ppas
-
ఐదేళ్లకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు
సాక్షి, అమరావతి: భవిష్యత్‌లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏలు)ను ఐదేళ్లకే పరిమితం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఇంధన శాఖ కేంద్రానికి స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థలను ఆర్థికంగా కుంగదీస్తున్న పాత ఒప్పందాలను సమీక్షించాలని పేర్కొంది. వినియోగదారులకు నాణ్యమైన, చౌక విద్యుత్ అందించేందుకు ఖరీదైన పీపీఏలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించింది. కేంద్రం.. జాతీయ విద్యుత్ విధానాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ముసాయిదా ప్రతిని రాష్ట్రాల ముందుంచింది. దీనిపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఘనశ్యామ్ ప్రసాద్ శుక్రవారం అన్ని రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శులతో వర్చువల్ విధానంలో చర్చించారు. కొత్త పాలసీలోని ముఖ్యమైన అంశాలపై రాష్ట్రాల అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పవన, సౌర విద్యుత్‌లను జాతీయ స్థాయిలో లెక్కించి రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలని సూచించారు. నిర్వహణ వ్యయం అదుపునకు అనుసరించాల్సిన పద్ధతుల్లో ట్రాన్స్మిషన్ విభాగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పంప్డ్ స్టోరేజీల ఏర్పాటుకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలున్నాయని, అయితే కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు త్వరితగతిన వచ్చేలా కేంద్రం చొరవ చూపాలని కోరారు. చదవండి: ఏపీ: జూన్ 22న వైఎస్సార్ చేయూత కరోనా కాలం: పల్లెకు దూరమై.. చేనుకు చేరువై! -
పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోలార్, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం పున: పరిశీలన చేస్తామంటే చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కమిషన్లతో ఏటా రూ. 2500 కోట్ల ప్రజాధనం వృథా అయిందని తెలిపారు. యూనిట్ విద్యుత్ రూ. 2.70కి వస్తుంటే రూ. 4.84 చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఎవడబ్బ సొమ్మని ప్రజాధనాన్ని దోచిపెట్టారని నిలదీశారు. సోలార్, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం పున:పరిశీలన చేస్తానంటే మీరెందుకు వణికిపోతున్నారు చంద్రబాబు గారూ. కమీషన్లు మింగి చేసుకున్న పీపీఏల వల్ల ఏటా 2,500 కోట్ల ప్రజాధనం వృధా అయింది. యూనిట్ 2.70కి వస్తుంటే 4.84 చెల్లించారు. ఎవడబ్బ సొమ్మని దోచిపెట్టారు? — Vijayasai Reddy V (@VSReddy_MP) July 16, 2019 తమ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న విమర్శలపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజుల కాకముందే విషం చిమ్మే విమర్శలు చేయడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గాలను అడ్డుకునేందుకు ప్రజలు ఆ పార్టీ నాయకుల్ని ఇంటికి పంపారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఏం కోరుకుంటున్నారో బాగా తెలుసని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
తెలంగాణకు తక్షణ ముప్పు తప్పినట్టే
-
పీపీఏల రద్దు చట్టవిరుద్ధం: టీ కాంగ్రెస్ మండిపాటు
హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) రద్దు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని టీ పీసీసీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె. జానారెడ్డిలు పేర్కొన్నారు. విభజన అంశాలపై ఇరు రాష్ట్రాలు సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. బుధవారం వారు వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. చట్టాన్ని ఉల్లంఘించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఏముందని జానారెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో తాము ఈఆర్సీకి, కేంద్రం వద్దకు వెళ్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. విభజన బిల్లుకు భిన్నంగా పీపీఏలను ఉపసంహరించడం కవ్వింపు చర్యగా పొన్నాల అభివర్ణించారు. ఈ ఉపసంహరణ ప్రతిపాలను విరమించుకునేలా చంద్రబాబుపై తెలంగాణ టీడీపీ నాయకులు ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఇరాక్‌లో వెయ్యి మంది తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వీరిని ఆదుకునేందుకు వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని పొన్నాల సూచించారు. -
బాబువి అనైతిక చర్యలు: మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్: విద్యుత్ పీపీఏలను రద్దుచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, అదే దారిలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే హైదరాబాద్‌లో ఏపీ సర్కారు పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి టి.హరీష్‌రావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం తర్వాత సచివాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమానుషమని, దీనిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పీపీఏలు కొనసాగుతాయంటూ విభజన చట్టంలో ఉందని, ఆ చట్టాన్ని కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లపాటు ఉమ్మడిగా కొనసాగుతాయని చట్టంలో స్పష్టంగా పొందుపర్చిన అంశాలను అతిక్రమించడం ద్వారా బాబు అనైతిక చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందవద్దని సూచించారు. పీపీఏలను రద్దుచేస్తూ ఆంధ్రా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలుకానివ్వబోమని స్పష్టంచేశారు -
ఇవేం పిల్ల చేష్టలు?
