నిర్లక్ష్యమే శాపం | negligence Curse powerpoint | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే శాపం

Published Sun, Jul 20 2014 12:10 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

నిర్లక్ష్యమే శాపం - Sakshi

నిర్లక్ష్యమే శాపం

అడ్డతీగల :వృథాగా పోతున్న కొండవాగుల నీటి ద్వారా జలవిద్యుదుత్పత్తి చేయవచ్చని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో అడ్డతీగల మండలంలోని వేటమామిడి వద్ద రూ.6 కోట్ల అంచనా వ్యయంతో 1.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్నతరహా జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అనుమతి ఇచ్చా రు. దీంతో పాటు మిట్లపాలెం, పింజరికొండ వద్ద రెండు ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అనుమతి చ్చినా, అవి అసంపూర్తిగా ఉండిపోయాయి. వీ టిని గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఏపీ ట్రిప్కో(ట్రైబల్ పవర్ ప్రాజెక్టు కంపెనీ) నిర్వహించాల్సి ఉంది. వేటమామిడిలో 2005 డిసెం బర్‌లో పనులు ప్రారంభించి 2011 నాటికి పూర్తి చేశారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి కా నందున నిర్మాణ వ్యయం అదనంగా రూ.1.50 కోట్లు పెరిగింది. అదే ఏడాది ఏప్రిల్ 11న వి ద్యుదుత్పత్తి ప్రారంభమైంది.
 
 అనేక అవాంతరా లు, సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వా టిని అధిగమిస్తూ 2013 ఏప్రిల్ 16 వరకు ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి చేశారు. పవర్‌హౌస్‌లోని టర్బైన్, ఇతర పరికరాలకు ఏడాదికోసారి తప్పనిసరిగా సర్వీసింగ్ నిర్వహించాలి. ప్రాజెక్ట్ ని ర్మాణం చేపట్టినప్పుడే టర్బైన్ ఇతర పరికరాల ను సర్వీసింగ్ చేసేందుకు బెంగళూరుకు చెందిన బేవింగ్ ఫోర్స్ లిమిటెడ్ (బీఎఫ్‌ఎల్) కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. వేటమామిడి ప్రాజె క్టు పూర్తయ్యే వరకు దానితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌ల కోసం కావాల్సిన పరికరాలు ఏళ్ల తరబడి భద్రపర్చినందుకు అద్దెగా రూ.10 లక్షలు చెల్లించాలని, లేకపోతే సర్వీసింగ్ పనులు చేయలేమని ఆ సంస్థ ప్రతినిధులు తేల్చిచెప్పారు. దీ నిపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎలాం టి నిర్ణయం తీసుకోలేదు. సాంకేతిక సమస్యలు అధికమై, సర్వీసింగ్ జరగకపోవడంతో ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
 
 డిస్కం వద్ద పేరుకున్న బకాయిలు
 వేటమామిడి ప్రాజెక్ట్ నుంచి సుమారు 18,84,900 యూనిట్ల మేరకు విద్యుదుత్పత్తి జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందే విద్యుత్‌ను యూనిట్ రూ.2.49 వంతున విక్రయించాలని కుదిరిన ఒప్పందం మేరకు డిస్కంకు విద్యుత్‌ను విక్రయించారు. దీని రూపేణా డిస్కం నుంచి రూ.46 లక్షలు రావాల్సి ఉంది. నేటికీ చిల్లిగవ్వ విదల్చలేదు. ప్రాజెక్ట్ నిర్వహణ కోసం అడ్డతీగల సబ్‌స్టేషన్ నుంచి వేటమామిడికి హెచ్‌టీ లైన్  ద్వారా ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ సరఫరా జరిగింది. దాని కోసం రూ.50 లక్షల మేరకు ట్రాన్స్‌కోకు ట్రిప్కో బకాయిపడింది.
 
 నిలిచిపోయిన నిర్మాణాలు
 పింజరికొండలోని ప్రాజెక్ట్ పనులు కాంట్రాక్టు సంస్థకు, ప్రభుత్వానికి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. మిట్లపాలెంలో మాత్రం కొంతమేరకు పనులు జరిగాయి. ఇక్కడ పనుల వారీగా రెండుసార్లు టెండర్లు పిలిచినా, వాటిని దక్కిం చుకున్న కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం రూ.1.61 కోట్ల వ్యయం జరిగిందంటున్నారు. దీనిపై ఐటీడీఏ డీఈ డేవిడ్‌రాజును వివరణ కోరగా, సర్వీసింగ్ పనుల నిర్వహణ ప్రైవేట్ సంస్థ ద్వారా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మిట్లపాలెంలోని ప్రాజెక్ట్ పనుల నిర్వహణకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement