PowerPoint
-
ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం
సాక్షి, హైదరాబాద్: ప్రతి గెలుపులో పాఠాలుంటే.. ఓటమిలో గుణపాఠాలు ఉంటాయని.. ఆ గుణపాఠాలు నేర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇచ్చామని, నిరుద్యోగులకు అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. కానీ సరైన విధంగా ప్రచారం చేసుకోలేకపోయామని పేర్కొన్నారు. ‘నిజం గడప దాటే లోపల.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంద’న్న సామెత నిజమైందని.. కాంగ్రెస్ అబద్ధాలు, అలవి గాని హామీలను ప్రజలు నమ్మారని వ్యాఖ్యానించారు. యూట్యూబ్‌లో కొందరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే నివారించలేకపోయామని, దానితోనూ కొంత నష్టం జరిగిందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ‘స్వేద పత్రం’ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. కేవలం 1.85శాతం ఓట్లతో తాము ఓడిపోయామని.. ఏడెనిమిది సీట్లు నాలుగైదు వేల ఓట్ల తేడాతో కోల్పోయామని చెప్పారు. ఇది ఘోర పరాజయం కాదని, ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా. మీరు విజయవంతం కావాలని మేం కోరుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. వందరోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. వందరోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మొన్ననే నాలుక మడతేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినా.. ఉప ముఖ్యమంత్రి తాము ఆమాటే అనలేద న్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఆరు గ్యారంటీలు కాదు. 142 హామీలున్నాయి. వాటిని లెక్కతీశాం. మా పార్టీ తరఫున శాఖల వారీగా షాడో టీమ్‌లు ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో వాటిని షాడో కేబినెట్ అంటారు. అలాంటిదే మా లెజి స్లేచర్లో ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి ప్రభుత్వ శాఖలో, ప్రతిరంగంలో సర్కారు పనితీరు.. వారు ఏం చేస్తున్నారు? ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? తదితర అంశాలన్నింటినీ నిశితంగా గమనించి ప్రజలకు వివరిస్తాం..’’ అని కేటీఆర్ చెప్పారు. దీప స్తంభంగా మారిన తెలంగాణను ఆరనివ్వబోమని, పడిపోనివ్వబోమని పేర్కొన్నారు. ఏ విచారణకైనా మేం సిద్ధం రాజకీయాల్లో పోటీకి వెళ్లిన ప్రతిసారీ గెలుస్తామనే ఆశిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు చెప్తున్నామని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడుతామని, ప్రతి అంశంపై రివ్యూ చేస్తామని చెప్పారు. ‘‘అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు, హామీలను నెరవేర్చేందుకు వినియోగిస్తారా? కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా? అనేది వారి విజ్ఞత. ఏ విచారణ అయినా.. ఏ కమిషన్ అయినా.. ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కావాలంటే విచారణ చేయాలని మేమే సభలో డిమాండ్ చేశాం. అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాం..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. యువత విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మినట్టు అనిపించిందని.. అప్పుడే స్పందించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా ఉందని చెప్పారు. తమ తరఫున చిన్నచిన్న తప్పులు, పొరపాట్లు జరిగాయని.. సవరించుకొని ముందుకెళ్తామని వివరించారు. ఉద్యోగుల జీతాల విషయంలో కరోనా ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతే కొంత ఇబ్బంది వచ్చిందని.. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఊహించని వాళ్లు ఓడిపోయారు! మీడియాతో లంచ్ సందర్భంగా కూడా కేటీఆర్ పలు అంశాలపై చిట్‌చాట్ చేశారు. ‘‘ప్రజల తీర్పును అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంత చేసినా ఎలా ఓడిపోయాం? ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోవాలి, అక్కడ కేసీఆర్ సీఎంగా ఉండాలని ప్రజలు ఓట్లేసినట్టు చెపుతున్నారు. కోనేరు కోనప్ప, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, సింగిరెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి వంటి వారు ఓడిపోతారని ఎవరైనా అనుకుంటారా? వారికి రెండు సార్లు అవకాశం ఇచ్చాం కదా.. ఓసారి వీళ్లకు ఇద్దామని ప్రజలు భావించారని అనిపిస్తోంది..’’ అని పేర్కొన్నారు. -
గోదావరిపై లిఫ్ట్ ఇరిగేషన్ ఘనత నాదే
