సాంగ్వాన్‌పై 18 నెలల నిషేధం
న్యూఢిల్లీ: డోప్ టెస్టులో విఫలమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ ప్రదీప్ సాంగ్వాన్‌పై 18 నెలల పాటు నిషేధం విధించారు. నిషేధిత జాబితాలో ఉన్న స్టానొజోల్ ఉత్ప్రేరకం వాడినందుకు బీసీసీఐకి చెందిన యాంటీ డోపింగ్ ట్రిబ్యునల్ 23 ఏళ్ల సాంగ్వాన్‌పై వేటు వేసింది. అయితే అధిక బరువును తగ్గిస్తుందని జిమ్ శిక్షకుడు చెబితేనే ఆ మందును తీసుకున్నట్టు ఈనెల 1న సాంగ్వాన్ ట్రిబ్యునల్ ముందు తన వాదనలు వినిపించాడు. మే 6, 2013 నుంచి నవంబర్ 5, 2014 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ట్రిబ్యునల్ పేర్కొంది.
ఈ కాలంలో అతడు ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకోడానికి వీలుం డదు. దీంతో డోప్ టెస్టులో దొరికిన రెండో ఐపీఎల్ ఆటగాడిగా సాంగ్వాన్ నిలిచాడు. గతంలో పాక్ పేసర్ మహ్మద్ ఆసిఫ్‌పై కూడా నిషేధం విధించారు. 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 123 వికెట్లు తీసిన సాంగ్వాన్ గత రెండు సీజన్ల నుంచి కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.