ఆంధ్రప్రదేశ్ తీరుపై కేసీఆర్ గరం పీపీఏల రద్దును వ్యతిరేకిస్తూ రంగంలోకి కేంద్ర విద్యుత్ మంత్రితో చర్చలు విభజన చట్టం ప్రకారం జోక్యానికి వినతి అవసరమైతే ప్రధానితో మాట్లాడతా: సీఎం కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శికి సీఎస్ లేఖ హైదరాబాద్: ‘‘ఇవేం పిల్ల చేష్టలు?! తెలంగాణ విద్యుత్ కోటాను అడగకుండా కేంద్రం నుంచి అదనపు కోటాను తెచ్చుకుంటానన్న చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌పై కన్నేశారు. ఇదేం సమన్యాయం?’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మండిపడ్డారు. జెన్కో ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) రద్దు చేసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయన గర్హించారు. దీనిపై బుధవారం సచివాలయంలో ఇంధన శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘ఏదేమైనా తెలంగాణకు నష్టం జరగకుండా అన్ని చర్యలూ తీసుకుందాం. అవసరమైతే ప్రధానితో నేరుగా మాట్లాడతాను. ఇప్పటికే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడాను. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా పీపీఏలు కొనసాగాల్సిందేనని స్పష్టం చేశాను. జోక్యం చేసుకోవాలని కూడా కోరా. ఆయన సానుకూలంగా స్పందించారు’’ అని వివరించారు. పీపీఏల రద్దుతో తెలంగాణకు జరిగే విద్యుత్ నష్టాన్ని నివారించే చర్యలకు ప్రభుత్వం తెర తీసింది. పీపీఏలు రద్దవకుండా చూడాలని కోరుతూ కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం లేఖ రాశారు. ప్రస్తుతమున్న విద్యుత్ సరఫరాను యథాతథంగా కొనసాగించాలని కోరుతూ విద్యుత్ సరఫరాను నియంత్రిస్తున్న బెంగళూరులోని దక్షిణ ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ)కు ఇంధన శాఖ కార్యదర్శి సురేశ్ చందా కూడా లేఖ రాశారు. మరోవైపు అదనపు విద్యుత్ పొందే చర్యలకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)కి చెందిన ఝజ్జర్ ప్లాంటు నుంచి అదనంగా సుమారు 300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని కోరుతూ ఎన్టీపీసీ చైర్మన్‌కు ట్రాన్స్‌కో సీఎండీ లేఖ రాశారు. ఇందుకాయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. మార్కెట్ నుంచి అదనపు విద్యుత్ కొనుగోలుకు కూడా చర్యలు ప్రారంభించారు. మరోవైపు పీపీఏలను రద్దు చేయాలంటూ ఏపీ జెన్కో రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సునిశీతంగా పరిశీలిస్తోంది. దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలిసింది. సెక్షన్ 92 ప్రకారం జోక్యం చేసుకోండి! ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం పీపీఏల రద్దుపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు లేఖ కూడా రాసినట్టు తెలిసింది. విద్యుత్, బొగ్గు, చమురు అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఈ సెక్షన్లో పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఈ సెక్షన్‌ను గుర్తుచేస్తూ జోక్యం చేసుకోవాలని విన్నవించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. మనం హుందాగా ఉందాం: కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టీపీపీ), విజయవాడలోని నార్లతాతరావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా అవుతుంది. పీపీఏల రద్దుకు ఆ రాష్ట్రం నిర్ణయించిన నేపథ్యంలో రెండు స్టేషన్లకు బొగ్గు సరఫరా ఆపేద్దామని కొందరు అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే, ‘మనం హుందాగా ప్రవర్తిద్దాం. చిన్న పిల్లల చేష్టలు మనకొద్దు’ అంటూ