అవసరం. ♦ఎంత కాంతి అందించాలి అనేది కాలాలను, వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. శీతా కాలం అయితే రాత్రి సమయాల్లో కాంతిని నాలుగు, ఐదు గంటలు పాటు, వేసవి కాలంలో రెండునుంచి 3 గంటలపాటు సూర్యాస్తమయం తరువాత అందించాలి. -
4 నుంచి ‘చో’ సహజ సాగు పద్ధతిలో కోళ్ల పెంపకంపై శిక్షణ
దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యూ సహజ సాగు పద్ధతిలో నాటు కోళ్లు, బ్రాయిలర్ కోళ్లను రసాయనాలు వాడకుండా, దుర్వాసన రాకుండా, సొంతంగా తయారు చేసుకునే దాణాతో పెంచే పద్ధతులపై అక్టోబర్ 4 నుంచి 25 రోజుల పాటు యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షిండే శివశంకర్ తెలిపారు. సహజ పద్ధతిలో కోళ్ల పెంపకంతోపాటు ప్రాసెసింగ్, మార్కెటింగ్ నైపుణ్యాలపై కూడా ఆచరణాత్మక శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్థులు కనీసం పదో తరగతి చదివి, 18 సంవత్సరాలు నిండాలి. మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల వారు తమ వివరాలను ఈనెల 23వ తేదీలోగా 81210 08002, 70133 09949 నంబర్లకు వాట్సప్ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపాలని శివశంకర్ కోరారు. వ్యవసాయ డిప్లొమా చదివిన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. -
మోడల్ టెర్రస్ కిచెన్ గార్డెన్!
మేడ మీద నాలుగు పూల మొక్కలు పెంచుకునే ఒక సాధారణ గృహిణి.. ఏకంగా ముప్పై రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు నాటు కోళ్లను సైతం సునాయాసంగా సాగు చేసుకునే సేంద్రియ ఇంటిపంటల నిపుణురాలిగా మారిపోయారు! ‘సాక్షి’ ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ ప్రచారోద్యమంతోపాటు ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్ ఆమెకు ప్రేరణ, మార్గదర్శి కావటం విశేషం!! ఆమె పేరు వి. ఎం. నళిని, మెహదీపట్నం(హైదరాబాద్). తమ రెండంతస్తుల మేడ పైన 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తిస్థాయి ఇంటిపంటల జీవవైవిధ్య క్షేత్రాన్ని నిర్మించుకున్నారు. బాల్యం నుంచీ పూల మొక్కలపై మక్కువ కలిగిన నళిని.. మెట్టినింటి మేడ మీద పూల మొక్కలను పెంచుకుంటూ ఉండేవారు. ఆ దశలో సాక్షిలో సేంద్రియ ఇంటిపంట కాలమ్ గురించి, ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్ గురించి తెలుసుకొని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సాగుపై దృష్టిపెట్టారు. ఇనుప స్టాండ్లపై 300 గ్రోబాగ్స్, కుండీలు.. తండ్రి న్యాయవాది, భర్త ఇంజనీరు. వ్యవసాయ నేపథ్యం