ఫోన్‌ట్యాపింగ్ కేసు: సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్(సీపీ) సీవీ ఆనంద్ తొలిసారిగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తుపై శుక్రవారం(అక్టోబర్ 25) మీడియాతో మాట్లాడుతూ సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసులో కీలక నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చాడన్న ప్రచారంలో వాస్తవం లేదు.ఇప్పటికే ప్రభాకర్‌రావుపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశాం.ప్రభాకర్‌రావు దేశంలో ఎక్కడ ఏ ఎయిర్‌పోర్టులో దిగినా మాకు సమాచారం వస్తుంది. ఆయనను భారత్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని సీవీ ఆనంద్ చెప్పారు.కాగా, ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారించగా ప్రభాకర్‌రావు మాత్రం విదేశాల్లో ఉండిపోయారు. ఆయన ఈ కేసులో ఇంకా విచారణకు హాజరు కాలేదు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు ఈ కేసులో ఏప్రిల్ నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన ఇటీవలే బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు