prabakar reddy
-
ప్రభాకర్ రెడ్డి అంటేనే వైట్ షీట్
-
కరోనా: రెండు చోట్ల ప్లాస్మా సేకరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా ప్లాస్మా సేకరణకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రెండు చోట్ల ప్లాస్మా సేకరణ చేయనున్నట్లు కోవిడ్-19 స్టేట్ కమాండ్ కంట్రోల్ నోడల్ అధికారి డా. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి స్విమ్స్, కర్నూలు మెడికల్ కాలేజిలో ప్లాస్మా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా నుంచి కోలుకున్న రోగుల నుంచి 14 రోజుల తర్వాత వారి ప్లాస్మా సేకరిస్తే, యాంటీ బాడీస్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపతుందని చెప్పారు. ఇప్పటివరకు కేవలం ప్లాస్మా సేకరణ మాత్రమే చేస్తున్నామని డా. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. (ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు..) సిరియా దేశంలో ప్లాస్మా సేకరణ కరోనా బాధితులకు యంటీ బాడీస్ అభివృద్ధికి ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు. ఇక సేకరించి ప్లాస్మాను -40 డిగ్రీల వద్ద ప్రిజర్వ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు 14 రోజులు తర్వాత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వటం ద్వారా కరోనా బాధితులకు మేలు చేసినట్లు అవుతుందని ఆయన చెప్పారు. (గ్యాస్ లీక్ ఘటనపై విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి) -
పైసా.. కైసా?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రామ పంచాయతీల్లో నిధులు లేక పనులు జరగక సర్పంచ్‌లు అయోమయానికి గురవుతున్నారు. గ్రామాన్ని ప్రగతిబాట పట్టించాలన్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలపై ప్రతి యేటా ఆడిట్ జరగాల్సి ఉంటుంది. 2012-13కు సంబంధించి ఇంకా లెక్కలు తేలకపోవడంతో పంచాయతీకి నిధుల విడుదల నిలిచిపోయింది. 13వ ఆర్థిక సంఘం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్జీఎఫ్) తదితర పద్దుల ద్వారా పంచాయతీలకు నిధులు విడుదల కావాల్సి ఉంది. దీంతో ఇన్నాళ్లూ చెక్‌పవర్ కోసం ఒత్తిడి చేసిన కొత్త సర్పంచ్‌లు, తాజాగా ఆడిట్ త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. జిల్లాలో 1,066 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 35 మేజర్ పంచాయతీలున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీల వారీగా డిసెంబర్ 31లోగా ఆడిట్ పూర్తి కావాల్సి ఉంది. ఆడిట్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అటు పంచాయతీ, ఇటు జిల్లా పరిషత్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్ల వారీగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లతో సమావేశాలు కూడా నిర్వహించారు. మరో 450 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంకా ఆడిట్ ప్రారంభం కావాల్సి ఉంది. గడువులోగా ఆడిట్ పూర్తవుతుందని అధికారులు చెప్తున్నా చాలాచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి. సుమారు రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలోనే పంచాయతీల పాలన కొనసాగింది. గతంలో పనిచేసిన సర్పంచ్‌లు ఇంకా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు రికార్డులు అప్పగించలేదు. దీంతో ఆడిట్ సకాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులకు అప్పగించారు. నిర్ణీత గడువులోగా ఆడిట్ జరగకుంటే సర్పంచ్‌లపై అనర్హత వేటు వేయడంతో పాటు, ఎగ్జిక్యూటివ్ అధికారులపై చర్యలుంటాయని పంచాయతీరాజ్ చట్టం స్పష్టం చేస్తోంది. 