Praveen Rao
-
నిబంధనలకు విరుద్దంగా నడిచే పాఠశాలల బస్సుల పై చర్యలు
-
నాణ్యమైన విద్య కోసమే ఫీజుల పెంపు
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య కోసం సెల్ఫ్ ఫైనాన్స్ వ్యవసాయ కోర్సుల్లో ఫీజులు పెంచక తప్పదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు స్పష్టం చేశారు. ఒకేసారి డొనేషన్ ఫీజు కింద రూ.10 లక్షలు, ఏడాదికి రెగ్యులర్ ఫీజు కింద రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నామన్నారు. ఈవిధంగా వచ్చిన సొమ్మును హాస్టళ్ల అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులు ఫైవ్‌స్టార్ స్థాయిలో ఉనప్పటికీ ఫీజులు మాత్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 20–25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని వివరించారు. కొత్తగా 11 రకాల వంగడాలను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ప్రవీణ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గత ఐదారేళ్లలో 47 రకాల వంగడాలను విడుదల చేశామన్నారు. ఐదు రకాల వరి కొత్త వంగడాలు కొత్తగా విడుదల చేస్తున్న 11 వంగడాల్లో ఐదు వరి రకాలు, రెండు జొన్న, కంది, పెసర, సోయా చిక్కుడు, నువ్వులకు చెందిన వంగడాలు ఒకటి చొప్పున ఉన్నాయని ప్రవీణ్ రావు తెలిపారు. జొన్న రకాల వంగడాలను పండించాక వాటిని తిన్నవారికి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందని, ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనమన్నారు. చీడపీడల్ని తట్టుకునే వంగడాల రూపకల్పనకి వర్సిటీ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వర్సిటీ విద్యార్థులు ఏటా 30కిపైగా జేఆర్ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిఫ్)లు సాధిస్తున్నారన్నారు. రోబోటిక్స్‌తో కలుపు నివారణ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ వంటి అధునాతన పరిజ్ఞాన వినియోగంలో వర్సిటీ ముందంజలో ఉందని ప్రవీణ్ రావు వివరించారు. ‘రోబోటిక్స్ సాంకేతికతను మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణకు ఉపయోగించుకోవచ్చు. డ్రోన్ పరిజ్ఞానాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలని భావిస్తున్నాం. తద్వారా డ్రోన్లతో పంటలపై పురుగు మందులను పిచికారీ చేయొచ్చు. డ్రోన్లపై నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీలో త్వరలోనే అగ్రిహబ్‌ని ప్రారంభిస్తున్నాం. కేంద్రప్రభుత్వం ఈ మధ్య ఒక జిల్లాకి ఒక పంట పథకంలో భాగంగా మన వర్సిటీకి మూడు జిల్లాలకి రూ.8.4 కోట్లు మంజూరు చేసింది. వాటిని జగిత్యాలలో వరి, మామిడి, వరంగల్ జిల్లాలో పసుపు, మిరప, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చిరుధాన్యాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం’అని వివరించారు. వర్సిటీ తరపున రాష్ట్రంలోని అన్ని జిల్లాల సాయిల్ మ్యాపింగ్ పూర్తయిందని ఆయన చెప్పారు. -
ఇన్ఫోసిస్ లాభం 4,335 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 6 శాతం పెరిగింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా వ్యాపార అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2020–21) ఆదాయ, మార్జిన్ల అంచనాలను వెల్లడించడం లేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. పరిస్థితులు మెరుగుపడ్డాక ఈ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది. కాగా గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను ఈ కంపెనీ అందుకోలేకపోయింది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.9.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.4,078 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ4లో రూ.4,335 కోట్లకు పెరిగింది. అయితే గత క్యూ3 నికర లాభంతో పోల్చితే 3 శాతం క్షీణత నమోదైంది. ఇతర ఆదాయం 26 శాతం తగ్గడం, అంతకు ముందటి క్వార్టర్లో పన్ను రాయితీలు లభించడంతో నికర లాభం ఈ క్యూ4లో ఈ స్థాయికే పరిమితమైంది. ► ఆదాయం రూ.21,539 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.23,267 కోట్లకు చేరింది. ► డాలర్ల పరంగా చూస్తే, గత క్యూ4లో (సీక్వెన్షియల్‌గా)నికర లాభం 6 శాతం తగ్గి 59 కోట్ల డాలర్లకు, ఆదాయం 1.4 శాతం తగ్గి 320 కోట్ల డాలర్లకు తగ్గింది. ► గత క్యూ4లో 165 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంతో మొత్తం డీల్స్ విలువ పూర్తి ఆర్థిక సంవత్సరానికి 900 కోట్ల డాలర్లకు చేరాయి. ► ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2019–20లో నికర లాభం 8% వృద్ధితో రూ.16,639 కోట్లకు, ఆదాయం 9.8 శాతం పెరిగి రూ.90,791 కోట్లకు చేరాయి. ఆదాయం 10–10.5% రేంజ్లో పెరగగలదన్న అంచనాలను కంపెనీ అందుకోలేకపోయింది. ► ఈ ఏడాది మార్చి చివరికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.27,276 కోట్లుగా ఉన్నాయి. ఎలాంటి రుణ భారం లేదు. ► ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,42,371కు చేరింది. గత క్యూ4లో ఉద్యోగుల వలస(అట్రిషన్ రేటు) 21 శాతంగా ఉంది. ► ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని ఇన్ఫోసిస్ తెలిపింది. వారు కోలుకోవడానికి తగిన తోడ్పాటునందిస్తామని పేర్కొంది. జాబ్ ఆఫర్లు ఇచ్చిన వారందరికీ కొలువులు ఇస్తామని భరోసా ఇచ్చింది. అయితే, వేతనాల పెంపు, అలాగే ప్రమోషన్లు కూడా ఉండవని తెలిపింది. ► మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్ 3.7 శాతం లాభంతో రూ.653 వద్ద ముగిసింది. కాగా అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టైన ఇన్ఫోసిస్ ఏడీఆర్ మాత్రం 1 శాతం లాభంతో 8.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సమస్యల నుంచి గట్టెక్కుతాం... గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10 శాతం వృద్ధి, 21.3 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించాం. సమీప భవిష్యత్తులో మా వ్యాపారంపై ప్రభావం ఉంటుంది. రికవరీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. నాణ్యమైన సేవలందించగలగడం, పుష్కలంగా నిధుల దన్నుతో సమస్యలను అధిగమించగలం. –సలిల్ పరేఖ్, సీఈఓ, ఎమ్డీ, ఇన్ఫోసిస్ ఫలితాలు సంతృప్తికరం... వివిధ విభాగాల్లో, దేశాల్లో మంచి వృద్ధిని సాధించాం. భారీ డీల్స్ పెరిగాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం సంతృప్తికరమైన ఫలితాలిచ్చింది. –ప్రవీణ్ రావ్, సీఓఓ, ఇన్ఫోసిస్ -
ప్రవీణ్‌రావు నియామకం వెనుక అవినీతి
-
వ్యవసాయ కోర్సులకు సొంత ప్రవేశ పరీక్ష
- జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నూతన వీసీ ప్రవీణ్‌రావు వెల్లడి - వర్సిటీలో అడుగడుగునా నిఘా... సీసీ కెమెరాల ఏర్పాటు - అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని హెచ్చరిక - ప్రతీ రైతు వద్దకు అధికారిని పంపలేం... టెక్నాలజీని ఉపయోగిస్తామని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్ వైద్య ప్రవేశాలకు వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌కు బదులు కేవలం నీట్ ర్యాంకులపైనే ఆధారపడే అవకాశం ఉండటంతో ఇక వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు సొంతంగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు వెల్లడించారు. వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించాక సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ మెడికల్ ర్యాంకులపైనే ఆధారపడ్డామని... నీట్ వస్తే సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించడమా మరో విధంగా వెళ్లడమా అనే అంశంపై కసరత్తు చేస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో అవినీతికి సాధారణ ఉద్యోగి మొదలు... ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి వరకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమన్నారు. ఆర్థిక నిర్వహణ అంతా ఆన్లైన్లోనే జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయంలోనూ... ఆరుబయటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్సిటీ పరిపాలనా భవనంతోపాటు పోలీస్ స్టేషన్‌కూ ఈ సీసీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయన్నారు. ఇదంతా విద్యార్థుల సంరక్షణను దష్టిలో పెట్టుకొనే చేస్తున్నామన్నారు. అలాగే పరిశోధన కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. జవాబుదారీతనం, పారదర్శకతగా విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తానన్నారు. అడ్మిషన్ల ప్రక్రియలో ప్రక్షాళన చర్యలు తీసుకుంటామన్నారు. విశ్వవిద్యాలయంలోని పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు తీసుకెళ్తామన్నారు. విద్య, పరిశోధన, విస్తరణే లక్ష్యంగా విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్తానన్నారు. ప్రతీ రైతు వద్దకు అధికారిని లేదా ఉద్యోగులను పంపలేమని... వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందజేసేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు. అందుకోసం ప్రత్యేకమైన యాప్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తామన్నారు. ఇప్పటివరకు తెలంగాణ సోనా విత్తనాలను 2 లక్షల ఎకరాల వరకు సరఫరా చేశామని... వచ్చే ఏడాది నుంచి 10 లక్షల ఎకరాలకు బ్రీడర్ సీడ్‌ను ఇస్తామన్నారు. పప్పుధాన్యాల విత్తన హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణను కేవలం దున్నడం ఇతరత్రా వరకే పరిమితం చేయకుండా విత్తడం, మొక్కల సంరక్షణ వరకు కూడా ఉపయోగించాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరే విద్యార్థుల్లో 40 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నారన్నారు. వారికి ఇంగ్లీషులో ప్రావీణ్యం కల్పించి సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షల్లో రాటుదేలేలా చేస్తామన్నారు. స్మార్ట్ క్లాస్‌రూంలను ఏర్పాటు చేస్తామన్నారు. అధ్యాపకులకు శిక్షణ ఇస్తామన్నారు. వర్సిటీలో పరిశోధనను బలోపేతం చేస్తామన్నారు. ఇదిలావుండగా వినాయక విగ్రహాలకు సహజ రంగులు అద్దితే పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందన్నారు. అందుకోసం హోంసైన్స్ కాలేజీ విద్యార్థులు తయారుచేసిన సహజరంగులను మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నామన్నారు. ఈసారి ఖైరతాబాద్ భారీ వినాయక విగ్రహానికి కూడా సహజరంగులతో తీర్చిదిద్దుతామన్నారు. ఈ ఏడాది 2 లక్షల చిన్న విగ్రహాలకు, 10 వేల భారీ విగ్రహాలకు సహజరంగులు సరఫరా చేస్తామన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లల్లో హైదరాబాద్‌లోని అన్ని విగ్రహాలకూ అవసరమైన సహజ రంగులను సరఫరా చేస్తామన్నారు. తాము రూపొందించిన సహజ రంగులకు పేటెంట్ హక్కు కోసం కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. బాధ్యతల స్వీకారం... ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు జారీ అయిన వె ంటనే ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సచివాలయంలోని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి వద్ద బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 2014 సెప్టెంబర్‌లో వ్యవసాయ వర్సిటీ ఏర్పడినప్పటి నుంచీ ఆయనే ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
రిమోట్ సెన్సింగ్‌తో భూయాజమాన్య పరీక్షలు
వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్‌రావు జగిత్యాల అగ్రికల్చర్: తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగత్మకంగా రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంతో భూ యాజమాన్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్‌రావు చెప్పారు. జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పరిశోధన స్థానాన్ని డాక్టర్ ప్రవీణ్‌రావు శుక్రవారం సందర్శించారు. తొలుత ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట, మెదక్ జిల్లా గజ్వేల్ ప్రాంతాల్లో అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఆ ప్రాంతాల్లోని భూమికి సంబంధించిన అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటామని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో ప్రతి గ్రామంలోని భూమిని రిమోట్ సెన్సింగ్‌తో పరిశీలన చేయనున్నట్లు చెప్పారు. సిరిసిల్ల, తోర్నాల, జమ్మికుంట, మాల్ తుమ్మెద ప్రాంతాల్లో వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొక్కజొన్న పరిశోధన కేంద్రాన్ని సిద్దిపేట ప్రాంతంలోని దోర్నాల వద్ద, ఫుడ్ సైన్స్ కళాశాలను నిజమాబాద్ జిల్లా రుద్రూర్లో, వేరుశెనగ ప్రాజెక్టును మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. చాల దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానం బదాలియింపు వంటి అంశాలపై వ్యవసాయ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంటున్నటు తెలిపారు. ప్రతి వ్యవసాయ పరిశోధనస్థానంలో రైతులకు అవసరమయ్యే అన్ని పనిముట్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 324 కోట్ల బడ్జెట్ ఉంటే, 290 కోట్లు జీతాలకే ఖర్చు అయ్యేదని, కేవలం అభివృద్ధికి కేటాయించిన రూ.34 కోట్లలో, తెలంగాణ ప్రాంతానికి రూ. 14.5 కోట్లు వచ్చేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో రూ. 89 కోట్ల బడ్జెట్ ఇచ్చారని, 2015-16 బడ్జెట్లో రూ. 89 కోట్లకు అదనంగా మరో రూ. 30 కోట్లు ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ యువ రైతు సాగుబడి కింద ఇప్పటివరకు 330 మందితో మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తయిందని అన్నారు. వ్యవసాయ విద్యార్థులు తమకు నచ్చిన అంశంపై ప్రతిరోజూ రేడియో ద్వారా రైతులను చైతన్య పరుస్తున్నారని చెప్పారు. కొత్త ప్రణాళికలను యూనివర్సిటీకి అన్వయించుకుని పరిశోధన ప్రగతిలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. జగిత్యాల, అశ్వరావుపేట, రాజేంద్రనగర్‌లలో ఉన్న వ్యవసాయ కళాశాలలతో పాటు, వరంగల్, పాలెం, పొలాస వ్యవసాయ పరిశోధన స్థానాలను సైతం మరింతగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ఉద్యోగుల ఆప్షన్లు పూర్తయిన వెంటనే ఖాళీగా ఉన్న శాస్త్రవేత్తల పోసులు భర్తీ చేస్తామని తెలిపారు. అనంతరం ప్రవీణ్‌రావు కళాశాలలోని ల్యాబ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ టీవీకే సింగ్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్ డాక్టర్ వాసుదేవ్, డెరైక్టర్ ఆఫ్ పాలిటెక్నిక్ డాక్టర్ ధర్మారెడ్డి, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జానయ్య, వ్యవసాయ పరిశోధన స్థానం డెరైక్టర్ డాక్టర్ లక్ష్మన్, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు మల్లారెడ్డి, ఉపేందర్, వెంకటయ్య, రాజేశ్వరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ వ్యవసాయ వర్సిటీకి సొంత చట్టం
ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సొంత చట్టం ఏర్పాటైందని ఆయూనివర్సిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇక వైస్ చాన్స్‌లర్‌ను నియమించడమే మిగిలివుందన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు కూడా లభించిందన్నారు. అవార్డులు, డిగ్రీలు ప్రదానం చేసుకునే అధికారం కలగడంతో పాటు, ఐసీఆర్లోనూ చోటు లభించిందన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే వ్యవసాయ సీట్లలో 15 శాతం అనగా 40 సీట్లు తెలంగాణకు దక్కుతాయన్నారు. ఐసీఆర్లోని మొత్తం 29 స్కీంలకు సంబంధించి ఎంవోయూలు పంపినట్లు ప్రవీణ్‌రావు వెల్లడించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల సంఘంలోనూ వర్సిటీకి సభ్యత్వం లభించిందన్నారు. విభజన తర్వాత సీట్లు పెంచాల్సిన అవసరముందని...ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. రూ. 2 కోట్లతో కాలేజీ, హాస్టళ్లను ఆధునీకరిస్తున్నామన్నారు. విభజన తర్వాత 2001 జనాభా ప్రకారం తెలంగాణకు 36 శాతం మాత్రమే సీట్లు వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 52:48 నిష్పత్తిలో జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విలేకరుల సమావేశంలో డి.రాజిరెడ్డి, అనురాగ్ చతుర్వేది, టీవీకే సింగ్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్పాదకత, ఉన్నత ఆలోచనలు
వీటిపై దృష్టిపెట్టి సాహసోపేతంగావ్యవహరించండి * ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఉద్బోధ * ఇన్ఫీకి మరోసారి గుడ్‌బై బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నెగ్గుకురావాలంటే వ్యక్తిగత ఉత్పాదకతపైనా, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్‌పైనా మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సూచించారు. ప్రతి ఇన్ఫోసియన్ (ఇన్ఫోసిస్ ఉద్యోగి) గొప్పగా ఆలోచించాలని, సాహసోపేతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కంపెనీ సీఈవో పగ్గాలను విశాల్ సిక్కాకి అప్పగించిన నేపథ్యంలో నారాయణమూర్తి శనివారం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి మరోసారి వైదొలిగారు. 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా షేర్హోల్డర్లు, ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వీడ్కోలు ప్రసంగంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. గడచిన ఏడాది కాలంగా తాను చేపట్టిన చర్యలతో కంపెనీ వ్యయాలు, రిస్కులు తగ్గగలవని, అమ్మకాలు మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్లు వైదొలగడంపై.. ఇటీవలి కాలంలో సీనియర్ల వలసకు కారణాలపై స్పందిస్తూ.. కొందరు ఉన్నత లక్ష్యాల సాధన కోసం వెళ్లగా, మరికొందరు సమర్థమైన పనితీరు కనపర్చలేక వైదొలిగారని మూర్తి వ్యాఖ్యానించారు. ‘దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికితీసి సంస్థను నిలబెట్టే అవకాశాన్ని వారికి కల్పించాలని, పనితీరు సరిగ్గా లేని వారిని.. వారు ఉండాల్సిన చోటుకి మార్చాలనే లక్ష్యంతో నేను ముందుకు సాగాను’ అని చెప్పారు. యోగ్యులైన వారిని లీడర్లుగా తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ పనితీరు కనపర్చే వారిని ప్రోత్సహించేందుకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ కెరియర్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మూర్తి తెలిపారు. రోహన్ మూర్తిపై.. ‘కొత్త ఆలోచనలు గలవారు, యథాతథ స్థితిని అంగీకరించని వారు, తెలివైనవారు నాకు సహాయంగా ఉండాలనుకున్నాను. అందుకే రోహన్‌ను వెంట తెచ్చుకున్నాను. టెక్నాలజీ ఊతంతో మార్కెట్లో ఇన్ఫోసిస్ విభిన్నంగా ఉండగలిగేలా.. చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టే బాధ్యతను అతనికి అప్పగించాను’ అంటూ కుమారుడు రోహన్ మూర్తిపై నారాయణ మూర్తి వివరణ ఇచ్చారు. మూర్తి సహాయకుడిగా రోహన్ మూర్తి పదవీ కాలం కూడా శనివారంతో ముగిసింది. అనుబంధ సంస్థకు ప్రొడక్టుల వ్యాపారం.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్, సొల్యూషన్స్ (పీపీఎస్) వ్యాపారాన్ని దాదాపు రూ. 480 కోట్లకు తమ అనుబంధ సంస్థ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కి బదలాయించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అయితే, ఇందులో బ్యాంకింగ్ సర్వీసుల సాఫ్ట్వేర్ పినాకిల్ ఉండదని సంస్థ పేర్కొంది. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఎడ్జ్వెర్వ్ను ఇన్ఫీ ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది. మూడేళ్లలో రెండోసారి వీడ్కోలు.. మూడు దశాబ్దాల క్రితం స్థాపించిన ఇన్ఫోసిస్ నుంచి మూర్తి 2011 ఆగస్టులో వైదొలిగిన సంగతి తెలిసిందే. 65 ఏళ్లు నిండటంతో కంపెనీ నిబంధనల ప్రకారం ఆయన తప్పుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇన్ఫీ పనితీరు అంతంత మాత్రంగా మారుతుండటంతో కంపెనీ బోర్డు ఒత్తిడి మేరకు గతేడాది జూన్ 1న మూర్తి మరోసారి సంస్థ పగ్గాలు చేపట్టారు. సహకరించేందుకు తన కుమారుడు రోహన్ మూర్తిని కూడా ఆయన వెంట తెచ్చుకోవడం వివాదాస్పదమైంది. తాజాగా ప్రముఖ టెక్నోక్రాట్ విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవోగా నియమితులైన నేపథ్యంలో కంపెనీ నుంచి వైదొలగాలని మూర్తి నిర్ణయించుకున్నారు. దీంతో మూడేళ్లలో రెండోసారి ఇన్ఫీకి గుడ్‌బై చెప్పినట్లయింది. వాస్తవానికి ఆయన 2013 జూన్ 1 నుంచి అయిదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగాల్సి ఉంది. ‘కొత్త మేనేజ్మెంట్కి బాధ్యతల బదలాయింపు సులభంగా జరిగేందుకు, టెక్నాలజీ రంగంలో ఇన్ఫోసిస్‌ను దిగ్గజంగా తీర్చిదిద్దే క్రమంలో సిక్కాకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో నేను ముందుగానే వైదొలుగుతున్నాను’ అని ఏజీఎంలో నారాయణ మూర్తి చెప్పారు. అక్టోబర్ 10 దాకా ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నుంచి చైర్మన్ ఎమెరిటస్‌గా కొనసాగుతారు.