Power Grid Corporation of India
-
పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కి చెందిన నార్తర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్–1.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ ఇంజనీర్, సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 97 ► పోస్టుల వివరాలు: ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)–30, ఫీల్డ్ ఇంజనీర్(సివిల్)–08, ఫీల్డ్ సూపర్వైజర్(ఎలక్ట్రికల్)–47, ఫీల్డ్ సూపర్వైజర్(సివిల్)–12. ► ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్): అర్హత: కనీసం 55శాతం మార్కులతో ఎలక్ట్రికల్ విభాగంలో ఫుల్‌టైం బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి. వయసు: 09.05.2021 నాటికి 29 ఏళ్లు మించకూడదు. ► ఫీల్డ్ ఇంజనీర్(సివిల్): అర్హత: కనీసం 55శాతం మార్కులతో సివిల్ విభాగంలో ఫుల్‌టైం బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి. వయసు: 09.05.2021 నాటికి 29 ఏళ్లు మించకూడదు. ►ఫీల్డ్ సూపర్వైజర్(ఎలక్ట్రికల్): అర్హత: కనీసం 55శాతం మార్కులతో సివిల్ సబ్జెక్టులో ఫుల్‌టైం ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 09.05.2021 నాటికి 29 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. పరీక్షా విధానం ► ఫీల్డ్ ఇంజనీర్: స్క్రీనింగ్ టెస్ట్‌ను 75 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం ఒక గంట. పార్ట్–1లో ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 50 మార్కులు, ఆప్టిట్యూడ్ నుంచి 25 మార్కులు వస్తాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఈ రాతపరీక్షలో అర్హత సాధించిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ► ఫీల్డ్ సూపర్వైజర్: దీన్ని 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 50 మార్కులకు టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, 25 మార్కులకు ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.05.2021 ► వెబ్సైట్: http://www.powergrid.in ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో 38 టెక్నికల్ ఉద్యోగాలు -
అక్కడ పరిహారం.. ఇక్కడ పరిహాసం
రైతులపై తొలుత రౌడీయిజం చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఇప్పుడు పరిహారం పేరుతో పరిహసిస్తోంది. నెల్లూరు, గుంటూరు జిల్లాలో ఒక్కో హైటెన్షన్ టవర్ నిర్మాణానికి రైతుకు రూ.3.50 లక్షల పరిహారం అందించిన పీసీఐ.. మన జిల్లాలో మాత్రం రూ.50 వేలకు మించి ఇచ్చేది లేదని మొండికేస్తోంది. పీసీఐ వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. గంగాధరనెల్లూరు మండలంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ నిర్మాణాన్ని బుధవారం రైతులు అడ్డుకున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: పీసీఐ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ(ట్రాన్స్మిషన్ సిస్టమ్)ను ఏర్పాటుచేస్తోన్న విషయం విదితమే. ప్రస్తుతం తమిళనాడులోని తిరువల్లం నుంచి కర్నూలు వరకూ 765 కేవీ హెటైన్షన్ లైన్.. కృష్ణపట్నం నుంచి నెల్లూరు మీదుగా తిరుపతి వరకూ 400 కేవీ హైటెన్షన్ లైన్‌ను పీసీఐ నిర్మిస్తోంది. ఈ పనులను ప్రత్యేక అనుమతి ఉన్న కాంట్రాక్టర్లకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అప్పగించింది. తమిళనాడులోని తిరువల్లం నుంచి చిత్తూరు, కడప, కర్నూలు వరకూ 385 కి.మీల మేర 765 కేవీ హైటెన్షన్ లైను నిర్మించడానికి ఒక్క మన జిల్లాలోనే 11 వేల ఎకరాల భూమిని సేకరించాలి. కృష్ణపట్నం నుంచి నెల్లూరు మీదుగా శ్రీకాళహస్తి వరకూ నిర్మించే 400 కేవీ లైను చిత్తూరు జిల్లాలో 65 కిమీల మేర నిర్మించడానికి 6,500 ఎకరాలు సేకరించాలి. కానీ.. పీసీఐ ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించకుండానే హైటెన్షన్ లైన్ల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ అన్యాయంపై నిలదీసిన రైతులను 1885 టెలీగ్రాఫిక్ చట్టాన్ని బూచిగా చూపి.. పోలీసులను ఉసిగొలిపి బెదిరిస్తూ రౌడీయిజానికి పాల్పడింది. కానీ.. నెల్లూరు, గుంటూరు జిల్లాలో 400 కేవీ విద్యుత్ హైటెన్షన్ లైన్ నిర్మించిన సమయంలో ఒక్కో టవర్ నిర్మాణానికి అవసరమైన భూమికి రూ.3.50 లక్షల చొప్పున (భూమికి రూ.2.60 లక్షలు, నష్టపోయిన పంటకు రూ.90 వేలు) పరిహారం అందించారు. ఇదే అంశాన్ని అక్టోబర్ 20న ‘పరిహారం చెల్లించకనే విద్యుత్ లైన్ల నిర్మాణం’ కథనం ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది. రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మాంగాటి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో నిర్వాసితులైన రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని ఉద్యమించారు. వీటిపై స్పందించిన కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నిర్వాసితులైన రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ పీసీఐకి అక్టోబర్ 21న నోటీసులు జారీచేశారు. ఉద్యమిస్తోన్న రైతులు.. కలెక్టర్ నియమించే కమిటీతో నిమత్తం లేకుండా పీసీఐ నిర్ణయించిన పరిహారంపై రైతులు మండిపడుతున్నారు. నెల్లూరు, గుంటూరు జిల్లాలో 400 కేవీ టవర్లకే ఒక్కోదానికి రూ.3.50 లక్షల వంతున పరిహారం అందించిన నేపథ్యంలో.. 