లేకపోయినప్పటికీ, కంపోస్టు నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఒక్కో విషయం నేర్చుకున్నానని నళిని తెలిపారు. ఇంటిపంట మిత్రబృందం అడపా దడపా కలుసుకొని విత్తనాలు, మొక్కలు పంచుకోవడం, అనుభవాలు కలబోసుకోవడం ద్వారా ఆమె తన గార్డెన్‌ను పరిపూర్ణమైన మోడల్ టెర్రస్ కిచెన్ గార్డెన్‌గా ఆహ్లాదకరంగా, ముచ్చటగా తీర్చిదిద్దుకోవడం విశేషం. చిన్నా పెద్దా అన్నీ కలిపి 300కు పైగా సిల్పాలిన్ గ్రోబాగ్స్, టబ్‌లలో 22 రకాల పండ్ల మొక్కలు, 10 రకాల ఆకుకూరలు, 8 రకాల కూరగాయలు, ఐదారు రకాల తీగ జాతి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇనుప స్టాండ్లపైన గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేయడంతో.. టెర్రస్‌పై పడిన నీరు, ఆకులు అలములను సులభంగా శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉంది. మూడు వైపులా కొంత భాగంలో షేడ్‌నెట్ వేశారు. నీడను ఇష్టపడే మొక్కలు, తీగజాతి పాదులను దీనికింద పెంచుతున్నారు. గత ఏడాది నుంచి రెండు గూళ్లలో కింద నాటు కోళ్లను, పైన లవ్‌బర్డ్స్‌ను పెంచుతున్నారు. అరుదైన జాతులు.. అనేక రకాలు.. ఒకే జాతి పండ్లు/కూరగాయల్లో అనేక రకాల మొక్కలను నళిని శ్రద్ధగా సేకరించి సాగు చేస్తున్నారు. వంగలో ఏడు రకాలు.. ముల్లు వంగ(గుండ్రం/పొడవు), వైట్ (రౌండ్/లాంగ్), వెంగోరి బ్రింజాల్, సన్న వంకాయ, ముసుగు(తొడిమతోపాటు ఉండే పొర కాయను చాలా వరకు కప్పి ఉంచుతుంది) వంకాయ, భర్తా బేంగన్ రకాలున్నాయి. తమ్మ (చమ్మ) కాయల తీగతోపాటు చెట్టు కూడా ఉంది. ‘365 డేస్’ చిక్కుడు ఉంది.సాధారణ చిక్కుడు కన్నా 2 నెలలు ముందు నుంచి కాపునివ్వడంతోపాటు.. సాధారణ చిక్కుడు కాపు ముగిసిన తర్వాత నెల అదనంగా చిక్కుడు కాయలను అందిస్తుంది. ఇప్పటికే రెండు నెలలుగా కాస్తున్నదని నళిని తెలిపారు. పొట్టి పొట్ల, చిట్టి కాకర, రెగ్యులర్ కాకర, టమాటా, తెల్లకాకర, ముల్లంగి, రెడ్ బెండ, దొండ పాదులున్నాయి. కాప్సికం గ్రీన్, రెడ్, ఎల్లో రకాలున్నాయి. మిర్చిలో రౌండ్, బ్లాక్, ఉజ్వల(గుత్తులుగా ఆకాశం వైపు తిరిగి ఉండే) రకాలున్నాయి. టమాటా ఎల్లో/రెడ్/బ్లాక్/మదనపల్లి/బెంగళూరు రకాలున్నాయి. మలేషియన్ జామ, బ్లాక్ గాల్, అలహాబాద్ సఫేద్,లక్నో 49 రకాల జామ మొక్కలున్నాయి. