Pradeep Sangwan
-
మటన్ రోల్స్ తినేందుకు వెళ్లి చిక్కుల్లో పడిన విరాట్ కోహ్లి..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని అతని చిన్ననాటి మిత్రుడు, భారత అండర్ 19 జట్టు మాజీ సభ్యుడు ప్రదీప్ సాంగ్వాన్ ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు రాసిన వ్యాసంలో షేర్ చేసుకున్నాడు. జూనియర్ క్రికెట్లో కోహ్లికి రూమ్ మేట్ అయిన సాంగ్వాన్.. 2008 అండర్19 ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఓ సంఘటనను తన వ్యాసంలో ప్రస్తావించాడు. చిన్నతనంలో కోహ్లి స్ట్రీట్ ఫుడ్‌ను చాలా ఇష్టంగా తినేవాడని.. కూర్మా రోల్స్, చికెన్ రోల్స్ ఇలా కనిపించిన ప్రతి ఐటెంను వదిలేవాడుకాదని, 2008కి ముందు దక్షిణాఫ్రికా పర్యటనలో(అండర్ 19 జట్టుతో) కూడా ఇలానే స్ట్రీట్ ఫుడ్ (మటన్ రోల్స్) కోసం వెళ్లి లైఫ్‌ను రిస్క్ చేశాడని, అందులో నేను కూడా బాధితుడినేనని గుర్తు చేసుకున్నాడు. తమ జట్టు బస చేసే హోటల్‌కు దగ్గర్లో రుచికరమైన మటన్ రోల్స్ దొరుకుతాయని తెలిసిన వ్యక్తి చెప్పడంతో కోహ్లి తనను వెంటతీసుకు వెళ్లాడని, ఆ స్ట్రీట్ ఫుడ్ దొరికే ప్రాంతం అంత సురక్షితం కాదని, కొన్ని రోజుల ముందే అక్కడ పెద్ద గొడవ జరిగిందని తమ డ్రైవర్ వారించినా కోహ్లి వినలేదని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడి వెళ్లి మటన్ రోల్స్‌ను టేస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టాడని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఎట్టకేలకు తాము ఆ ప్రాంతానికి వెళ్లి రుచికరమైన మటన్ రోల్స్‌ను ఆరగించామని, అయితే తిరుగు ప్రయాణంలో కొందరు దుండగులు తమ కారును వెంబడించారని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. కాగా, విరాట్ కోహ్లి టీమిండియాలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 2012 నుంచి కోహ్లి తన ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్నెస్ పై దృష్టి సారించాడు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా కష్టపడుతుంటాడు. అత్యుత్తమ ఫిట్నెస్ ప్రమాణాలు పాటిస్తూ సమకాలీకులతో పాటు నేటి తరం క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. చదవండి: పరుగుల వరద పారిస్తున్న మరో కోహ్లి.. 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు -
కెప్టెన్‌గా రిషబ్ పంత్‌కు ఉద్వాసన..!
న్యూఢిల్లీ:ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో నెలకొన్న అంతర్గత రాజకీయాల కారణంగా రిషబ్ పంత్‌ను ఢిల్లీ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించారు. అదే సమయంలో చాలాకాలంగా ఢిల్లీకి జట్టులో చోటు కోల్పోయిన లెఫ్టార్మ్ స్సిన్నర్ ప్రదీప్ సాంగ్వాన్‌ను రిషబ్ పంత్ స్థానంలో సారథిగా ఎంపిక చేస్తూ డీడీసీఏ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 2016లో ఢిల్లీ తరపున చివరిసారి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన సాంగ్వాన్‌కు ఒక్కసారిగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. ఓవరాల్‌గా చూస్తే 2017 ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ తరపున సాంగ్వాన్ చివరిసారి కనిపించాడు. నిషేధిత ఉత్ర్పేరకం వాడి పాజిటివ్‌గా తేలిన తొలి క్రికెటర్‌గానూ సాంగ్వాన్ నిలవడం గమనార్హం. అయితే రిషబ్ పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, ఆపై సాంగ్వాన్‌కు ఆ బాధ్యతలను అప్పగించడాన్ని ఢిల్లీ సెలక్టర్ల చైర్మన్ అతుల్ వాసన్ సమర్దించుకున్నాడు. 'రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతున్న కారణంగానే ఆ భారాన్ని తగ్గించేందుకు అతని కెప్టెన్సీకి ఉద్వాసన పలికాం. అదే సమయంలో సీనియర్ ఆటగాడైన సాంగ్వాన్‌ను సారథిగా ఎంపిక చేశాం. కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి సాంగ్వాన్‌కు అన్ని అర్హతలున్నాయి' అని అతుల్ హసన్ తెలిపారు. మరొకవైపు సీనియర్ ఆటగాళ్లైన ఉన్కుక్త్ చంద్, మనన్ శర్మ, మిలింద్ కుమార్ల సైతం జట్టు నుంచి తప్పించారు. -
సాంగ్వాన్‌పై 18 నెలల నిషేధం
న్యూఢిల్లీ: డోప్ టెస్టులో విఫలమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ ప్రదీప్ సాంగ్వాన్‌పై 18 నెలల పాటు నిషేధం విధించారు. నిషేధిత జాబితాలో ఉన్న స్టానొజోల్ ఉత్ప్రేరకం వాడినందుకు బీసీసీఐకి చెందిన యాంటీ డోపింగ్ ట్రిబ్యునల్ 23 ఏళ్ల సాంగ్వాన్‌పై వేటు వేసింది. అయితే అధిక బరువును తగ్గిస్తుందని జిమ్ శిక్షకుడు చెబితేనే ఆ మందును తీసుకున్నట్టు ఈనెల 1న సాంగ్వాన్ ట్రిబ్యునల్ ముందు తన వాదనలు వినిపించాడు. మే 6, 2013 నుంచి నవంబర్ 5, 2014 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ కాలంలో అతడు ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకోడానికి వీలుం డదు. దీంతో డోప్ టెస్టులో దొరికిన రెండో ఐపీఎల్ ఆటగాడిగా సాంగ్వాన్ నిలిచాడు. గతంలో పాక్ పేసర్ మహ్మద్ ఆసిఫ్‌పై కూడా నిషేధం విధించారు. 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 123 వికెట్లు తీసిన సాంగ్వాన్ గత రెండు సీజన్ల నుంచి కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.