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఇప్పటికే జిల్లాకు రూ.13 కోట్లు విడుదలయ్యాయి. మరో రూ.13 కోట్లు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆడిట్ నివేదికలు సమర్పిస్తేనే బీఆర్జీఎఫ్ నిధులు కూడా పంచాయతీల ఖాతాల్లోకి వెళ్తాయి. దీంతో నిధులున్నా వినియోగించుకునే పరిస్థితి లేదని సర్పంచ్‌లు వాపోతున్నారు. రికవరీకి సన్నాహాలు బీఆర్జీఎఫ్ నిధుల వినియోగానికి సంబంధించి పలుచోట్ల అవకతవకలు జరిగినట్లు ఆడిట్ నివేదికల్లో వెల్లడవుతోంది. జగదేవ్‌పూర్, చేగుంట వంటి మండలాల్లో పనులు పూర్తి కాకుండానే నిధులు డ్రా చేసినట్లు గుర్తించారు. వీటిని తిరిగి రాబట్టేందుకు(రికవరీ) అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. స్పందించని వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆడిట్ పూర్తయిన పంచాయతీల్లో ఎంత మొత్తం రికవరీ చేయాల్సి వుందనే సమాచారాన్ని ఇచ్చేందుకు అధికారులు విముఖత చూపుతున్నారు. ఆడిట్లో లోపాలను గుర్తిస్తే మరో మారు విచారణ జరుపుతామని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. -
బీఆర్జీఎఫ్ లెక్కలు తేలుస్తున్న యంత్రాగం
సిద్దిపేట జోన్/ సిద్దిపేట రూరల్ న్యూస్‌లైన్: బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంలో చోటుచేసుకున్న అక్రమాలే లక్ష్యంగా జిల్లా యంత్రంగం తీగ లాగుతోంది. అక్రమాల గుట్టువిప్పేందుకు సన్నద్ధమవుతోంది. నాలుగేళ్లుగా ప్రభుత్వ నిధుల వినియోగంపై అధికారిక లెక్కలను సేకరిస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించిన(బీఆర్జీఎఫ్) నిధులపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. మూడేళ్లుగా సిద్దిపేట డివిజన్ పరిధిలో ఆయా మండలాల్లో బీఆర్జీఎఫ్ నిధుల కింద చేపట్టిన పనులు, వినియోగ ధృవీకరణ పత్రాలు, పెండింగ్ పనులు, మిగులు పనులు లాంటి సమగ్ర వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించేందుకు సమాయత్తమైంది. అందులో భాగంగానే జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సీ అనందంలు బుధవారం సిద్దిపేటలో రోజంతా డివిజన్ పరిధిలోని అధికారులతో సుధీర్ఘ సమీక్షను నిర్వహించారు. ముఖ్యంగా బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంలో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించే పనికి శ్రీకారం చుట్టిన జిల్లా యంత్రాంగం ఆ దిశగా నిధుల వినియోగంపై ఆరా తీస్తోంది. ముందస్తుగా సిద్దిపేట డివిజన్ పరిధిలోని ఆయా మండలాలకు మంజూరైన నిధుల వివరాలు, యూసీల సమాచారాన్ని మండలాల వారీగా సేకరించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక చర్చ సిద్దిపేట డివిజన్ పరిధిలోని ఆయా మండలాలకు కేటాయించిన బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంపై సమగ్ర వివరాలను సేకరిస్తున్న జిల్లా అధికారులు ముఖ్యంగా పెండింగ్ పనులపై దృష్టి సారించారు. గ్రామ సర్పంచ్ల పదవీకాలం ముగిసి కొత్త పాలక వర్గాలు అధికారంలోకి వ చ్చిన నేపథ్యంలో గత నాలుగేళ్లుగా ఆయా గ్రామాల్లో బీఆర్జీఎఫ్ కింద నిలిచిన పనుల వివరాలను, పెండింగ్ నిధులను మండల అధికారుల ద్వారా సేకరించారు. త్వరితగతిన పెండింగ్ పనులను పూర్తిచేయాలని, బ్యాంకుల్లో నిధులు నిల్వ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, పనులు సకాలంలో పూర్తి చే యకపోవడంతో సంబంధిత నిధులు వెనక్కివె ళ్లే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యంగా బీఆర్జీఎఫ్ నిధులు నిర్వీర్యం కాకుండా చూడాలని ఆదేశించారు. మండలాలవారీగా బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంపై వివరాలు సేకరించిన జిల్లా అధికారులకు డివిజన్ పరిధిలోని ఒక మండలంలో అధికారికంగా లెక్కలకు పొంతన కుదరలేదన్న అభిప్రాయం వెలిబుచ్చినట్లు సమాచారం. ఈ సమీక్షలో మండల పరిధిలోని డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్‌కు చెందిన ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.