Prakash sing
-
ఎవరు టాపర్లో తెలుసుకోవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ పౌరల సామాజిక మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ‘సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్’ను సుప్రీం కోర్టు అభ్యంతరాల కారణంగా ఆగస్టు మూడవ తేదీన విరమించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఎంతో మంది భారతీయుల సామాజిక ఖాతాలు ప్రభుత్వం నిఘా నేత్రంలో ఉన్నాయనే విషయం ఎందరికి తెలుసు? ఆ నిఘా నేత్రం పేరు ‘అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఫర్ సోషల్ మీడియా అనలిటిక్స్ (ఏఏఎస్‌ఎంఏ)’. ఈ టూల్‌ను కేంద్రంలోని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ నిధులతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ 2013–2014లో రూపొందించింది. ఈ ఆస్మా టూల్‌ను ఎలాంటి ప్రచారం కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం 2017, ఏప్రిల్ నెల నుంచి దేశంలోని 40 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలోగా మరో 75 ప్రభుత్వ సంస్థల్లో అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని వ్యూహాత్మక ప్రాజెక్టుగా, వ్యూహాత్మక పురోగతిని పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేశామని కేంద్రం పేర్కొన్నట్లు ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ తన 2016–2017 వార్షిక నివేదకలో పేర్కొంది. ఆస్మాపై కేంద్రంలోని మంత్రి, కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయని, ఈ టూల్ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీన్ని తమ అంతర్గత అవసరాల కోసం ఉపయోగిస్తున్న కొన్ని ఏజెన్సీలు లిఖిత పూర్వకంగా కూడా కేంద్రానికి తెలిపాయని ఆ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ ఆస్మాను ఏ ప్రభుత్వ సంస్థలు వాడుతున్నాయో, ఎందుకోసం వాడుతున్నాయో, ఏ ఏజెన్సీలు లిఖితపూర్వకంగా సంతృప్తి వ్యక్తం చేశాయో మాత్రం వెల్లడించలేదు. అలాగే ఈ ఆస్మాను ఇంటెలిజెన్సీ, భద్రతా విభాగాలకే పరిమితం చేశాయా, లేదా ? అన్న విషయంలో కూడా స్పష్టత లేదు. ఆస్మా గురించి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దీన్ని ఇన్స్టాల్ చేసినట్లయితే 24 గంటలపాటు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఫ్లికర్, గూగుల్ తదితర సామాజిక మాధ్యమాలను ఉపయోగించే ఖాతాదారులు ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకునే సమాచారాన్ని విశ్లేషించవచ్చు. సోషల్ మీడియా ప్రొఫైళ్లను, వారి పోస్టులను వీక్షించవచ్చు. వారి పోస్టింగులను సానుకూలం లేదా ప్రతికూలం అంటూ వర్గీకరణ కూడా చేయవచ్చు. అంటే ఎవరు మంచి వారో, ఎవరు చెడ్డవారో విశ్లేషించవచ్చు. ఏ సోషల్ మీడియాలో ఎవరు టాపర్లో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలోని పోలీసు విభాగంలో నేరస్థులపై నిఘాను కొనసాగించేందుకు ఓ సోషల్ మీడియా హబ్‌ను ఏర్పాటు చేయాలంటూ ‘నేషనల్ పోలీసు మిషన్’ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో ఈ ఆస్మాను పోలీసు విభాగాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు అనధికారికంగా తెల్సింది. ఎందుకంటే నేరస్థులెవరో, నేరస్థులు ఎవరుకాదో తెలుసుకోవడానికే కాకుండా ఎవరు నేర స్వభావులు ఎవరో ముందుగానే తెలుసుకొని వారిపై నిఘా కొనసాగించడం ద్వారా నేరం చేయకుండా వారిని నియంత్రించవచ్చన వాదన కూడా కొంత మంది పోలీసు అధికారుల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ టూల్‌ను సైనిక బలగాలు కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. నేరస్థుల కదలికలను తెలుసుకునేందుకు వారి ఫోన్లపై నిఘా పెట్టడమన్నది పోలీసు విభాగంలో ఎప్పటి నుంచో కొనసాగుతోందని, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందరిపై నిఘా పెట్టడం మంచిది కాదని ఉత్తరప్రదేశ్‌లో పోలీసు డైరెక్టర్ జనరల్‌గా, సరిహద్దు భద్రతా దళానికి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ప్రకాష్ సింగ్ అభిప్రాయపడ్డారు. నియంతృత్వ పాలనలో నిఘా అవసరమంటే ఆలోచించవచ్చని, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించుకునే అవకాశం ఉన్న ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిఘా అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థలు పౌరుల సోషల్ మీడియా డేటాను పెద్ద ఎత్తున సేకరిస్తూ విశ్లేషిస్తుందంటే అది కచ్చితంగా పౌరులపై నిఘా కొనసాగించడమేనని ‘గ్లోబల్ డిజిటల్ రైట్స్’లో పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రామన్ జిత్ సింగ్ చిమా వ్యాఖ్యానించారు. అందరికి అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషిస్తే పర్వాలేదుగానీ, వ్యక్తిగతమైన డేటాను విశ్లేషించడమంటే నేరమే అవుతుందని ఆయన అన్నారు. ఆస్మా టూల్ గురించి అన్నింటికన్నా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పారదర్శకత లేకపోవడమని ‘సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద పరిశోధనా సంస్థకు చెందిన అంబర్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ టూల్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో, ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియదు. ప్రతి వ్యక్తి సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా కొనసాగించడమంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లోని రాజకీయ కన్సల్టెంట్ సంస్థ ‘కేంబ్రిడ్జి అనలిటికా’ ఫేస్బుక్ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆస్మా లాంటి నిఘా టూల్స్‌పై ఆందోళన పెరిగింది. అన్నింటా ప్రచారానికి ముందుండే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ టూల్‌ను గుట్టుగా అమలు చేస్తుందంటే రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికేనని కొంత మంది రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
జైల్లో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య
బాగ్పట్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ జైలులో ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఓ గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో మృతి చెందింది అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ మున్నా బజరంగీ అలియాస్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్(51). 2017లో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసుకు సంబంధించి కోర్టులో ప్రవేశపెట్టేందుకు గాను బజరంగీని ఆదివారమే ఝాన్సీ జైలు నుంచి బాగ్పట్ జైలుకు తీసుకువచ్చారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జైల్లో తన గదిలోనే ఉంటున్న మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతీతో గోడవ జరిగిందని.. ఈ క్రమంలో బజరంగీపై సునీల్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో బజరంగీ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. బజరంగీపై ఒకటి కంటే ఎక్కువ సార్లు తుపాకీతో సునీల్ కాల్పులు జరిపాడని.. అనంతరం తుపాకీని మురుగుకాలువలో విసిరేశాడని బాగ్పట్ ఎస్పీ జయప్రకాశ్ వెల్లడించారు. తుపాకీ జైలులోకి ఎలా వచ్చిందన్న దానిపైనా విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. దర్యాప్తుకు ఆదేశించారు. అలాగే ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. గత నెలలో బజరంగీ భార్య సీమా సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. తన భర్తను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే ఈ క్రమంలోనే బజరంగీ హత్యకు గురి కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. -
వైఫల్యాల మధ్య వైభవం బాధ
రాజకీయ తప్పిదాలు, చరిత్ర చేసిన గాయాలు అంత తొందరగా మాసిపోవు. కానీ గాయాల నుంచి కూడా లబ్ధి పొందేవారు ఉన్నకాల మిది. భింద్రన్‌వాలేను ఇప్పటికీ తమ ఆరాధ్యదైవంగా కొలిచేవారికి అక్కడ కొదవ లేదు. అధికార పక్షాలు పాలనా వ్యవహారాల దగ్గర చతికిల పడితే విపత్కర పరిణామాలు తప్పవు. పంజాబ్‌లో జరుతున్నది అదే. ప్రకాశ్‌సింగ్ బాదల్ నాయకత్వంలోని శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి ప్రభుత్వం నీరుగారిపోయిందని ఇటీవలి పరిణామాలే సాక్ష్యం చెబుతాయి. పంజాబ్ వంటి రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడడం ఇందుకు పెద్ద నిదర్శనం. అంతే కాదు, నాయకత్వ వైఫల్యం వల్ల, గతంలో ఎన్నో గాయాలను చవిచూసిన ఆ సరిహద్దు రాష్ట్రంలో సద్దుమణిగినట్టు భావించిన సంక్షోభాలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఈ నెల ఆరున స్వర్ణ దేవాలయంలో జరిగిన ఘటనలు ఇందుకు సంబంధించినవే. దేశ విభజనలో ఎంతో విషాదాన్ని మూటగట్టుకున్న ప్రాంతం పంజాబ్. సిక్కులు గాయపడిన జాతి. కాలం, రూ పం వేరు కావచ్చు కానీ, 1980 దశకంలో ఆ రాష్ట్రాన్ని కుది పేసిన ఖలిస్థాన్ రగడ ఆ దారుణ విషాదాలకు కొనసాగింపు అనే అనుకోవాలి. ఖలిస్థాన్ ఏర్పాటు నినాదంతో ఆరంభ మైన ఆందోళన ఆధునిక భారత చరిత్రలోనే రక్తసిక్త వాక్యం. ఖలిస్థాన్ పరిణామాల పతాక సన్నివేశమే ఆపరేషన్ బ్లూ స్టార్. 1984లో జూన్ 3-8 మధ్య హర్మిందర్ సాహెబ్ లేదా స్వర్ణదేవాలయం మీద జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ (సైనిక చర్య) సిక్కుల మనసులను తీవ్రంగానే గాయపరిచింది. ఖలి స్థాన్ ఏర్పాటు నినాదంతో ఉగ్రవాద పంథాలో ఉద్యమిం చిన సంత్ జర్నయిల్‌సింగ్ భింద్రన్‌వాలే ఆ మందిరాన్ని కేంద్ర కార్యాలయం చేసుకున్నాడు. నాటి ప్రధాని ఇందిర ఆదేశం మేరకు సైన్యం దాడి చేసింది. తదనంతర పరిణా మాలు అత్యంత విషాదకరమైనవి. ఆపరేషన్ బ్లూస్టార్ అనంతర పరిణామం ఇందిరాగాంధీ దారుణ హత్య. ఇందిర హత్య తదనంతర పరిణామం ఢిల్లీలో, దేశంలో సిక్కుల ఊచకోత. ఇవన్నీ చరిత్ర మీద బాధాకరమైన ముద్రలను వేసి వెళ్లాయి. ఇదంతా గతం. ఆపరేషన్ బ్లూస్టార్ దుర్ఘటన జరిగి 30 సంవత్సరాలు గ డిచిన సందర్భంగా మొన్న ఆరోతేదీన స్వర్ణ దేవాలయంలో కార్యక్రమం జరిగినపుడు అవాంఛనీయ పరిణామాలు చో టు చేసుకున్నాయి. ఖలిస్థాన్ అనుకూల నినాదాలు వినిపిం చాయి. ఆ అంశాన్ని సమర్థిస్తున్నవారు, ఇతరుల మధ్య ఘర్ష ణ జరిగింది. మత చిహ్నంగా సిక్కులు దరించే కరవాలా లతోనే, అది కూడా స్వర్ణ ఆలయంలోనే ఘర్షణకు దిగారు. పన్నెండు మంది గాయపడ్డారు. ఇదో ప్రమాద హెచ్చరిక. రాజకీయ తప్పిదాలు, చరిత్ర చేసిన గాయాలు అంత తొందరగా మాసిపోవు. కానీ గాయాల నుంచి కూడా లబ్ధి పొందేవారు ఉన్నకాలమిది. భింద్రన్‌వాలేను ఇప్పటికీ తమ ఆరాధ్యదైవంగా కొలిచేవారికి అక్కడ కొదవ లేదు. దేని మీద అయినా వ్యాపారం చేయగలిగిన ఘనులకు ఈ ఒక్క అంశం చాలు. అందుకే భింద్రన్‌వాలే ముఖాన్ని ముద్రించిన చొక్కా లను కొద్దికాలంగా అమృత్సర్ పరిసరాలలో విపరీతంగా అమ్ముతున్నారు. సున్నిత అంశానికి లొంగిపోయేవారే ఎప్పు డూ ఎక్కువమంది ఉంటారు. ముఖ్యంగా యువతరం ఇం దుకు లక్ష్యంగా ఉంటారు. అందుకే భింద్రన్‌వాలే బొమ్మ ము ద్రించిన టీ షర్టులు వేసుకుని కనిపించే సిక్కు యువకులు తరుచు కనిపిస్తున్నారు. 1980 దశకంలో ఆ ఉద్యమం ఏం సాధించిందో చాలామందికి అక్కరలేదు. అయినా భింద్రన్ వాలేను ఆరాధించేవారు కనిపిస్తూనే ఉన్నారు. ఇందుకు చా లా కారణాలు చెబుతున్నారు. సిక్కు యువకులు ప్రస్తుతం మత్తుమందులలో తేలియాడుతున్నారు. వారికి ఏదో విధమై న ‘ప్రతిష్ట’ కావాలి. కానీ ఆ రాష్ట్ర నాయకులలో యువకు లకు ప్రేరణ ఇవ్వగలిగిన నాయకులు ఇప్పుడు ఎవరూ లేరు. అందుకే భింద్రన్‌వాలేను జ్ఞాపకానికి ప్రాణ ప్రతిష్ట చేయాలని చూస్తున్నారు. 80 దశకంలో అతడి పేరు వింటే భారతదేశం మొత్తం గడగడలాడిపోయి ఉండవచ్చు. కానీ కొందరు దారి తప్పిన సిక్కుల దృష్టిలో ఆయన ఓ వీరుడు. ఇలాంటి జాడలే ప్రస్తుతం పంజాబ్‌లో కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని సుస్పష్టంగా ప్రపంచం ఆవిష్కరించినదే జూన్ ఆరు నాటి ఘటన. సిక్కు యువకులు ప్రస్తుతం ‘వైభవం’ కోసం పాకులా డుతున్నారు. అందుకే సంచలనంలో కూడా వారికి వైభవం కనిపిస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్లో అలాంటి అంశాలు కనిపించాయి. అందుకే దేశంలో ఎక్కడా ఒక్క సీటు కూడా గెలుచుకోని ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. మోడీ కంటే కేజ్రీవాల్‌లోనే వారికి ‘హీరో’ కనిపించాడు. ఇదంతా చూస్తుంటే సిక్కులు గత వైభవం కోసం అర్రులు చాస్తున్నారని అనుకోలేం. గత గాయాలు వారిని మళ్లీ బాధపెట్టడం మొదలయిందనడమే నిజం. భింద్రన్‌వాలే నామస్మరణ దానికో పైపూత మాత్రమే. డాక్టర్ గోపరాజు నారాయణరావు