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/మధురపూడి/సీతానగరం: గోదావరిపై ఉన్న ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన ఘనత తనకే దక్కుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్య టనలో భాగంగా మంగళవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ఆయన అనంతరం కోరుకొండ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆవ భూముల్లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో జే–ట్యాక్స్ నడుస్తుంటే రాజానగ రంలో జక్కంపూడి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టు కుంటావా జగన్ అని ప్రశ్నించారు. ముని కూడలిలో గతంలో శిరోముండనానికి గురైన యువకుడితో మాట్లాడించారు. పురుషోత్త పట్నం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పురుషోత్తపట్నం ఒక చరిత్రని, రెండులక్షల రైతుల జీవితాన్ని మార్చే ప్రాజెక్టుకు నీళ్లు అందించాలన్న ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. తాను కట్టడం వల్లే దానిని వాడకూడదని జగన్ ఆలోచిస్తున్నాడన్నారు. ప్రజావేదికను కూల్చినట్టు ప్రాజెక్టు కూలిస్తే ఇక్కడి ప్రజలు తాటతీస్తారని హెచ్చరించారు. పోలవరంపై చేతులెత్తేశారు రాజమహేంద్రవరంలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మాణమంటున్న సీఎం జగన్ దీనిని నిర్మించలేనని చేతులెత్తేసి, కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తుందని, మనం చేయాల్సిందల్లా ఎలాంటి ఆరోపణలు తప్పులు చేయకుండా, వారి సూచనల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మించడమేనని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన పనుల వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ మొత్తం పోయాయన్నారు. చేయాల్సిన నాశనంచేసి, ఇప్పుడు కేంద్రమే నిర్మించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణాలు ఎందుకు దెబ్బతిన్నాయనే దానిపై హైదరాబాద్ ఐఐటీ ఒక నివేదిక ఇచ్చిందని తెలిపారు. అందులో 14 కారణాలు చెబితే.. 13 కారణాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమేనని తేల్చాయని పేర్కొన్నారు. -
‘పవర్‌పాయింట్’కు అవకాశం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిపై చర్చించి పరిష్కరించడానికి వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని కాంగ్రెస్‌పార్టీ విప్, ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలను తక్షణమే ఏర్పాటుచేయాలని కోరుతూ స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి గురువారం సీఎల్పీ రాసిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత చట్టసభలపై ఉందని అన్నారు. భూసేకరణ చట్టం-2013కు విరుద్ధంగా, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తోందన్నారు. దీంతో సాగునీటి ప్రాజెక్టులకోసం భూములు కోల్పోయే రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారని వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అనేక అబద్ధాలు చెబుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్లోని లోపాలు, వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన ప్రాజెక్టుల టెండర్లు, కాంట్రాక్టులపై సమగ్రంగా చర్చించడానికి, అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షాన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెంటనే వర్షాకాల సమావేశాలను ఏర్పాటుచేయాలని సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. సీఎల్పీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు మొదట స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాంను కలసి సీఎల్పీ పక్షాన లేఖ ఇచ్చారు. -
నిర్లక్ష్యమే శాపం
అడ్డతీగల :వృథాగా పోతున్న కొండవాగుల నీటి ద్వారా జలవిద్యుదుత్పత్తి చేయవచ్చని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో అడ్డతీగల మండలంలోని వేటమామిడి వద్ద రూ.6 కోట్ల అంచనా వ్యయంతో 1.