ఎత్తు తగ్గింపుతో తెలంగాణకు అన్యాయం
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గోదావరిపై ప్రాణహిత ఎత్తును తగ్గించడం వల్ల తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతంగా నష్టపరుస్తోందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మిస్తే ఎల్లంపల్లి దాకా గ్రావిటీ ద్వారానే నీరు వస్తుందని, 148 మీటర్లకు ఆ ఎత్తును తగ్గించడం వల్ల లిఫ్టుల నిర్మాణం, నిర్వహణ భారం తెలంగాణ ప్రజలపై పడుతుందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి 152 మీటర్ల ఎత్తుకు ఒప్పించకుండా మహారాష్ట్ర ప్రయోజనాలకోసం టీఆర్ఎస్ నేతలు పనిచేశారని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రతినిధిలా మంత్రి హరీశ్‌రావు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.