టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని అతని చిన్ననాటి మిత్రుడు, భారత అండర్ 19 జట్టు మాజీ సభ్యుడు ప్రదీప్ సాంగ్వాన్ ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు రాసిన వ్యాసంలో షేర్ చేసుకున్నాడు. జూనియర్ క్రికెట్‌లో కోహ్లికి రూమ్ మేట్ అయిన సాంగ్వాన్.. 2008 అండర్19 ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఓ సంఘటనను తన వ్యాసంలో ప్రస్తావించాడు.
చిన్నతనంలో కోహ్లి స్ట్రీట్ ఫుడ్‌ను చాలా ఇష్టంగా తినేవాడని.. కూర్మా రోల్స్, చికెన్ రోల్స్ ఇలా కనిపించిన ప్రతి ఐటెంను వదిలేవాడుకాదని, 2008కి ముందు దక్షిణాఫ్రికా పర్యటనలో(అండర్ 19 జట్టుతో) కూడా ఇలానే స్ట్రీట్ ఫుడ్ (మటన్ రోల్స్) కోసం వెళ్లి లైఫ్‌ను రిస్క్ చేశాడని, అందులో నేను కూడా బాధితుడినేనని గుర్తు చేసుకున్నాడు.
తమ జట్టు బస చేసే హోటల్‌కు దగ్గర్లో రుచికరమైన మటన్ రోల్స్ దొరుకుతాయని తెలిసిన వ్యక్తి చెప్పడంతో కోహ్లి తనను వెంటతీసుకు వెళ్లాడని, ఆ స్ట్రీట్ ఫుడ్ దొరికే ప్రాంతం అంత సురక్షితం కాదని, కొన్ని రోజుల ముందే అక్కడ పెద్ద గొడవ జరిగిందని తమ డ్రైవర్ వారించినా కోహ్లి వినలేదని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడి వెళ్లి మటన్ రోల్స్‌ను టేస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టాడని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.
ఎట్టకేలకు తాము ఆ ప్రాంతానికి వెళ్లి రుచికరమైన మటన్ రోల్స్‌ను ఆరగించామని, అయితే తిరుగు ప్రయాణంలో కొందరు దుండగులు తమ కారును వెంబడించారని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
కాగా, విరాట్ కోహ్లి టీమిండియాలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 2012 నుంచి కోహ్లి తన ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్‌నెస్ పై దృష్టి సారించాడు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా కష్టపడుతుంటాడు. అత్యుత్తమ ఫిట్‌నెస్ ప్రమాణాలు పాటిస్తూ సమకాలీకులతో పాటు నేటి తరం క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు.
చదవండి: పరుగుల వరద పారిస్తున్న మరో కోహ్లి.. 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు
Comments
Please login to add a commentAdd a comment