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్నతరహా జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అనుమతి ఇచ్చా రు. దీంతో పాటు మిట్లపాలెం, పింజరికొండ వద్ద రెండు ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అనుమతి చ్చినా, అవి అసంపూర్తిగా ఉండిపోయాయి. వీ టిని గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఏపీ ట్రిప్కో(ట్రైబల్ పవర్ ప్రాజెక్టు కంపెనీ) నిర్వహించాల్సి ఉంది. వేటమామిడిలో 2005 డిసెం బర్లో పనులు ప్రారంభించి 2011 నాటికి పూర్తి చేశారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి కా నందున నిర్మాణ వ్యయం అదనంగా రూ.1.50 కోట్లు పెరిగింది. అదే ఏడాది ఏప్రిల్ 11న వి ద్యుదుత్పత్తి ప్రారంభమైంది. అనేక అవాంతరా లు, సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వా టిని అధిగమిస్తూ 2013 ఏప్రిల్ 16 వరకు ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి చేశారు. పవర్‌హౌస్‌లోని టర్బైన్, ఇతర పరికరాలకు ఏడాదికోసారి తప్పనిసరిగా సర్వీసింగ్ నిర్వహించాలి. ప్రాజెక్ట్ ని ర్మాణం చేపట్టినప్పుడే టర్బైన్ ఇతర పరికరాల ను సర్వీసింగ్ చేసేందుకు బెంగళూరుకు చెందిన బేవింగ్ ఫోర్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎల్) కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. వేటమామిడి ప్రాజె క్టు పూర్తయ్యే వరకు దానితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌ల కోసం కావాల్సిన పరికరాలు ఏళ్ల తరబడి భద్రపర్చినందుకు అద్దెగా రూ.10 లక్షలు చెల్లించాలని, లేకపోతే సర్వీసింగ్ పనులు చేయలేమని ఆ సంస్థ ప్రతినిధులు తేల్చిచెప్పారు. దీ నిపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎలాం టి నిర్ణయం తీసుకోలేదు. సాంకేతిక సమస్యలు అధికమై, సర్వీసింగ్ జరగకపోవడంతో ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. డిస్కం వద్ద పేరుకున్న బకాయిలు వేటమామిడి ప్రాజెక్ట్ నుంచి సుమారు 18,84,900 యూనిట్ల మేరకు విద్యుదుత్పత్తి జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందే విద్యుత్‌ను యూనిట్ రూ.2.49 వంతున విక్రయించాలని కుదిరిన ఒప్పందం మేరకు డిస్కంకు విద్యుత్‌ను విక్రయించారు. దీని రూపేణా డిస్కం నుంచి రూ.46 లక్షలు రావాల్సి ఉంది. నేటికీ చిల్లిగవ్వ విదల్చలేదు. ప్రాజెక్ట్ నిర్వహణ కోసం అడ్డతీగల సబ్‌స్టేషన్ నుంచి వేటమామిడికి హెచ్‌టీ లైన్ ద్వారా ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ సరఫరా జరిగింది. దాని కోసం రూ.50 లక్షల మేరకు ట్రాన్స్‌కోకు ట్రిప్కో బకాయిపడింది. నిలిచిపోయిన నిర్మాణాలు పింజరికొండలోని ప్రాజెక్ట్ పనులు కాంట్రాక్టు సంస్థకు, ప్రభుత్వానికి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. మిట్లపాలెంలో మాత్రం కొంతమేరకు పనులు జరిగాయి. ఇక్కడ పనుల వారీగా రెండుసార్లు టెండర్లు పిలిచినా, వాటిని దక్కిం చుకున్న కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం రూ.1.61 కోట్ల వ్యయం జరిగిందంటున్నారు. దీనిపై ఐటీడీఏ డీఈ డేవిడ్‌రాజును వివరణ కోరగా, సర్వీసింగ్ పనుల నిర్వహణ ప్రైవేట్ సంస్థ ద్వారా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మిట్లపాలెంలోని ప్రాజెక్ట్ పనుల నిర్వహణకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. -
ఆఫీస్ 365కి 2.5 కోట్ల యూజర్లు
భారత్‌లో మైక్రోసాఫ్ట్ లక్ష్యమిది న్యూఢిల్లీ: క్లౌడ్ ఆధారిత ‘ఆఫీస్ 365 పర్సనల్’ భారత్‌లో 2.5 కోట్ల మంది వినియోగదార్లకు అందించడంపై దృష్టిపెట్టినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ తదితర అప్లికేషన్లను ఉపయోగించేందుకు వీలుకల్పించే ఈ సాఫ్ట్‌వేర్‌కు వినియోగానికిగాను నెలకు రూ.330 చొప్పున చార్జీని వసూలు చేయనుంది. ‘చౌక సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌తో లభించే ఈ ఆఫీస్ సూట్‌ను విండోస్/మ్యాక్ పీసీలలో వాడుకోవచ్చు. కాగా, మొబైల్ వెర్షన్స్(ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లలో)కు ఏడాదికి రూ.3,299 చొప్పున ఫీజు ఉంటుంది. రాబోయే ఏడాది కాలంలో భారత్‌లో ఈ సేవలకు 2.5 కోట్ల మంది యూజర్లను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదార్ల నుంచి అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తుందని భావిస్తున్నాం’ అని మైక్రోసాఫ్ట్ కంట్రీ జనరల్ మేనేజర్(కన్సూమర్ చానల్స్ విభాగం) చక్రపాణి గొల్లపల్లి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించిన ప్రొడక్ట్‌గా ఈ ఆఫీస్ 365 నిలుస్తోందని, అందుబాటులోకి తెచ్చిన కొద్దికాలంలోనే 2 బిలియన్ డాలర్లకుపైగా వ్యాపారాన్ని సాధించినట్లు కూడా ఆయన వెల్లడించారు. కాగా, మాల్స్‌లో నేవిగేషన్‌కు ఉపయోగపడే వెన్యూ మ్యాప్స్‌ను కూడా మైక్రోసాఫ్ట్ ఈ సందర్భంగా ప్రదర్శించింది. నోకియా మ్యాప్స్ అప్లికేషన్‌తో పాటు బింగ్ ద్వారా కూడా సంబంధిత డేటా లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులతోపాటు దేశంలోని 120 మాల్స్‌కు సంబంధించిన డేటాను ఈ అప్లికేషన్లో పొందుపరిచినట్లు పేర్కొంది.