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ బెర్, సీతాఫలం, బొప్పాయి, మల్బరీ, ఫాల్స ఫ్రూట్, అరటి, ఆరెంజ్, సీడ్నిమ్మ, సీడ్ లెస్ నిమ్మ, అంజీర, డ్రాగన్ ఫ్రూట్, పునాస మామిడి, వాటర్ ఆపిల్ (వైట్/పింక్), ఆల్‌బకర (3 ఏళ్ల నుంచీ కాపు రాలేదు), చైనీస్ లెమన్, లక్ష్మణ ఫలం మొక్కలున్నాయి. చేమ ఆకు, మునగాకు, పాలకూర, చుక్కకూర, గోంగూర, పెరుగుతోటకూర, ఎర్ర తోటకూర, సిలోన్ బచ్చలి, ఎర్ర బచ్చలి, గ్రీన్ బచ్చలి తదితర ఆకుకూరలున్నాయి. కూరగాయలు, పండ్లు 70% మావే ఒకే రకం కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఎన్ని ఉన్నా.. వాటిని పక్క పక్కనే పెట్టకుండా వేర్వేరు చోట్ల పెట్టడం ద్వారా చీడపీడల బెడదను చాలా వరకు నివారించవచ్చునని నళిని తెలిపారు. ఒకే కుండీలో కొన్ని రకాల మొక్కలను కలిపి పెంచుతున్నారు. వంగ+మిర్చి, టమాటా+తులసి+ఉల్లి, మామిడి+టమాట+ముల్లంగి.. కలిపి పెంచుతున్నారు. పురుగుల రాకను గుర్తించి తొలిదశలోనే చేతులతో తీసేయడం ముఖ్యమైన విషయమని నళిని అంటారు. ఆవ, బంతి మొక్కలను గార్డెన్లో అక్కడక్కడా పెంచుతున్నారు. పురుగులు తొలుత ఈ రెండు మొక్కలను ఆశిస్తాయి. కనిపించిన రోజే పురుగులను ఏరి నాశనం చేస్తామన్నారు. కాబట్టి పురుగుల బెడద మొక్కలకు ఉండదన్నారు. టమాటా మొక్కను బక్కెట్‌కు అడుగున బెజ్జం పెట్టి నాటి.. తల్లకిందులుగా పెంచుతున్నారు. టమాటాకు అలా పెరగడమే ఇష్టమని నళిని అంటారు. తమ ఇంట్లో ఐదుగురు పెద్దవాళ్లుంటామని, కిచెన్ గార్డెన్ నుంచి పండ్లు, కూరగాయలను 70 శాతం వరకు సమకూర్చుకుంటున్నామని ఆమె సంతృప్తిగా చెప్పారు. కంపోస్టు.. జీవామృతం.. కోళ్ల ఎరువు, పశువుల ఎరువు, గొర్రెల ఎరువుకు ఎండు ఆకులు, అలములతోపాటు వంటింటి వ్యర్థాలు కలిపి స్వయంగా తయారు చేసుకున్న కంపోస్టుతోపాటు.. స్వయంగా తయారు చేసుకునే జీవామృతాన్ని 15 రోజులకోసారి మొక్కలకు ఇస్తూ నళిని చక్కని దిగుబడులు సాధిస్తున్నారు. గ్రాఫ్టెడ్ పండ్ల మొక్కలను నాటడం, ఒకసారి తెచ్చిన కూరగాయ/ఆకుకూర మొక్కల నుంచి విత్తనాలను స్వయంగా తయారు చేసుకొని వాడుకోవడం ఆమె ప్రత్యేకత. ఇంటిపంట ఫేస్బుక్ గ్రూప్ నుంచే తాను అన్ని విషయాలూ నేర్చుకున్నానంటున్న నళిని.. గ్రూప్‌లో ఏదైనా అంశంపై సాధికారంగా, శాస్త్రీయంగా సమాధానాలు ఇస్తూ ఇతరులకు లోతైన అవగాహన కల్పిస్తుండటం ప్రశంసనీయం. నగరంలో పుట్టి పెరుగుతూ.. గడప దాటెళ్లే పని లేకుండా.. రోజుకు కేవలం ఓ గంట సమయాన్ని కేటాయించడం ద్వారా తన కుటుంబానికి కావాల్సిన వైవిధ్యభరితమైన, అమూల్యమైన సేంద్రియ పౌష్టికాహారాన్ని సమర్థవంతంగా సమకూర్చుకుంటున్న ఆదర్శప్రాయురాలైన గృహిణి నళిని గారికి ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది! ముసుగు వంగ, పునాస మామిడి, టమాటో, చెట్టు తమ్మ (చెమ్మ) ఉజ్వల మిరప, నాటు కోళ్లు, ఆపిల్ బెర్ -
నాటు కోళ్ల హేచరీ!
మాంసాహారుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ నాటు కోళ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతూ వస్తున్నది. అయితే, షెడ్లలో కోళ్లను ఉంచి పెంచే పద్ధతిలో ఖర్చులు అధికమైన నేపథ్యంలో లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే, ఉన్నత విద్యావంతులైన అరుణ్ క్రాంతి, నవత దంపతులు ఉద్యోగాలకు వెళ్లకుండా వినూత్నంగా ఆలోచించి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. వినూత్నంగా మొలక గడ్డినే మేతగా వేస్తున్నారు. అంతేకాదు, స్వల్ప ఖర్చుతోనే నాటుకోడి పిల్లల హేచరీని నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు 10 వేల నాటు కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఖర్చులు బాగా తగ్గించుకుంటూ అధిక లాభాలు పొందుతున్నారు. తమ ప్రాంతంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచారు. వినూత్నమైన ఆలోచనలు, మనోబలంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి నిదర్శనం ఈ యువ జంట. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కాపరబోయిన అరుణ్ క్రాంతి బీటెక్, ఆయన భార్య నవత ఎంబీఏ చదివారు. ఇద్దరికీ కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ, వ్యవసాయం, అనుబంధ రంగాలపై అభిరుచితో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల సమీపంలోని తమ రెండెకరాల భూమిలో చుట్టూ ఇనుప మెష్ వేసి, ఒక షెడ్డు వేసుకొని, ఆరుబయటే తిరుగాడే పద్ధతిలో నాటు కోళ్లను పెంచుతున్నారు. తొలుత, 2005 నుండి 2012 వరకు ఈము పక్షుల పెంపకాన్ని చేపట్టి, మార్కెటింగ్ సమస్యల వల్ల భారీ నష్టాలను చవిచూశారు. తదనంతరం కూడా ఉద్యోగాల వైపు చూడకుండా మనోధైర్యంతో వినూత్నంగా నాటు కోళ్ల పెంపకంతోపాటు హేచరీపై దృష్టి పెట్టి నిలదొక్కుకున్నారు. నెలకు రూ. లక్ష ఆదాయం పొందేలా ఎదిగారు. 800 నాటు కోళ్లు.. 10 వేల కోడి పిల్లలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కోళ్ల ఫారాలను స్వయంగా పరిశీలించారు. నాటుకోళ్లను షెడ్లలో పెంచడం వల్ల వ్యాధులు వస్తున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువై నష్టపోతున్నట్లు గ్రహించారు. షెడ్లలో పెంచడం వల్ల దాణా ఖర్చు ఎక్కువ అవుతుండటంతో పెద్దగా గిట్టుబాటు కావడం లేదని గుర్తించి, నాటు కోళ్లను వినూత్నంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. తొలుత 100 గుడ్లతో కోళ్ల పెంపకం చేపట్టగా, నేడు 800 కోళ్లతో పాటు, నెలకు 5–10 వేల కోడి పిల్లలను అమ్మే స్థాయికి ఎదిగారు. కృత్రిమంగా గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్‌ను కొనుగోలు చేయకుండా.. అందుబాటులో ఉన్న వస్తువులతో తయారు చేసుకున్నారు. 21 రోజుల్లో పిల్లలు బయటకు వస్తాయి. మరికొద్ది రోజుల పాటు లైట్ల కింద అతి జాగ్రత్తగా పెంచిన తర్వాత, కోడి పిల్లలను బయటకు వదులుతారు. ట్రేలలో పెంచే మొలక గడ్డి, ఆకుకూరలు, అజొల్లా.. ఆరు బయటకు వచ్చిన పిల్లలకు సమతుల పౌష్టికాహారంగా హైడ్రోపోనిక్ పద్ధతిలో ట్రేలలో పెంచే మొక్కజొన్నగడ్డి, జొన్న గడ్డి, గోధుమ గడ్డితోపాటు.. ఆరుబయట పొలంలో పాలకూర, ఆకుకూర, షేడ్‌నెట్ హౌస్‌లో అజొల్లాలను సొంతంగా పెంచి అందిస్తున్నారు. డక్వీడ్తోపాటు మినరల్స్ కూడా ఇస్తుంటారు. సాగు చేసిన తోటల్లో తిరుగుతూ కోళ్లు తమకు ఇష్టమైనవి తింటుంటాయి. కేవలం సాయంత్రం సమయాల్లో షెడ్లలోకి పిలిచేందుకే.. మొక్కజొన్న, సోయాబీన్, నూకలు, వరి తవుడును కలిపిన దాణా వేస్తుంటారు. సాధారణంగా పెరటి కోళ్లు పెంచే వారు పెట్టే ఖర్చులో 20% ఖర్చుతోనే వీరు మంచి ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం. గ్రామాల నుంచి నాటు గుడ్ల సేకరణ నాటు కోడి పిల్లలకు డిమాండ్ రావడంతో, ప్రతి వారానికి జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుండి 3–4 వేల గుడ్లను సేకరిస్తారు. వీటితో పాటు, తన ఫామ్‌లో కోళ్ల నుండి వచ్చిన గుడ్లను ముందుగా ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తారు. తర్వాత, 6 గంటల పాటు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, వైరస్ లేకుండా ఉండేందుకు ప్యూమిగేషన్ చేస్తారు. ఎందుకంటే, 21 రోజుల పాటు ఎలాంటి వైరస్ గుడ్లకు సోకకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్వయంగా తయారు చేసిన గుడ్లను ఉంచే పరికరంలో లైట్ల వెలుతురులో గుడ్లను పెడుతుంటారు. ఇలా.. దాదాపు ఆరు గుడ్ల నుండి పిల్లలు వచ్చే పరికరాలు ఉన్నాయి. దాదాపు నెలకు 5–10 వేల నాటు కోడి పిల్లలు అందిస్తున్నాడు. 80 రోజుల్లో కిలో–కిలోన్నర బరువు నాటు కోడి పిల్లలు కొనుగోలు చేసిన వ్యక్తులకు వీటిని ఏ రీతిన పెంచితే లాభాలు వస్తాయో కూడా వీరు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోడి పిల్లను రూ. 35 పెట్టి కొనుగోలు చేసి తీసుకెళ్లిన వారు.. 80 రోజుల్లో మార్కెట్లో అమ్మే వరకు ఏ రోజు ఏమి చేయాలో షెడ్యూల్ ఇస్తుంటారు. కోడి కిలో నుండి కిలోన్నర బరువు పెరగ్గానే అమ్మితే, కిలో రూ. 200 పలుకుతోంది. నాటు కోళ్లకు డిమాండ్ బాగా ఉండటంతో, వీరి నాటు కోళ్ల ఫారాన్ని ప్రతి రోజూ చాలా మంది చూసి వెళ్తుంటారు. ఓటమే రేపటి విజయానికి నాంది! ఏదో సాధించాలన్న తపనతోనే కోళ్ల పెంపకం చేపట్టాము. ఈము కోళ్ల పెంపకంతో చేతులు కాల్చుకున్నాం. విదేశీ కోళ్ల సాగులో గుణపాఠం నేర్చుకొని అత్యంత శ్రద్ధతో నాటు కోళ్లు, పిల్లల పెంపకం చేపట్టాం. ఓటమే రేపటి విజయానికి నాంది అనడానికి మేమే నిదర్శనం. ప్రతి రోజూ కోళ్ల ఫారానికి వచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. నిశితంగా గమనిస్తూ ఉంటే ఏ కోడి గుడ్డు పెడుతుందో, ఏ కోడి పెట్టడం లేదో మాకు తెలిసిపోతుంది. కోళ్లకు వివిధ రకాల గడ్డిని ట్రేలలో పెంచుతుంటాం. ఆరోగ్యంగా ఆరుబయట తిరుగాడుతూ పెరుగుతున్న నాటు కోళ్లను చూస్తే తృప్తిగా ఉంటుంది. – నవత, అరుణ్ క్రాంతి (90005 67121), జగిత్యాల కృత్రిమంగా గుడ్లను పొదిగే ఏర్పాటు విద్యుత్ దీపాల వెలుగులో నాటు కోడి పిల్లలు ట్రేలలో పెరుగుతున్న మొలక గడ్డి మొక్కజొన్న మొలక గడ్డిని తింటున్న కోళ్లు – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
నల్ల కోళ్లు నాలుగు విధాల మేలు!
‘నలుపు రంగు’.. అయితేనేం? మాంసం రుచి అదరహో! ప్రొటీన్ల శాతం కూడా ఎక్కువే.. కొవ్వు తక్కువ. ఇంకెన్నో సుగుణాలు కల్గిన ‘కడక్‌నాథ్’ అనే నల్ల కోళ్ల పెంపకంపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆసక్తి పెరుగుతోంది. రైతులు వ్యవసాయానికి అనుబంధంగా అదనపు ఆదాయ వనరుగా ఈ కోళ్ల పెంపకం చేపడుతున్నారు. హైదరాబాద్ నగర శివారు ఫాం హౌజ్‌లలో ‘కడక్ నాథ్’ కోళ్ల సందడి వినిపిస్తోంది. స్థానిక పెరటి కోళ్ల మాదిరిగానే.. వీటి పోషణకు పెద్దగా ఖర్చు లేకుండా మంచి ఆదాయం పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పంట పొలాల వద్ద ఈ కోళ్ల పోషణ చేపడితే.. పంటలకు ఆశించే పురుగులను తిని పంట ఎదుగుదలకు దోహదపడతాయి. కోళ్ల విసర్జితాలు పంటకు మంచి ఎరువు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ కోళ్ల పెంపకంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన ఝూబువా, అలీరాజ్‌పూర్ పరిసరాల్లో భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. ఐరన్ శాతం మామూలు కోళ్ల కంటే పది శాతం ఎక్కువ అని చెబుతున్నారు. కిలో మాంసం రూ.700 నుంచి రూ.వెయ్యి, గుడ్డు ధర రూ.40–50 పైనే. గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. పిల్లలు నీలం, నలుపూ తెలుపూ చారలతో ఉండి, పెరిగే కొద్దీ నలుపు రంగులోకి మారుతాయి. శంషాబాద్ రూరల్ ప్రాంతంలో సురేశ్ అనే యువ రైతు సేంద్రియ పద్ధతిలో ఈ కోళ్లను పెంచి, మాంసం అమ్ముతున్నారు. వీటి గుడ్లను హేచరీలో పొదగేసి ఒక్కో పిల్లను రూ.80లకు అమ్ముతున్నారు. కడక్‌నాథ్ కోళ్ల పోషణ చాలా సులువని, 5 నెలల్లో అమ్మకానికి తగినంత పెరుగుతాయని సురేశ్(99599 52345) చెబుతున్నారు. సురేశ్ – బుర్గు ప్రభాకర్‌రెడ్డి, శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్), రంగారెడ్డి జిల్లా -
పౌల్ట్రీ ఫార్మింగ్
ఏటా పది నుంచి పదిహేను శాతం వృద్ధి నమోదు చేసుకుంటున్న రంగం పౌల్ట్రీ. ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు ఆశాజనకంగా ఉండటం, ఆహార అలవాట్లు మారడం వంటి కారణాలు కూడా దేశంలో పౌల్ట్రీ రంగ విస్తరణకు దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. అవకాశాలు.. విభాగాలు: పౌల్ట్రీ రంగంలో ప్రధానంగా న్యూట్రిషన్, బ్రీడింగ్, హేచరీ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ అండ్ ప్రాసెసింగ్, హెల్త్ అండ్ బయో సెక్యూరిటీ, ఎకనామిక్ అండ్ ప్రొడక్ట్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఉపాధి సొంతం చేసుకోవచ్చు. ఉపాధి వేదికలు: బోధన, పరిశోధన, పౌల్ట్రీ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా ప్రవేశించవచ్చు. ప్రభుత్వ విభాగంలో వెటర్నరీ ఆఫీసర్, లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ హోదాలు కూడా పొందవచ్చు. స్వయం ఉపాధి: పౌల్ట్రీ రంగంలో సర్టిఫికెట్ పొందిన వారు సొంత ప్రాక్టీస్ కూడా నిర్వహించవచ్చు. స్పెషలైజేషన్ సబ్జెక్టుల ఆధారంగా పౌల్ట్రీ ఫార్మ్స్‌కు సలహాదారులుగా వ్యవహరించవచ్చు. అంతేకాకుండా పీజీ పూర్తి చేసుకుంటే బ్రాయిలర్ పౌల్ట్రీ, ఇఎంయు ఫార్మింగ్ విభాగాల్లో సొంత యూనిట్లు కూడా నెలకొల్పవచ్చు. దీనికోసం నాబార్డ్ రుణం కూడా లభిస్తుంది. కోర్సులు: పౌల్ట్రీ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారు ఐదేళ్ల వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ కోర్సు పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎంవీఎస్సీ చేస్తే మరిన్ని అవకాశాలు లభిస్తాయి. బీవీఎస్సీ, ఎంవీఎస్సీ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స అండ్ యానిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్), మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స (ఎంవీఎస్సీ) వెబ్సైట్: www.svvu.edu.in డిప్లొమా కోర్సులు: పౌల్ట్రీ విభాగానికి సంబంధించి పలు డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (వ్యవధి: ఆరు నెలలు; అర్హత: ఎనిమిదో తరగతి) వెబ్సైట్: www.ignou.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్: www.nios.ac.in అన్నామలై యూనివర్సిటీ వెబ్సైట్: annamalaiuniversity.ac.in