పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి  | Power Grid Corporation of India Recruitment 2021: Field Engineer, Supervisor Posts | Sakshi
Sakshi News home page

పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

Published Mon, May 3 2021 2:00 PM | Last Updated on Mon, May 3 2021 2:03 PM

Power Grid Corporation of India Recruitment 2021: Field Engineer, Supervisor Posts - Sakshi

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కి చెందిన నార్తర్న్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌–1.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ ఇంజనీర్, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 97
► పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–30, ఫీల్డ్‌ ఇంజనీర్‌(సివిల్‌)–08, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌)–47, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(సివిల్‌)–12.
► ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌): అర్హత: కనీసం 55శాతం మార్కులతో ఎలక్ట్రికల్‌ విభాగంలో ఫుల్‌టైం బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి. వయసు: 09.05.2021 నాటికి 29 ఏళ్లు మించకూడదు. 

► ఫీల్డ్‌ ఇంజనీర్‌(సివిల్‌): అర్హత: కనీసం 55శాతం మార్కులతో సివిల్‌ విభాగంలో ఫుల్‌టైం బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి. వయసు: 09.05.2021 నాటికి 29 ఏళ్లు మించకూడదు. 

►ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌): అర్హత: కనీసం 55శాతం మార్కులతో సివిల్‌ సబ్జెక్టులో ఫుల్‌టైం ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 09.05.2021 నాటికి 29 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం
షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం
► ఫీల్డ్‌ ఇంజనీర్‌: స్క్రీనింగ్‌ టెస్ట్‌ను 75 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం ఒక గంట. పార్ట్‌–1లో ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 50 మార్కులు, ఆప్టిట్యూడ్‌ నుంచి 25 మార్కులు వస్తాయి. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. ఈ రాతపరీక్షలో అర్హత సాధించిన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.

► ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌: దీన్ని 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 50 మార్కులకు టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్, 25 మార్కులకు ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.05.2021
► వెబ్‌సైట్‌: http://www.powergrid.in

ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో 38 టెక్నికల్‌ ఉద్యోగాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement