prathima hospital
-
కేంద్ర మంత్రులు తిట్టిపోయిన మరునాడే అవార్డులు వస్తున్నాయి: సీఎం కేసీఆర్
సాక్షి, వరంగల్: అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైద్య విద్య కోసం రష్యా చైనా, ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలోనే వైద్య విద్య చదివేందుకు సరిపడా సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో అయిదు కాలేజీలు ఉండగా.. కొత్తగా 12 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని తెలిపారు. హరీశ్‌రావు సారథ్యంలో ఇది సాధ్యమైందన్న కేసీఆర్.. త్వరలోనే జిల్లాకొక మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. కేంద్ర మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను, మంత్రులను తిట్టిపోతారని, కేంద్ర మంత్రులు వచ్చి తిట్టిపోయిన మరునాడే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని తెలిపారు. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల అండతో ఉద్యమం సాగించి, రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ ఇవాళ సాకారం అయ్యాయి. తెలంగాణ జీఎస్డీపీ ఎక్కువగా ఉంది. పరిశుభ్రత, పచ్చదనంతో పాటు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నాము. తెలంగాణ ప్రజల్లో అద్భుతమైన చైతన్యం ఉంది. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు పని చేస్తున్నాం. ఆరోగ్యం రంగంలో కూడా అద్భుతాలు సాధించాం. మరిన్ని విజయాలు సాధించాలి. తెచ్చుకున్న తెలంగాణ దేశానికే ఒక మార్గదర్శకంగా మారింది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు -
కరీంనగర్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన
-
నగరంలో సైఫ్‌కరీనా జంట సందడి
-
నగరంలో సైఫ్‌కరీనా జంట సందడి
జూబ్లీహిల్స్/కాచిగూడ: రోగులకు వైద్య సేవలందిస్తూ వేలాదిమందికి ప్రాణదానం చేసే ఆసుపత్రికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయడం సంతోషకరమని ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్‌ఆలీఖాన్, ఆయన సతీమణి, హీరోయిన్ కరీనాకపూర్ పేర్కొన్నారు. శనివారం బంజారాహిల్స్ పార్క్ హయత్ హోట ల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తాము ఇప్పటికే కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రిని సందర్శించి తక్కువ ఖర్చుతో అందిస్తున్న అత్యుత్తమ సేవలు స్వయంగా చూసినట్లు తెలిపారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ హరిణి బోయనపల్లి మాట్లాడుతూ కరీంనగర్, కాచిగూడ, కూకట్‌పల్లిలలో తాము ఇప్పటికే 1500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టామని, మరో 350 కోట్ల పెట్టుబడి పెట్టి అత్యాధునిక వైద్యసదుపాయాలతో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రతి జిల్లాలో 50 నుండి 100 పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్థానికంగా పనిచేసే వైద్యులను భాగస్వామ్యులుగా చేసుకొని వారికి వాటా ఇవ్వడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వరంగల్ పట్ణణంలో 5 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 100 కోట్ల పెట్టుబడితో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ బోయనపల్లి శ్రీనివాసరావు, డైరెక్టర్ హాసిని, డాక్టర్ ప్రభాకర్‌రావు, ఎంపీ బోయనపల్లి వినోద్‌కుమార్ పాల్గొన్నారు. సైఫ్, కరీనాలకు వైద్యపరీక్షలు ప్రతిమ ఆస్పత్రిని సందర్శించిన సైఫ్ ఆలీఖాన్, కరీనాకపూర్‌లకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న వీరు ఆస్పత్రిలో దాదాపు గంటన్నరపాటు గడిపారు. సైఫ్ దంపతుల రాకతో అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.