![DDCA removes Rishabh Pant from Delhi captaincy - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/7/pant.jpg.webp?itok=XdhdHSBU)
న్యూఢిల్లీ:ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో నెలకొన్న అంతర్గత రాజకీయాల కారణంగా రిషబ్ పంత్‌ను ఢిల్లీ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించారు. అదే సమయంలో చాలాకాలంగా ఢిల్లీకి జట్టులో చోటు కోల్పోయిన లెఫ్టార్మ్ స్సిన్నర్ ప్రదీప్ సాంగ్వాన్‌ను రిషబ్ పంత్ స్థానంలో సారథిగా ఎంపిక చేస్తూ డీడీసీఏ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 2016లో ఢిల్లీ తరపున చివరిసారి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన సాంగ్వాన్‌కు ఒక్కసారిగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. ఓవరాల్‌గా చూస్తే 2017 ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ తరపున సాంగ్వాన్ చివరిసారి కనిపించాడు. నిషేధిత ఉత్ర్పేరకం వాడి పాజిటివ్‌గా తేలిన తొలి క్రికెటర్‌గానూ సాంగ్వాన్ నిలవడం గమనార్హం.
అయితే రిషబ్ పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, ఆపై సాంగ్వాన్‌కు ఆ బాధ్యతలను అప్పగించడాన్ని ఢిల్లీ సెలక్టర్ల చైర్మన్ అతుల్ వాసన్ సమర్దించుకున్నాడు. 'రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతున్న కారణంగానే ఆ భారాన్ని తగ్గించేందుకు అతని కెప్టెన్సీకి ఉద్వాసన పలికాం. అదే సమయంలో సీనియర్ ఆటగాడైన సాంగ్వాన్‌ను సారథిగా ఎంపిక చేశాం. కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి సాంగ్వాన్‌కు అన్ని అర్హతలున్నాయి' అని అతుల్ హసన్ తెలిపారు. మరొకవైపు సీనియర్ ఆటగాళ్లైన ఉన్కుక్త్ చంద్, మనన్ శర్మ, మిలింద్ కుమార్‌ల సైతం జట్టు నుంచి తప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment