‘ప్రాణహిత’పై నేడు ఢిల్లీకి విద్యాసాగర్‌రావు
హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయమై కేంద్ర జల సంఘం అడిగిన హైడ్రాలజీ లెక్కలపై వివరణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు గురువారం (నేడు) ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన శుక్రవారం కేంద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యాతో సమావేశమై హైడ్రాలజీ లెక్కలపై చర్చించనున్నారు.