765 కేవీ టవ ర్ల నిర్మాణానికి రూ.ఏడు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం మామిడి, కొబ్బరి వంటి చెట్లకు మాత్రమే రూ.6,500 చొప్పున పీసీఐ పరిహారం చెల్లిస్తోంది. ఆ పరిహారంపై కూడా రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పీసీఐ నిర్ణయించిన పరిహారం ఒక్క పంటకే ఒక్కో చెట్టు నుంచి వస్తుందని రైతులు చెబుతున్నారు. గుజరాత్లో కొబ్బరి, మామిడి వంటి వృక్షాలకు రూ.35 వేల చొప్పున పీసీఐ పరిహారం చెల్లించిందని గుర్తుచేస్తున్నారు. జిల్లాలో సైతం అదే తరహాలో పరిహారం చెల్లిస్తేనే విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అంగీకరిస్తామని స్పష్టీకరిస్తున్నారు. కమిటీ వేయకుండానే.. 2006లో సవరించిన టెలీగ్రాఫిక్ చట్టం ప్రకారం 400 కేవీ, 765 కేవీ అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో విద్యుత్ హైటెన్షన్ లైన్లు నిర్మించే సమయంలో.. ఆ టవర్ల నిర్మాణం వల్ల భూములు కోల్పోయే రైతులను పీసీఐ సంప్రదించాలని నిబంధన విధించారు. ఆ చట్టం ప్రకారం పీసీఐ- రైతులకూ.. కలెక్టర్‌కూ నోటీసులు జారీచేయాలి. ఆ నోటీసులు అందాక జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్.. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులతో ఓ కమిటీని వేయాలి. ఆ కమిటీ రైతులతో చర్చించి భూములకు, పంట లకూ పరిహారాన్ని నిర్ణయిస్తారు. ఆ మేరకు నిర్వాసితులకు, రైతులకు పరిహారం చెల్లించిన తర్వాతనే హైటెన్షన్ విద్యుత్ లైన్లను నిర్మించాలి. కానీ.. పీసీఐ నిబంధనలు అతిక్రమించడంతో అక్టోబర్ 21న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నోటీసులు జారీచేశారు. పరిహారం నిర్ణయించి.. రైతులకు అందించే వరకూ పనులు ఆపేయాలని ఆదేశించా రు. కానీ కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ పీసీఐ రంగంలోకి దిగి టవ ర్ల నిర్మాణానికి పూనుకుంది. కలెక్టర్ కమిటీ వేయకుండానే ఒక్కో టవర్‌కు రూ.50 వేల వంతున పరిహారం చెల్లిస్తామని పీసీఐ ప్రతిపాదిస్తున్నా రెవెన్యూ వర్గాలు అభ్యంతరం చెప్పకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఉద్యోగాలు
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్: 10 అర్హతలు:బీఎస్సీ (ఎంపీసీ) లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. స్టోర్ అసిస్టెంట్ (గ్రేడ్ - 2): 1 అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం. వయసు:30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 25 వెబ్సైట్:www.nationalfertilizers.com సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఎలక్ట్రికల్-2, ఎలక్ట్రానిక్స్-1, కంప్యూటర్ సైన్స్-1, జియాలజీ-1, ఇన్స్ట్రుమెంటేషన్-2, సివిల్ ఇంజనీరింగ్-3, కెమిస్ట్రీ-5. అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: అర్హత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 25 వెబ్సైట్: http://cbri.res.in/ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్. అర్హత: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జనవరి 15- ఫిబ్రవరి 27 వెబ్సైట్: www.powergridindia.com -
ఉద్యోగాలు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విజిలెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విజిలెన్స్ ఆఫీసర్: 2 అర్హతలు: ద్వితీయ శ్రేణిలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం. సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: సెప్టెంబరు 20 నాటికి 38 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబరు 10 వెబ్సైట్: www.powergridindia.com ఏపీ ఈస్టర్న్ పవర్ విశాఖపట్నంలోని ఏపీ ఈస్టర్న్ పవర్, జనరల్ మేనేజర్ (ఐటీ) పోస్టు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: బీఈ/ బీటెక్ లేదా ఎంసీఏ ఉండాలి. సంబంధిత రంగంలో పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 9 వెబ్సైట్: www.apeasternpower.com రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ న్యూఢిల్లీలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీర్: 31 అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. మేనేజర్ (రాజభాష): 1 అర్హతలు: ప్రథమ శ్రేణిలో హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి. డిగ్రీలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. 12 ఏళ్ల అనుభవం అవసరం. వయసు: 40 ఏళ్లకు మించకూడదు. అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్/ హిందీ ట్రాన్స్‌లేటర్: 1 అర్హతలు: ప్రథమ శ్రేణిలో హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు డిగ్రీలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఆఫీసర్ (సీసీ/ పీఆర్): 1 అర్హతలు: ఎంబీఏ/ పీజీ లేదా కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో రెండేళ్ల డిప్లొమా ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. చివరి తేది: సెప్టెంబరు 15 వెబ్సైట్: www.epostbag.com