Pratyusha Banerjee suicide
-
మరో టీవీనటిపై రాహుల్ ఆరోపణలు..
ముంబై: టీవీనటి ప్రత్యూష్ బెనర్జీ అనుమానాస్పద మరణం కేసు ఒక కొలిక్కి వచ్చేలా కనపడ్డం లేదు. ఆమె చనిపోయి దాదాపు నెల రోజులు దాటినా రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా ఆమె ప్రియుడు, ప్రధాన నిందితుడు రాహుల్ రాజ్ సింగ్ మరో టీవీ నటి కామ్యా పంజాబీపై ఆరోపణలు గుప్పించాడు. ఆమె ప్రత్యూష దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించలేదని ఆరోపించాడు. ప్రత్యూష ఆత్మహత్య కేసులో తన స్నేహితులు చెప్పిందంతా అబద్ధమని పేర్కొన్నాడు. ప్రత్యూష బెనర్జీ దగ్గరనుంచి కామ్యా పంజాబి రెండున్నర లక్షలు అప్పుగా తీసుకుందని, అవి తిరిగి వెనక్కి ఇవ్వలేదని విమర్శించాడు. అయితే ఈ ఆరోపణలను కామ్యా తిరస్కరించింది. రాహుల్ పూర్తిగా తప్పుడు వాదనలు చేస్తున్నాడంటూ కొట్టి పారేసింది. బీసీఎల్ సీజన్ లో తాను జైపూర్ రాజ్ జోషిలే టీంకు యజమానిగా ఉన్నానని తెలిపింది. ఆ సమయంలో తన టీంకు ప్రత్యూష్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిందని కామ్యా తెలిపింది. ఈ క్రమంలో ప్ర్యతూష తండ్రి ఎన్జీవో ప్రమోషన్ లో భాగంగా తనకు రెండున్నర లక్షలు ఇచ్చిందని తెలిపింది. ఆ సమయంలో ఇద్దరం అనేక మీడియా ఇంటర్వ్యూ ల్లో పాల్గొన్నామని పేర్కొంది. దీనికి సంబంధించిన తన దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పింది. ఇది జరిగి సుమారు మూడేళ్లు అయిందనీ, అప్పటికీ ప్రత్యూష్ జీవితంలోకి అసలు రాహుల్ ప్రవేశించనే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికైనా రాహుల్ నిజాలు చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా గత ఏప్రిల్ 1 బాలికా వధు గా బుల్లితెరకు సుపరిచితమైన ప్రత్యూష బెనర్జీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మరి కామ్యా వివరణపై రాహుల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
'రాహుల్ చూడు.. ఇప్పుడేం చేస్తానో'
ఏప్రిల్ 1న తాను ఆత్మహత్య చేసుకోవడానికి గంట ముందు టీవీనటి ప్రత్యూష బెనర్జీ తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ కు ఫోన్ చేసింది. దాదాపు 201 సెకన్ల నిడివితో ఉన్న ఈ టెలిఫోనిక్ సంభాషణలో పలు కీలక విషయాలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో ఈ సంభాషణ ఆడియో క్లిప్పును వినాలని బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి మృదుల భట్కర్ నిర్ణయించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ మృదుల సోమవారం ప్రధాన నిందితుడు రాహుల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కీలకంగా భావిస్తున్న ప్రత్యూష-రాహుల్ చివరి ఫోన్ కాల్ లో ఏం మాట్లాడారు. ఆ ఆడియోక్లిప్పులో ఏముంది. తదితర అంశాలను తాజాగా ముంబైకి చెందిన 'మిడ్-డే' టాబ్లాయిడ్ ప్రచురించింది. ఆడియో క్లిప్ సంభాషణ ప్రత్యూష: నువ్వు మోసగాడివి. నన్ను మోసం చేశావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేశావు. ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నానో.. రాహుల్: ఏమైంది. నేను ఇంటికొచ్చాక నీతో మాట్లాడుతాను. నేను దారిలో ఉన్నాను. నేను ఇంటికొచ్చేవరకు ఏమీ చేయకు. ప్రత్యూషను ఆత్మహత్యకు పూరికొల్పినట్టు ప్రాథమిక ఆధారాలు లేనందున రాహుల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రాహుల్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను సెషన్ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. 'బాలికా వధు' సీరియల్ హీరోయిన్ అయిన ప్రత్యూష బెనర్జీ మృతికి రాహులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.